E-Paper
Advertisement

Prabhas Fans : ప్రేమతో ప్రభాస్ ఫ్యాన్స్ బిర్యానీ పంపిస్తే… మారుతి తినకుండా ఇలా చేశాడా?

Prabhas Fans : ప్రేమతో ప్రభాస్ ఫ్యాన్స్ బిర్యానీ పంపిస్తే… మారుతి తినకుండా ఇలా చేశాడా?
Advertisement

Prabhas Fans : పాన్ ఇండియా హీరో ప్రభాస్ అతిథి మర్యాదలు ఏ రేంజ్ లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తాను ఒక సినిమా చేస్తున్నాడు అంటే ఆ సినిమాకు సంబంధించిన ప్రతి ఒక్కరికి తన భోజనంతో మెప్పిస్తాడు.. ముఖ్యంగా హీరోయిన్ల కైతే ఇక చెప్పనక్కర్లేదు.. పనిచేసిన ప్రతి హీరోయిన్ కూడా ఆయన భోజనంపై ప్రశంసలు కురిపిస్తున్నారు.. తాజాగా రాజా సాబ్ డైరెక్టర్ మారుతికి అలాంటి మర్యాదలు దక్కాయి.. ఈసారి ప్రభాస్ కాదు.. ఆయన ఫ్యాన్స్ డైరెక్టర్ కు దిమ్మ తిరిగిపోయే షాకిచ్చారు. మా హీరో సినిమా తీస్తున్నారు కాబట్టి మీకు ఎటువంటి లోటు లేదని ఆయనను ఇబ్బందులకు గురి చేశారు. అసలు ఏం జరిగింది..? ప్రభాస్ ఫ్యాన్స్ డైరెక్టర్కు చేసిన మర్యాదలు ఏంటో కాస్త వివరంగా తెలుసుకుందాం..

డైరెక్టర్ కు ప్రభాస్ ఫ్యాన్స్ సర్ప్రైజ్..

రెబల్ స్టార్ ప్రభాస్, మారుతి కాంబినేషన్లో రాజా సాబ్ మూవీ రాబోతున్న విషయం తెలిసిందే.. సంక్రాంతి కానుకగా జనవరి 9న ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ కాబోతుంది. ప్రస్తుతం ఈ మూవీ ఈ చిత్ర యూనిట్ సినిమా ప్రమోషన్స్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు.. కేవలం ఒక వారం మాత్రమే ఉండడంతో జనాల్లోకి ఈ సినిమాని తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.. ఈ క్రమంలో ఇటీవలే ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ని నిర్వహించారు. ఈవెంట్లో సినిమా బాగోకపోతే మా ఇంటికి రండి అని డైరెక్టర్ మారుతీ ఇంటి అడ్రెస్ కూడా చెప్పాడు.. ప్రస్తుతం పలు ఛానెల్స్ కు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఇదిలా ఉండగా ఇటీవల రిలీజ్ అయిన ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ కు వచ్చింది. దాంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఏకంగా 6 బాక్సులు రకరకాల బిర్యానీ డైరెక్టర్ మారుతీ ఇంటికి పంపించారట.. ప్రభాస్ ఫ్యాన్స్ ఇచ్చిన సర్ప్రైజ్ గురించి మారుతి తన సోషల్ మీడియాలో షేర్ చేశారు. డార్లింగ్స్.. మాటల్లో చెప్పలేకపోతున్నా. నేను ఇంటికి వచ్చేసరికి సర్ ప్రైజ్ చేసారు. రాజాసాబ్ ట్రైలర్ ప్రేమతో బిర్యానీ పంపించినందుకు థ్యాంక్స్. జనవరి 9న మీకు రిటర్న్ ట్రీట్ ఇస్తాను అని పోస్ట్ చేసారు.. ఆ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..

Advertisement

Also Read : తెలుగు సీరియల్స్ లలో కన్నడ హీరోయిన్లు.. తెలుగు వాళ్లకు అందుకే ఛాన్స్ ఇవ్వట్లేదా..?

నెటిజన్ కు మారుతి స్ట్రాంగ్ కౌంటర్.. 

ఈ పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవ్వడంతో నెటిజన్లు దీనిపై స్పందిస్తున్నారు. నిన్న వైకుంఠ ఏకాదశి అవ్వడంతో నాన్ వెజ్ తినకూడదు అని ఓ నెటిజన్ కామెంట్ పెట్టగా.. నేను తిరుపతికి వెళ్లేముందు ఇవి వచ్చాయి. వైకుంఠ ఏకాదశితో పాటు, తిరుపతికి వెళ్తున్నాను.. అందుకే వాటిని నేను తినలేదు. కానీ వాళ్ళ ప్రేమని అర్ధం చేసుకున్నాను అని రిప్లై ఇచ్చాడు మారుతి… దీంతో ప్రభాస్ మాత్రమే కాదు వాళ్ళ ఫ్యాన్స్ కూడా అంటూ సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతుంది.. రాజా సాబ్ నుంచి ఇటీవల రిలీజైన ట్రైలర్ పై ఆడియో నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. దాంతో ఈ సినిమా పై రోజు రోజుకి అంచనాలు రెట్టింపు అవుతున్నాయి.. మరి థియేటర్లో ఎక్కువ వచ్చిన తర్వాత ఈ మూవీ టాక్ ఎలా ఉంటుందో చూడాలి..

Advertisement

Related News

‘విక్రమ్ 1’ ర్యాకెట్ ప్రయోగంలో జబర్దస్త్ సత్యశ్రీ చెల్లి కీలక పాత్ర.. ఆ ఫొటోలు షేర్ చేస్తూ నటి ఎమోషనల్!

నటిగా పీవీ సింధు.. ఆసక్తిని రేకెత్తిస్తున్న పోస్ట్!

చిన్న వయసులోనే గొప్ప మనసు చాటుకున్న సితార.. మహేష్ బాబు ఎమోషనల్ పోస్ట్!

టాలీవుడ్ లో నేషనల్ అవార్డు అందుకున్న తొలి చైల్డ్ ఆర్టిస్ట్ ఎవరంటే?

భాయ్ చిక్కిపోయాడని ఏడ్చేసిన ఫ్యాన్స్.. రివర్స్ సెటైర్ వేసిన సల్మాన్ !

రికార్డుల వేటలో ‘ది ఒడిస్సీ’..మన మేకర్స్ ఇప్పటికైనా మారతారా?

విదేశాల్లో షాట్లు.. ఏపీలో ఓట్లు! టాలీవుడ్ స్టార్స్‌పై అంబికా కృష్ణ మార్కు కౌంటర్లు!

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

Big Stories

Advertisement
×