Usman Tariq-Cameron Green: ఆస్ట్రేలియా వర్సెస్ పాకిస్తాన్ ( Pakistan vs Australia) మధ్య టి20 సిరీస్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ రెండు జట్ల మధ్య రెండు మ్యాచ్ లు ఫినిష్ అయ్యాయి. ఇవాళ మరో మ్యాచ్ జరగనుంది. అయితే నిన్న పాకిస్తాన్ లోని గడాఫీ వేదికగా రెండవ టి20 మ్యాచ్ జరిగింది. ఇందులో పాకిస్తాన్ 90 పరుగుల తేడాతో విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్ సందర్భంగా పాకిస్తాన్ కు చెందిన ఉస్మాన్ తారిక్ ( Usman Tariq) బౌలింగ్ యాక్షన్ పై ఆస్ట్రేలియా డేంజర్ ప్లేయర్ కామెరాన్ గ్రీన్ ( Cameron Green) అనుమానం వ్యక్తం చేశారు. వాడు త్రో బౌలింగ్ వేస్తున్నాడని, సైగలు చేస్తూ ఉస్మాన్ తారిక్ (Usman Tariq Bowling action) పరువు తీశాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.
Also Read: Yuvraj Singh: యువరాజ్ ఇంత కామాంధుడా ? హీరోయిన్ తో శృంగారం.. ఆస్ట్రేలియా హోటల్ లో చెప్పులు కూడా !
ఆస్ట్రేలియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య నిన్న రెండవ టీ20 జరిగింది. ఇందులో మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 20 ఓవర్లు ఆడింది. ఈ నేపథ్యంలోనే ఐదు వికెట్లు నష్టపోయిన పాకిస్తాన్ 198 పరుగులు సాధించింది. ఈ లక్ష్యాన్ని చేదించే క్రమంలో ఆస్ట్రేలియా అట్టర్ ప్లాప్ అయింది. 15.4 ఓవర్లు ఆడింది ఆస్ట్రేలియా. ఈ నేపథ్యంలోనే 108 పరుగులు చేసి కుప్ప కూలింది. అయితే ఈ మ్యాచ్ సందర్భంగా ఉస్మాన్ తారిక్ అద్భుతమైన స్పెషల్ వేశాడు. కేవలం 2.4 ఓవర్లు వేసిన పాకిస్తాన్ బౌలర్ ఉస్మాన్ తారిక్, 16 పరుగులు ఇచ్చి రెండు కీలక వికెట్లు పడగొట్టాడు. ఇందులో కామెరాన్ గ్రీన్, మాథ్యూ కుహ్నేమాన్ వికెట్లు ఉన్నాయి.
అయితే ఈ మ్యాచ్ లో కెమెరాన్ గ్రీన్ 20 బంతుల్లో 35 పరుగులు సాధించాడు. అదే ఊపు కొనసాగిస్తే ఆస్ట్రేలియాను గెలిపిస్తాడని అందరూ అనుకున్నారు. ఆ సమయంలోనే మిస్టరీస్ విన్నర్ ఉస్మాన్ తారిక్ ను తెలివిగా పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ అలీ అఘా బరిలోకి దింపాడు. ఇంకేముంది అతని మొదటి ఓవర్ లోనే కెమెరాన్ గ్రీన్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. దీంతో చాలా సీరియస్ అయిపోయిన కెమెరాన్ గ్రీన్, పెవిలియన్ కు వెళ్తూ ఉస్మాన్ తారిక్ పరువు తీశాడు. వాడు త్రో బౌలింగ్ వేస్తున్నాడని చేతులతో సైగలు చేస్తూ వివాదానికి తెర లేపాడు. ఉస్మాన్ తారిక్ బౌలింగ్ పై ఐసీసీ యాక్షన్ తీసుకోవాలని ఆస్ట్రేలియా క్రికెట్ సభ్యులతో చర్చించాడు గ్రీన్. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో ఉస్మాన్ తారిక్ బౌలింగ్ యాక్షన్ పై కెమెరాన్ గ్రీన్ అసహనం వ్యక్తం చేశాడు. అయితే ఈ వ్యవహారంపై ఐసీసీకి ఫిర్యాదు చేసేందుకు ఆస్ట్రేలియా సిద్ధమైందట. ఒకవేళ దీనిపై ఐసీసీ సీరియస్ అయి, ఉస్మాన్ తారిక్ పై వేటు వేస్తే పాకిస్తాన్ కు పెను ప్రమాదమే. ఈ మిస్టరీ స్పిన్నర్ ఉస్మాన్ తారిక్ ద్వారా టి20 ప్రపంచకప్ 2026 టోర్నమెంట్ లో ఇండియన్ దెబ్బకొట్టాలని ప్లాన్ సిద్ధం చేసుకుంది పాకిస్తాన్. ఆ లోపే ఉస్మాన్ తారిక్ పై వేటు పడితే పాకిస్తాన్ అడుక్కు తినడం గ్యారెంటీ అంటున్నారు.
?utm_source=ig_web_copy_link
Cameron Green called out Usman Tariq for Chucking after getting out in 2nd T20i match.
Tom Banton called out Usman Tariq for Chucking in ILT20 .
PSL banned him for Dhela bowling.
T20 World Cup 2026 & Is ICC sleeping? How is he not banned & Pakistan?
— MANU. (@IMManu_18) January 31, 2026