E-Paper
Advertisement

Jio Hotstar : ట్రెండింగ్ లో ఈ 1 గంట 42 నిమిషాల హర్రర్ మూవీ… ఒళ్లు ఝల్లుమన్పించే జర్నీ

Jio Hotstar : ట్రెండింగ్  లో ఈ 1 గంట 42 నిమిషాల హర్రర్ మూవీ… ఒళ్లు ఝల్లుమన్పించే జర్నీ
Advertisement

Jio Hotstar : ఓటీటీలో ఎక్కువగా హర్రర్ జానర్ సినిమాలను చూసేందుకు ఆడియన్స్ ఇష్టపడుతున్నారు. ఈ జానర్‌లోని సినిమాల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు కూడా. అయితే ఇప్పుడు మనం 1 గంట 42 నిమిషాల నిడివితో ప్రేక్షకులను తెగ భయపెడుతున్న ఇక సినిమా గురించి చెప్పుకోబోతున్నాం. ఈ సినిమా ఓటీటీలోకి వచ్చినప్పటినుంచి టాప్ ట్రెండింగ్ లో చోటు సంపాదించుకుంది. మరి ఈ సినిమా పేరు, ఏ ఓటీటీలో చూడవచ్చు అనే విషయాలను తెలుసుకుందాం పదండి.

ఏ ఓటీటీలో ట్రెండింగ్ అంటే

ఈ ఇండోనేషియా హర్రర్ థ్రిల్లర్ మూవీ పేరు “ది ట్రైన్ ఆఫ్ డెత్” (The Train of Death). దీనికి రిజాల్ మంటోవాని దర్శకత్వం వహించారు. ఇందులో హనా మలాసన్, జారా లియోలా, మరియు ఫద్లీ ఫైసల్ లీడ్ రోల్స్ లో నటించారు. 2024 లో వచ్చిన ఈ సినిమా జియో హాట్‌స్టార్ లో అందుబాటులో ఉంది. ఈ చిత్రంలో ఉండే ఉత్కంఠభరితమైన కంటెంట్‌ను ప్రజలు ఇష్టపడుతున్నారు. అందుకే జియో హాట్‌స్టార్‌ (Jio Hotstar) లో ఈ సినిమా ట్రెండింగ్‌లో 9వ స్థానానికి చేరుకుంది. అయితే ఒంటరిగా మాత్రం ఈ సినిమాని చూడకండి.

స్టోరీ ఏమిటంటే

Advertisement

క్యాన్సర్ వ్యాధి నుండి కోలుకున్న సంతోషంలో పూర్ణిమ, తన చెల్లెలు కెంబంగ్‌తో కలిసి ఒక రిసార్ట్‌కు వెళ్లాలని నిర్ణయించుకుంటుంది. ఇందుకోసం వాళ్ళు అడవి గుండా వెళ్లే ఒక ప్రత్యేక రైలును ఎక్కుతారు. ప్రయాణం మొదట్లో సరదాగా సాగినప్పటికీ, రైలు ఒక చీకటి సొరంగం లోకి ప్రవేశించినప్పుడల్లా ఒక భయంకరమైన సంఘటన జరుగుతుంది. ప్రతి టన్నెల్ దాటిన తర్వాత రైలు చివరి భోగీ వింతగా మాయమవ్వడమే కాకుండా, అందులోని ప్రయాణికులు అత్యంత ఘోరంగా ప్రాణాలు కోల్పోతుంటారు.

ఈ మరణాల వెనుక ఒక భయంకరమైన అతీంద్రియ శక్తి ఉందని పూర్ణిమ గ్రహిస్తుంది. ఆ రైల్వే ట్రాక్ నిర్మించడానికి అడవిని ధ్వంసం చేసినందుకు, ఆ అడవిలోని దెయ్యం ప్రతీకారం తీర్చుకుంటుందని వాళ్ళకి అర్థమవుతుంది. మిగిలిన ప్రయాణికులతో కలిసి పూర్ణిమ ఆ దెయ్యం నుండి ఎలా తప్పించుకుంది? చివరికి రైలు గమ్యాన్ని చేరుకుందా ? అన్నదే ఈ సినిమాలో ఉన్న ఉత్కంఠభరితమైన క్లైమాక్స్.

Advertisement

Read Also : MDbలో 7.8 రేటింగ్… థియేటర్లలో డిజాస్టర్‌… ఓటీటీలో మాత్రం 24 గంటల్లోనే ట్రెండింగ్‌ నంబర్ 1లో

Related News

Friday OTT Releases : శుక్రవారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు.. ఏకంగా 14 స్ట్రీమింగ్…!

అడగకుండా సినిమా తీశారని హత్యలు… హారర్ క్లాసిక్స్ కి నవ్వుల ట్రీట్… ఓటీటీని షేక్ చేస్తున్న ఐకానిక్ పారడీ ఫిల్మ్

అధ్యక్షుడి కేక్ వెనుక దాగిన భయంకరమైన కుట్ర… ఆస్కార్ రేసులో నిలిచిన డార్క్ పొలిటికల్ కామెడీ డ్రామా

మన చుట్టూ జరిగే భయంకరమైన దారుణాలు… గజగజ వణికించే రియల్ లైఫ్ క్రైమ్ ఆంథాలజీ

కెరీర్ కాపాడుకోవడానికి ఫుట్‌బాల్ స్టార్ చేసిన పిచ్చి పని… ఓటీటీలో రచ్చ చేస్తున్న గ్లెన్ పావెల్ ఐకానిక్ కామెడీ స్పోర్ట్స్ డ్రామా

బిలియనీర్ల ప్రపంచంలో బుర్రపాడు పనులు… పార్ట్-1 సీట్ ఎడ్జ్ హిట్ తర్వాత వస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెల్

కిడ్నాపైన కూతురి కోసం అండర్‌వరల్డ్‌ను అల్లాడించిన తల్లి… నెట్‌ఫ్లిక్స్‌ని షేక్ చేస్తున్న సీట్-ఎడ్జ్ రివేంజ్ డ్రామా తెలుగులో

మ్యూజిక్‌తో ప్రపంచాన్ని ఏలిన పాప్ లెజెండ్ రియల్ స్టోరీ… కళ్లు చెమర్చేలా చేసే మ్యూజికల్ డాక్యుమెంటరీ

Big Stories

Advertisement
×