E-Paper
Advertisement

Damien Martyn in coma: కోమాలోకి ఆస్ట్రేలియా వ‌ర‌ల్డ్ క‌ప్ హీరో…మెనింజైటిస్ అనే భ‌యంక‌ర‌మైన వ్యాధి ఎటాక్‌

Damien Martyn in coma: కోమాలోకి ఆస్ట్రేలియా వ‌ర‌ల్డ్ క‌ప్ హీరో…మెనింజైటిస్ అనే భ‌యంక‌ర‌మైన వ్యాధి ఎటాక్‌
Advertisement

Damien Martyn in coma: ఆస్ట్రేలియా క్రికెట్ అభిమానులకు ఊహించని షాక్ తగిలింది. ఆ జట్టుకు సంబంధించిన మాజీ క్రికెటర్, వరల్డ్ కప్ హీరో డామిన్ మార్టిన్ (Damien Martyn) ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా తయారయింది. ఒకప్పుడు ఆస్ట్రేలియా క్రికెట్ ను ఏలిన డామిన్ మార్టిన్ కోమాలోకి వెళ్లినట్లు వైద్యులు అధికారికంగా ప్రకటించారు. డిసెంబర్ 26వ తేదీన తీవ్ర అనారోగ్యంతో బ్రిస్బెన్ లోని ఓ ప్రముఖ ఆసుపత్రిలో చేరాడట మార్టిన్. అయితే ఆసుపత్రిలో చేరిన తర్వాత ఆయన పరిస్థితి మరింత విషమంగా తయారైందని వైద్యులు వెల్లడించారు. మెనింజైటిస్ అనే భయంకరమైన వ్యాధితో డామిన్ మార్టిన్ బాధపడుతున్నట్లు చెబుతున్నారు. ఇది మెదడు వాపు కు కారణం అవుతుందని కూడా స్పష్టం చేశారు. దీంతో ఆయన కోలుకోవడం కష్టమేనని చెబుతున్నారు వైద్యులు. పరిస్థితి మరింత విషమ‌మైతే, డామిన్ మార్టిన్ మృతి చెందడం కూడా జరుగుతుందని హెచ్చరిస్తున్నారట. దీంతో ఆస్ట్రేలియా క్రికెట్ అభిమానులు ఉలిక్కిపడుతున్నారు. వరల్డ్ కప్ తీసుకువచ్చిన డామిన్ మార్టిన్, ఇలా అనారోగ్యం బారిన పడటం చాలా బాధాకరం అంటూ పోస్టులు పెడుతున్నారు.

Also Read:  PAK VS SL T20 2026 : పాకిస్తాన్ జ‌ట్టు నుంచి బాబ‌ర్, రిజ్వాన్, షాహీన్ ఔట్.. షాక్ ఇచ్చిన పీసీబీ..!

మార్టిన్ కు సోకిన మెనింజైటిస్ ల‌క్ష‌ణాలు

Advertisement

ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్, వరల్డ్ కప్ హీరో డామిన్ మార్టిన్ (Damien Martyn) కు సోకిన మెనింజైటిస్ వ్యాధి గురించి ఒక‌సారి ప‌రిశీలిస్తే, వాస్తవంగా ఈ వ్యాధి మెదడు అలాగే వెన్నుపాముకు సంబంధించింది. ఈ రెండింటి చుట్టూ ఉండే రక్షిత పొరలే మెనింజైటిస్ వాపు. సాధారణ జలుబు, వైరస్ కారణంగా ఈ ప్రమాదకరమైన వ్యాధి వచ్చే ఛాన్స్ లు ఉంటాయి. బ్యాక్టీరియా వల్ల కూడా ఈ వ్యాధి సోకుతుందట. బ్యాక్టీరియా వల్ల ఈ వ్యాధి వస్తే తక్షణ చికిత్స అవసరమని చెబుతున్నారు. ఈ వ్యాధి సోకితే రోగ నిరోధక శక్తి పూర్తిగా తగ్గిపోతుందట. ఇక ఈ వ్యాధి సోకితే జ్వరం, తీవ్రమైన తలనొప్పి వస్తుందట. మెడ బిగుసుకుపోవడం, గందరగోళం లేదా స్పృహలో మార్పు వస్తుందట. వాంతులు కూడా జరుగుతాయట. వెళ్తురును చూడలేని పరిస్థితులు ఉంటాయని చెబుతున్నారు. సరైన సమయంలో ఈ వ్యాధికి ట్రీట్మెంట్ తీసుకోకపోతే ప్రమాదం జరిగే ఛాన్సులు ఉన్నట్లు చెబుతున్నారు.

ఆస్ట్రేలియా జ‌ట్టులో వ‌ర‌ల్డ్ క‌ప్‌ హీరో

ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మార్టిన్ తన క్రికెట్ చరిత్రలో అనేక రికార్డులు సృష్టించాడు. జట్టుకు విజయాలను కూడా అందించాడు. 2003 వన్డే వరల్డ్ కప్ సమయంలో ఫైనల్స్ లో కాలు విరిగినా కూడా 88 పరుగులు సాధించాడు. అలా వరల్డ్ కప్ హీరో అయిపోయాడు మార్టిన్. ఇక ఇప్పటివరకు 2008 వన్డేలు ఆడాడు మార్టిన్. ఇందులో 5346 పరుగులు చేశాడు. 67 టెస్టులు ఆడిన మార్టిన్ ఇందులో ఏకంగా 4406 పరుగులు చేసి చరిత్ర సృష్టించాడు. టీమిండియాలో రాహుల్ ద్రావిడ్ ఎలాగో ఆస్ట్రేలియా జట్టులో మార్టిన్ అలాగా ఆడేవాడు. వికెట్ పడకుండా, గోడ కట్టినట్లు బ్యాటింగ్ చేసేవాడు.

Advertisement

Also Read: Surya Kumar Yadav : సూర్య‌కుమార్ యాద‌వ్ అర్థ‌రాత్రి మెసెజ్ లు చేసేవాడు.. బాలీవుడ్ న‌టి సెన్షేష‌న్ కామెంట్స్

 

 

 

Related News

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 ఫైన‌ల్ మ్యాచ్ టైమింగ్స్ ఇవే..ఇండియాలో లైవ్ ఎప్పుడంటే ?

రెండు మ్యాచ్ ల‌కే గాయ‌ప‌డ్డ బుమ్రాతో వ‌ర‌ల్డ్ క‌ప్ గెలుస్తారా? గ‌వాస్క‌ర్ సీరియ‌స్‌

2027 వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్..త‌న డ్రీమ్ టీమిండియాను ప్ర‌క‌టించిన ర‌విశాస్త్రి

శ్రీలంక‌లో షాహీన్ అఫ్రిదికి ఘోర అవ‌మానం…ప్రీమియ‌ర్ బౌల‌ర్ కాస్త..మీడియం అయ్యాడు

టీమిండియా చాలా వీక్ గా ఉంది..పాకిస్తాన్ మ‌హిళ‌ల చేతిలో కూడా ఓడిపోవ‌డం ఖాయం!

రోహిత్ శ‌ర్మ‌ కూడా స్లాగ‌రే..గుడ్డిగా బ్యాట్ ఊపితే, వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వ‌లేరు

గంభీర్ ను వెధ‌వ‌ను చేసేందుకు రోహిత్ శ‌ర్మ PR స్టంట్..రిటైర్మెంట్, బొక్కా లేదు

దక్షిణాఫ్రికాలో వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వాలంటే, రోహిత్ శ‌ర్మ ఉండాల్సిందే

Big Stories

Advertisement
×