E-Paper
Advertisement

Mohammed Siraj: సంజు, బుమ్రా కాదు..నా వ‌ల్లే టీమిండియాకు టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్

Mohammed Siraj: సంజు, బుమ్రా కాదు..నా వ‌ల్లే టీమిండియాకు టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్

Mohammed Siraj: టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ( T20 World Cup 2026 tournament )  విశ్వ విజేతగా టీమిండియా నిలిచిన సంగతి తెలిసిందే. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం ( Narendra Modi Stadium, Ahmedabad) వేదికగా ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ (Team  India vs New Zealand, Final ) మధ్య ఆదివారం ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఈ ఫైనల్ మ్యాచ్ లో 96 పరుగుల తేడాతో ఇండియా విక్టరీ సాధించింది. దీంతో దేశవ్యాప్తంగా సంబరాలు అంబరాన్ని అంటాయి. ఇక అహ్మదాబాద్ స్టేడియంలో టీమిండియా క్రికెటర్లు డాన్సులు చేస్తూ సందడి చేశారు. ఈ సందర్భంగా మహమ్మద్ సిరాజ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. సంజు శాంసన్, బుమ్రా వల్ల టి20 వరల్డ్ కప్ రాలేదని.. అంతా తన కృషి వల్ల వచ్చిందని బాంబు పేల్చాడు మహమ్మద్ సిరాజ్. దీంతో ఆయన చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అయ్యాయి.

Also Read: IND VS NZ Final: అహ్మ‌దాబాద్ మ‌ట్టిని నుదిటన రాసుకున్న సూర్య కుమార్, రోహిత్ శర్మను మించి సెల‌బ్రేష‌న్స్‌

నా వ‌ల్లే టీమిండియాకు టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్..సిరాజ్ సంచ‌ల‌నం

టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ( T20 World Cup 2026 tournament )  విజేతగా టీమిండియా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా మహమ్మద్ సిరాజ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన కృషి వల్ల టీమిండియా టైటిల్ గెలిచిందని పేర్కొన్నారు మహమ్మద్ సిరాజ్. టైటిల్ గెలిచిన తర్వాత టీమిండియా ప్లేయర్ లందరూ సంబరాలు చేసుకుంటున్న క్రమంలో మహమ్మద్ సిరాజ్ ను ఐసీసీకి చెందిన యాంకర్, టైటిల్ విజయం పై ఆసక్తికర ప్రశ్నలు అడిగారు. టీమిండియా ( Team India) విజయం వెనుక మీ పాత్ర ఏంటి ? అని మహమ్మద్ సిరాజ్ ను సదరు యాంకర్ ప్రశ్నిస్తాడు. ఇక దానికి తన స్టైల్ లో ఆన్సర్ ఇచ్చాడు మహమ్మద్ సిరాజ్.

టి20 వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్ ట్రోఫీని టీమిండియా గెలవడం వెనక తన కృషి ఎంతో ఉందని వ్యాఖ్యానించాడు మహమ్మద్ సిరాజ్. అందరికన్నా ఎక్కువ కష్టపడ్డది నేనేనని… టైటిల్ గెలిచిన క్రెడిట్ మొత్తం తనకే రావాలని షాకింగ్ కామెంట్స్ చేశాడు మహమ్మద్ సిరాజ్. టీమిండియా కోసం కష్టపడుతున్న ప్లేయర్లకు వాటర్ సప్లై చేశానని.. ఎవరు ఏది అడిగినా వాటర్ బాయ్ గా తన వంతు పాత్ర సంతృప్తిగా చేశానని వెల్లడించారు. అందువల్లే టీమిండియా ఎలాంటి రిస్క్ లేకుండా టైటిల్ గెలిచిందని నవ్వుతూ ఆన్సర్ ఇచ్చాడు. ఇక మహమ్మద్ సిరాజ్ ( Mohammed Siraj ) ఇచ్చిన ఆన్సర్ నేపథ్యంలో సదరు యాంకర్ తో పాటు కుల్దీప్ యాదవ్ ( Kuldeep yadav) పగలబడి నమ్ముకున్నారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. కాగా ఈ టోర్న‌మెంట్ లో చివ‌రి క్ష‌ణంలో సెల‌క్ట్ అయ్యాడు సిరాజ్. హ‌ర్షిత్ రాణాకు గాయం కావ‌డంతో సిరాజ్ బ‌రిలోకి వ‌చ్చాడు. కానీ ఆడే అవ‌కాశం ఎక్కువ‌గా రాలేదు.

 

Also Read: IND VS NZ Final: ముచ్చ‌ట‌గా మూడోసారి..టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విశ్వ విజేత‌గా టీమిండియా, ఫ్రైజ్ మ‌నీ ఎన్ని కోట్లంటే

 

 

 

 

 

?utm_source=ig_web_copy_link

Related News

Jos Buttler: న‌న్ను నంబ‌ర్ 4లో పంపి, ఆశిష్ నెహ్రానే స‌ర్వ నాశ‌నం చేశాడు !

బాబ‌ర్ పై ట్రోల్స్‌..ఇండియ‌న్స్ అనుకుని, ఆస్ట్రేలియా ఫ్యాన్స్ ను అరెస్ట్ చేసిన పాక్ !

మైదానంలోనే స్మోకింగ్..మ‌రో వివాదంలో టిమ్ డేవిడ్, ఇక ప‌ర్మినెంట్ బ్యాన్ !

టీమిండియాకు బిగ్ షాక్‌..బంగ్లాదేశ్ లోనే ఆసియా కప్ 2027, షెడ్యూల్ ఇదే

ఎలిమినేట‌ర్ లో ఓడిపోయిన‌ SRHకు ఊపిరిపోసిన పాకిస్తాన్ ప్లేయ‌ర్

రెండోసారి ఛాంపియ‌న్ గా RCB..ప్ర‌మాదంలో సూర్య‌, శ్రేయ‌స్ అయ్య‌ర్ భ‌విష్య‌త్తు !

Tanveer Ahmed: విరాట్ కోహ్లీ మ‌గాడైతే, పాకిస్తాన్ పిచ్ ల‌పై ఆడి చూపించాలి

లాహోర్ గ‌డ్డ‌పై విరాట్ కోహ్లీ ప్లకార్డులు…గూస్ బంప్స్ రావాల్సిందే

Big Stories

×