Gautam Gambhir: టీమిండియా వర్సెస్ దక్షిణాఫ్రికా ( India vs South Africa) మధ్య ప్రస్తుతం వన్డే సిరీస్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ వన్డే సిరీస్ లో రెండు పూర్తికాగా, ఇవాళ వైజాగ్ వేదికగా చిట్టచివరి వన్డే జరగనుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే దక్షిణాఫ్రికా తో పాటు టీమ్ ఇండియా ప్లేయర్లు విశాఖపట్నం చేరుకొని ప్రాక్టీస్ చేస్తున్నారు. ఇవాళ మధ్యాహ్నం మ్యాచ్ జరగనుంది. ఈ తరుణంలోనే, సింహాచలంలో దర్శనం ఇచ్చారు గంభీర్.
Also Read: MS Dhoni: గంబీర్ సేఫ్…బీసీసీఐతో అజిత్ అగార్కర్ గొడవ, రాజీనామా చేయనంటూ పట్టు, ధోనికి ఆ పోస్ట్ ?
విశాఖపట్నంలోని వైయస్ రాజశేఖర్ రెడ్డి అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం ( Dr. Y.S. Rajasekhara Reddy ACA-VDCA Cricket Stadium, Visakhapatnam) వేదికగా దక్షిణాఫ్రికా వర్సెస్ టీమ్ ఇండియా ( India vs South Africa, 3rd ODI) మధ్య మూడవ వన్డే జరగనుంది. ఈ నేపథ్యంలో రెండు రోజుల ముందే వైజాగ్ వచ్చిన టీమిండియా ప్లేయర్లు అక్కడి అందాలు ఆస్వాదిస్తున్నారు. కొంత మంది ప్రాక్టీస్ పైన దృష్టి పెడితే, మరి కొంత మంది వైజాగ్ బీచ్ చూసేందుకు వెళ్లారు. గౌతమ్ గంభీర్ తన హిందుత్వాన్ని మరోసారి చాటుకున్నారు. బిజెపి పార్టీ నుంచి రాజకీయ అరంగేట్రం చేసిన ఆయన ప్రస్తుతం కోచ్గా కొనసాగుతున్నారు.
ఎక్కడికి వెళ్లినా దేవాలయాలకు వెళ్లే గౌతమ్ గంభీర్, తాజాగా విశాఖపట్నం సమీపంలో ఉన్న సింహాచలం ఆలయానికి వెళ్లారు. ఈ సందర్భంగా టీమిండియా గెలవాలని ప్రత్యేక పూజలు చేశారు గౌతమ్ గంభీర్. అనంతరం సింహా చలంలో ఆచారంగా వస్తున్న కార్యక్రమాల్లో కూడా పాల్గొన్నారు. ఇందులో భాగంగానే ఓ స్తంభానికి గౌతమ్ గంభీర్ ను కట్టేసి, పూజారులు ఆశీర్వాదం ఇచ్చారు. అలా పూజారుల సమక్షం లో స్తంభానికి కట్టేస్తే, మంచి జరుగుతుందని అక్కడి ప్రజలు నమ్ముతూ ఉంటారు. అందుకే Team India Head Coach గౌతమ్ గంభీర్ ( GautamGambhir) పూజలకు కూడా పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ఫోటో అలాగే వీడియో వైరల్ గా మారింది.
టీమిండియా వర్సెస్ దక్షిణాఫ్రికా ( India vs South Africa, 3rd ODI) మధ్య విశాఖ వేదికగా ఇవాళ వన్డే జరగనున్న నేపథ్యంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. విశాఖపట్నం చుట్టుపక్కల ఉన్న రోడ్లపై తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి ఫోటోలు, కటౌట్లు దర్శనమిచ్చాయి. రోడ్డు మధ్యలో డివైడర్ల పైన నితీష్ కుమార్ రెడ్డి ( Nitish kumar reddy) కటౌట్లు కట్టి తమ అభిమానాన్ని చాటుకున్నారు ఫ్యాన్స్. నితీష్ కుమార్ రెడ్డి ఏపీకి చెందిన వాడున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే నితీష్ కుమార్ రెడ్డి హవా విశాఖపట్నంలో కొనసాగుతోంది.
Also Read: Hardik Pandya: ఏంట్రా ఈ అరాచకం..జిమ్ లో వర్కౌట్స్ కాదు, పాండ్యా-మహికా శర్మ ముద్దులాట
?igsh=MWZuYXNoZHlhYTBueA%3D%3D
?igsh=MXZtMjcwaTIxcDUzeA%3D%3D