Gautam Gambhir: టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ( T20 World Cup 2026 tournament ) విజేతగా టీమిండియా నిలిచిన సంగతి తెలిసిందే. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం ( Narendra Modi Stadium, Ahmedabad ) వేదికగా టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ ( India vs New Zealand, Final ) మధ్య ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఈ ఫైనల్ మ్యాచ్ లో 96 పరుగులు తేడాతో విజయం సాధించిన టీమిండియా, ముచ్చటగా మూడవసారి టైటిల్ అందుకుంది. 2007 అలాగే 2024 సీజన్ లలో టైటిల్ గెలుచుకున్న టీమిండియా ఇప్పుడు సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో మరో టైటిల్ అందుకుంది. దీంతో టీమిండియా హెచ్ కోచ్ గౌతమ్ గంభీర్ కెప్టెన్సీపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ తరుణంలోనే ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీతో టీమిండియా హెచ్ కోచ్ గౌతమ్ గంభీర్ పోల్చుతున్నారు.
టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ పై ( Gautam Gambhir) దారుణంగా పోస్టులు పెడుతున్నారు. ఇరాన్ సుప్రీం ఆయతుల్లా అలీ ఖమేనీ ( Ayatollah Ali Khamenei) తరహాలోనే.. టీమిండియాలో గౌతమ్ గంభీర్ పెత్తనం చెలాయిస్తున్నాడని కొంత మంది పోస్టులు పెట్టి రచ్చ చేస్తున్నారు. అదే సమయంలో ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ తరహాలోనే ఇండియాకు ఎన్నో విజయాలను, ట్రోఫీలను గంభీర్ అందించాలని వెల్లడిస్తున్నారు. ముఖ్యంగా టీ20 ఫార్మాట్ లో టీమిండియా జట్టును బలంగా తయారు చేసిన ఘనత కేవలం గౌతమ్ గంభీర్ కు దక్కుతుందని చెబుతున్నారు. గంభీర్ నాయకత్వంలోనే టి20 ప్రపంచ కప్ 2026, ఛాంపియన్ ట్రోఫీ 2025, ఆసియా కప్ 2025 ట్రోఫీలు టీమిండియా కు దక్కాయని గుర్తు చేస్తున్నారు. ఇరాన్ సుప్రీం ఖమేనీ కూడా… తమ దేశం కోసం గట్టిగా పోరాడుతాడని.. చావు ఎదురు వచ్చినా భయపడబోడని వెల్లడిస్తున్నారు.
అమెరికా అలాగే ఇజ్రాయిల్ లాంటి బలమైన దేశాలను ఇరాన్ గట్టిగా ఎదుర్కోవడం వెనుక ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ ఉన్న సంగతిని గుర్తు చేస్తున్నారు. చనిపోయే వరకు అతడు ఏమాత్రం తగ్గలేదని పొగుడుతున్నారు. ఇప్పుడు టీమిండియాలో కూడా గౌతమ్ గంభీర్ అదే పాత్రను పోషిస్తున్నాడని.. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీతో పోల్చుతున్నారు కొంతమంది. అందుకే ఖమేనీ తరహాలోనే గౌతమ్ గంభీర్ కు గెటప్ చేసి సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. టీమిండియా విజయం కోసం గౌతమ్ గంభీర్ కూడా చాలా కష్టపడతాడని.. ఎత్తులకు పై ఎత్తులు వేస్తాడని ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అందుకే టీమిండియా ( Team India) మూడు ట్రోఫీలను గౌతమ్ గంభీర్ ఆధ్వర్యంలోనే గెలుచుకుందని గుర్తు చేస్తున్నారు ఫ్యాన్స్.