E-Paper
Advertisement

IND VS NZ Final: ముచ్చ‌ట‌గా మూడోసారి..టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విశ్వ విజేత‌గా టీమిండియా, ఫ్రైజ్ మ‌నీ ఎన్ని కోట్లంటే

IND VS NZ Final: ముచ్చ‌ట‌గా మూడోసారి..టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విశ్వ విజేత‌గా టీమిండియా, ఫ్రైజ్ మ‌నీ ఎన్ని కోట్లంటే

IND VS NZ Final: టి20 వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్ ( T20 World Cup 2026 tournament ) విశ్వ విజేతగా టీం ఇండియా నిలిచింది. ఇప్పటికే రెండు సార్లు ఛాంపియన్ అయిన టీమిండియా, ఇప్పుడు ముచ్చటగా మూడోసారి కూడా టి20 ప్రపంచ కప్ గెలుచుకుంది. టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ఫైనల్స్ లో టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ ( Team India vs New Zealand, Final ) మధ్య ఆదివారం ఫైనల్ జరిగిన సంగతి తెలిసిందే. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం ( Narendra Modi Stadium, Ahmedabad ) వేదికగా ఈ రెండు జట్లు ఫైనల్స్ లో తలపడ్డాయి. అయితే, ఈ ఫైన‌ల్ వార్ వ‌న్ సైడ్ అన్న‌ట్లుగా సాగింది. న్యూజిలాండ్ పై భారీ విజయాన్ని న‌మోదు చేసుకున్న టీమిండియా, విశ్వ విజేత‌గా నిలిచింది. టీమిండియా విధించిన 256 ప‌రుగుల ల‌క్ష్యాన్ని ఛేదించే క్ర‌మంలో న్యూజిలాండ్ చేతులెత్తేసింది. ఈ మ్యాచ్ లో 19 ఓవ‌ర్లు ఆడిన న్యూజిలాండ్, 159 ప‌రుగులు చేసింది ఆలౌట్ అయింది. దీంతో టీమిండియా చేతిలో 96 ప‌రుగుల తేడాతో చిత్తుగా ఓడింది న్యూజిలాండ్. ఈ క్ర‌మంలోనే టీమిండియా ఛాంపియ‌న్ గా నిలిచింది.

Also Read: Shaheen Afridi: అల్లాహ్ మీద ఒట్టు..2027 వ‌ర‌ల్డ్ క‌ప్ ఫైన‌ల్స్ లో ఇండియాను ఓడించ‌క‌పోతే పేరు మార్చుకుంటా

అద‌ర‌గొట్టిన‌ బుమ్రా.. ఫైన‌ల్ లో న్యూజిలాండ్ చిత్తు

టి20 ప్రపంచకప్ 2026 టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ న్యూజిలాండ్ వర్సెస్ టీమ్ ఇండియా మధ్య జరిగిన సంగతి తెలిసిందే. ఆదివారం అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరిగింది. ఇందులో టీమిండియా గ్రాండ్ విక్టరీ కొట్టిన సంగతి తెలిసిందే. అయితే 256 పరుగుల లక్ష్యాన్ని చేదించే క్రమంలో, న్యూజిలాండ్ ఆటగాళ్లకు జస్‌ప్రీత్ బుమ్రా ( Jasprit Bumrah ) చుక్కలు చూపించాడు. ఈ మ్యాచ్ లో నాలుగు ఓవర్లు వేసిన బూమ్ బూమ్ బుమ్రా నాలుగు వికెట్ పడగొట్టాడు. కేవలం 15 పరుగులు మాత్రమే ఇచ్చాడు జస్‌ప్రీత్ బుమ్రా. ఈ దెబ్బకు న్యూజిలాండ్ కుప్పకూలింది. అటు అక్షర్ పటేల్ మొదట్లోనే మూడు వికెట్లు పడగొట్టాడు. అభిషేక్ శ‌ర్మ‌, వరుణ్ చక్రవర్తి అలాగే హార్దిక్ పాండ్యా తలో వికెట్ పడగొట్టారు. ఈ దెబ్బ‌కు 19 ఓవ‌ర్లు ఆడిన న్యూజిలాండ్, 159 ప‌రుగులు చేసింది ఆలౌట్ అయింది. దీంతో భార‌త దేశ వ్యాప్తంగా సంబ‌రాలు మొద‌ల‌య్యాయి.

