E-Paper
Advertisement

IND VS NZ Final: అహ్మ‌దాబాద్ మ‌ట్టిని నుదిటన రాసుకున్న సూర్య కుమార్, రోహిత్ శర్మను మించి సెల‌బ్రేష‌న్స్‌

IND VS NZ Final: అహ్మ‌దాబాద్ మ‌ట్టిని నుదిటన రాసుకున్న సూర్య కుమార్, రోహిత్ శర్మను మించి సెల‌బ్రేష‌న్స్‌

IND VS NZ Final: టి20 వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్ ( T20 World Cup 2026 tournament ) విజేతగా మరోసారి టీమిండియా నిలిచింది. 2007,2024 సంవత్సరాలలో జరిగిన టి20 వరల్డ్ కప్ లో టీమిండియా ఛాంపియన్ గా నిలిచింది. మహేంద్ర సింగ్ ధోని నాయకత్వంలో ఒకసారి టైటిల్ అందుకున్న టీమిండియా, 2024లో రోహిత్ శర్మ ఆధ్వర్యంలో మరోసారి టైటిల్ దక్కించుకుంది. ఇక ఇప్పుడు ముచ్చటగా మూడోసారి న్యూజిలాండ్ ను చిత్తు చేసి సూర్య కుమార్ యాదవ్ సేన ఛాంపియన్ గా నిలిచింది. ఫైనల్ మ్యాచ్ లో న్యూజిలాండ్ 96 పరుగుల తేడాతో ఓడించిన టీమిండియా, టైటిల్ గెల్చుకుంది. ఈ నేపథ్యంలోనే భారత దేశవ్యాప్తంగా సంబరాలు అంబరాన్ని అంటాయి.

Also Read: Tanveer Ahmed: 15వ‌ ఓవర్ నుంచే ఫిక్సింగ్…క్యూరేటర్ మెడ‌పై క‌త్తి పెట్టి, పిచ్ అనుకూలంగా జై షా మార్చుకున్నాడు

న్యూజిలాండ్ ను చిత్తు చేసిన టీమిండియా

టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ( T20 World Cup 2026 tournament )  ఫైనల్ మ్యాచ్ టీమిడియా వర్సెస్ న్యూజిలాండ్ ( Team India vs New Zealand, Final )  మధ్య జరిగిన సంగతి తెలిసిందే. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం  ( Narendra Modi Stadium, Ahmedabad ) వేదికగా ఈ ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఇందులో టాస్ ఓడిపోయి టీమిండియా మొదట బ్యాటింగ్ చేసింది. ఈ క్రమంలో 20 ఓవర్లు వాడిన టీమ్ ఇండియా, ఐదు వికెట్ల నష్టానికి 255 పరుగులు సాధించింది. సంజు శాంసన్ 46 బంతుల్లో 89 పరుగులు చేయగా, మరో ఓపినర్ అభిషేక్ శర్మ టచ్ లోకి వచ్చి 52 పరుగులు చేశాడు. ఇషాన్ కిషన్ 54 పరుగులతో రాణించగా చివరలో శివం దుబే 325 స్ట్రైక్ రేట్ తో రెచ్చిపోయాడు.

ఈ క్రమంలో 8 బంతుల 26 పరుగులు సాధించాడు శివం దుబే. ఇక ఈ 256 పరుగుల లక్ష్యాన్ని చేదించే క్రమంలో న్యూజిలాండ్ ఆటగాళ్లు చేతులెత్తేశారు. ఎక్కడ కూడా పోటీ ఇచ్చినట్టు కనిపించలేదు. దీంతో 19 ఓవర్లు వాడిన న్యూజిలాండ్ 159 పరుగుల వద్ద కుప్పకూలింది. దీంతో టీమ్ ఇండియా 96 పరుగులు తేడాతో విజయం సాధించి, ఛాంపియన్ అయింది. ఈ ఫైనల్ మ్యాచ్ లో బూమ్ బూమ్ బుమ్రా నాలుగు వికెట్లు పడగొట్టగా అక్షర్ ప‌టేల్ 3 వికెట్లతో అదరగొట్టాడు. అటు అభిషేక్ శర్మ, వరుణ్ చక్రవర్తి, హార్దిక్ పాండ్యా తలో వికట్ తీశారు.

అహ్మ‌దాబాద్ మ‌ట్టిని నుదిటన రాసుకున్న సూర్య కుమార్ యాద‌వ్

టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ గెలిచిన సంతోషంలో అహ్మ‌దాబాద్ మ‌ట్టిని నుదిటన రాసుకున్నాడు సూర్య కుమార్ యాద‌వ్. 2023 లో ఇదే వేదిక‌గా వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్ మిస్ చేసుకున్న టీమిండియా, ఇప్పుడు మాత్రం టైటిల్ గెలిచింది. దీంతో అహ్మ‌దాబాద్ మ‌ట్టిని నుదిటన రాసుకున్నాడు సూర్య కుమార్ యాద‌వ్. భార‌త సంప్ర‌దాయం ప్ర‌కారం ఇలా చేస్తే, ఆ మ‌ట్టిని దైవంతో స‌మానం చూసిన‌ట్లు చెబుతారు. ఇప్పుడు అదే చేసి చూపించాడు సూర్య‌. 2024లో టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ గెలిచిన త‌ర్వాత పిచ్ మ‌ట్టిన తిన్నాడు రోహిత్ శ‌ర్మ. ఇక తాజాగా టైటిట్ గెలిచిన త‌ర్వాత అహ్మ‌దాబాద్ మ‌ట్టిని నుదిట‌న రాసుకున్నాడు సూర్య‌.

Also Read: Shaheen Afridi: అల్లాహ్ మీద ఒట్టు..2027 వ‌ర‌ల్డ్ క‌ప్ ఫైన‌ల్స్ లో ఇండియాను ఓడించ‌క‌పోతే పేరు మార్చుకుంటా

 

Related News

Shreyas Iyer: వివాదంలో శ్రేయస్ అయ్య‌ర్‌…అంపైర్ పై దాడికి య‌త్నం !

బ‌ల‌హీనమైన గుజ‌రాత్ పై గెలిచి బిల్డ‌ప్ ఇస్తున్నారు..RCB ప‌రువు తీసిన అంబ‌టి !

Pakistan : పాకిస్తాన్ కోచ్ గా వీరేంద్ర సెహ్వాగ్ ? PCB షాకింగ్ నిర్ణ‌యం

Tanveer Ahmed: బాబ‌ర్ ను ఐపీఎల్ లోకి తీసుకోండి..వైభ‌వ్ కంటే భ‌యంక‌రంగా ఆడ‌తాడు

వైభ‌వ్ ఇంకా స్కూల్ లోనే ఉంటే బాగుండు.. వాడికి బౌలింగ్ వేయాలంటేనే భ‌య‌మెస్తోంది

Jos Buttler: న‌న్ను నంబ‌ర్ 4లో పంపి, ఆశిష్ నెహ్రానే స‌ర్వ నాశ‌నం చేశాడు !

బాబ‌ర్ పై ట్రోల్స్‌..ఇండియ‌న్స్ అనుకుని, ఆస్ట్రేలియా ఫ్యాన్స్ ను అరెస్ట్ చేసిన పాక్ !

మైదానంలోనే స్మోకింగ్..మ‌రో వివాదంలో టిమ్ డేవిడ్, ఇక ప‌ర్మినెంట్ బ్యాన్ !

Big Stories

×