 

ఫ్రైజ్ మ‌నీ ఎన్ని కోట్లంటే

ముచ్చటగా మూడోసారి టీమిండియా టి20 వరల్డ్ కప్ టోర్నమెంట్ గెలిచిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా సంబరాలు అంబరాన్ని అంటాయి. అయితే టైటిల్ గెల్చుకున్న టీమిండియా కు ఐసీసీ నుంచి భారీ స్థాయిలో ప్రైజ్ మనీ ( T20 WORLD CUP 2026 PRIZE MONEY ) దక్కనుంది. ముందుగా నిర్ణయించిన ప్రకారం విశ్వ విజేత టీమిండియా కు ఐసీసీ ద్వారా 27.50 కోట్లు దక్కనున్నాయి. అలాగే ఇండియా చేతిలో ఫైనల్ లో ఓడిపోయిన రన్నరప్ జట్టు న్యూజిలాండ్ కు 13.67 కోట్లు వస్తాయి. సెమీఫైనల్స్ దాకా వచ్చి ఓటమి చెందిన ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా జట్లకు చెరో 7.24 కోట్లు దక్కనున్నాయి. ఇక సూపర్ ఎనిమిది దశలో నిలిచిన జట్లకు 3.48 కోట్లు దక్కుతాయి. గ్రూప్ స్టేజీల్లో ఎలిమినేట్ అయిన జట్లకు 2.29 కోట్లు దక్కుతాయి. పాకిస్తాన్ జట్టుకు 3.48 కోట్లు రానున్నాయి.

Also Read: Tanveer Ahmed: 15వ‌ ఓవర్ నుంచే ఫిక్సింగ్…క్యూరేటర్ మెడ‌పై క‌త్తి పెట్టి, పిచ్ అనుకూలంగా జై షా మార్చుకున్నాడు

 

Related News

Tanveer Ahmed: బాబ‌ర్ ను ఐపీఎల్ లోకి తీసుకోండి..వైభ‌వ్ కంటే భ‌యంక‌రంగా ఆడ‌తాడు

వైభ‌వ్ ఇంకా స్కూల్ లోనే ఉంటే బాగుండు.. వాడికి బౌలింగ్ వేయాలంటేనే భ‌య‌మెస్తోంది

Jos Buttler: న‌న్ను నంబ‌ర్ 4లో పంపి, ఆశిష్ నెహ్రానే స‌ర్వ నాశ‌నం చేశాడు !

బాబ‌ర్ పై ట్రోల్స్‌..ఇండియ‌న్స్ అనుకుని, ఆస్ట్రేలియా ఫ్యాన్స్ ను అరెస్ట్ చేసిన పాక్ !

మైదానంలోనే స్మోకింగ్..మ‌రో వివాదంలో టిమ్ డేవిడ్, ఇక ప‌ర్మినెంట్ బ్యాన్ !

టీమిండియాకు బిగ్ షాక్‌..బంగ్లాదేశ్ లోనే ఆసియా కప్ 2027, షెడ్యూల్ ఇదే

ఎలిమినేట‌ర్ లో ఓడిపోయిన‌ SRHకు ఊపిరిపోసిన పాకిస్తాన్ ప్లేయ‌ర్

రెండోసారి ఛాంపియ‌న్ గా RCB..ప్ర‌మాదంలో సూర్య‌, శ్రేయ‌స్ అయ్య‌ర్ భ‌విష్య‌త్తు !

Big Stories

×