E-Paper
Advertisement

OTT Movie : 18 ఏళ్ల వయసులో ఉరి… బ్రిటిష్ వాళ్ళను వణికించిన చిచ్చరపిడుగు… ఓటీటీలోకి వచ్చేసిన ఖుదిరామ్ బోస్ బయోపిక్

OTT Movie : 18 ఏళ్ల వయసులో ఉరి… బ్రిటిష్ వాళ్ళను వణికించిన చిచ్చరపిడుగు… ఓటీటీలోకి వచ్చేసిన ఖుదిరామ్ బోస్ బయోపిక్
Advertisement

OTT Movie : భారతదేశంలోని అతి చిన్న వయసులోనే విప్లవకారుడిగా మారిన ఖుదిరాం బోస్ బయోపిక్ సినిమా ఓటీటీలోకి వచ్చింది. అతని పుట్టిన రోజు సదర్భంగా ఈ హిందీ-బెంగాలీ బైలింగ్వల్ బయోపిక్ మూవీ ఇప్పుడు భారతీయులను పలకరిస్తోంది. ఇది 18 ఏళ్ల వయసులో బ్రిటిష్ జడ్జి కింగ్స్‌ఫోర్డ్‌ని చంపే ప్రయత్నం చేసి ఉరిశిక్ష అనుభవించిన స్వాతంత్య్ర సమరయోధుడు ఖుదిరాం బోస్ జీవిత కథ. అత్యంత ధైర్యవంతుడైన విప్లవకారులలో ఒకరిగా బోస్ గుర్తింపు తెచ్చుకున్నారు. 1889 డిసెంబర్ 3న జన్మించిన ఖుదీరామ్ బోస్ ధైర్యసాహసాలకు, దేశభక్తికి, గొప్ప విప్లవ స్ఫూర్తికి ప్రతీకగా నిలిచాడు. 18 సంవత్సరాల వయసులోనే, భారత స్వాతంత్య్ర పోరాటంలో అతి పిన్న వయస్కుడైన అమరవీరులలో ఒకరిగా ఎదిగి నిర్భయంగా ఉరిశిక్షకు గురయ్యాడు. ఈ సినిమా ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? స్టోరీ ఏమిటి ? అనే వివరాల్లోకి వెళ్తే ..

ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే

‘ఖుదిరాం బోస్’ (Khudiram Bose) అనే ఈ హిందీ-బెంగాలీ బైలింగ్వల్ బయోపిక్ సినిమా విజయ్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కింది. ఈ చిత్రంలో వివేక్ ఒబెరాయ్, నాజర్, అతుల్ కులకర్ణి, రాకేష్, మరియా రవివర్మ, రవిబాబు, కాశీ విశ్వనాథ్, అభిరామి తదితరులు నటించారు. ప్రసార భారతి అధికారిక డిజిటల్ ప్లాట్‌ఫామ్ అయిన వేవ్స్ లో 2025 డిసెంబర్ 3 నుండి ఈ చిత్రం స్ట్రీమింగ్ అవుతోంది. ఇది హిందీ, తమిళం, తెలుగు బెంగాలీ భాషలలో అందుబాటులో ఉంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

ఖుదిరాం బోస్ 1889లో బెంగాల్‌లోని మేదినీపూర్ జిల్లాలో బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. చిన్నప్పటి నుంచే స్వాతంత్య్ర ఉద్యమంలో చేరాడు. అనుశీలన్ సమితి అనే రివల్యూషనరీ గ్రూప్ లో సభ్యుడుగా చేరుతాడు. 1905లో బెంగాల్ విభజన తర్వాత బ్రిటిష్ జడ్జి డగ్లస్ కింగ్స్‌ఫోర్డ్ బెంగాల్‌లో అనేక మంది స్వాతంత్య్ర సమరయోధులకు కఠిన శిక్షలు విధించాడు. చాలా మందిని చంపించాడు కూడా. ఖుదిరాం, ప్రఫుల్ల చాకీ అనే మరో వ్యక్తి కింగ్స్‌ఫోర్డ్‌ని చంపాలని ప్లాన్ చేస్తారు. 1908 ఏప్రిల్ 30న ముజాఫర్‌పూర్‌లో కింగ్స్‌ఫోర్డ్ వస్తాడని తెలుసుకుని ఖుదిరాం బాంబు విసురుతాడు. కానీ బాంబు తప్పుగా కింగ్స్‌ఫోర్డ్ భార్య, ఆమె స్నేహితురాలి మీద పడుతుంది. దీంతో ఇద్దరూ చనిపోతారు. కింగ్స్‌ఫోర్డ్ బతికిపోతాడు.

Read Also : డబ్బు కోసం పందెం… నడక ఆపితే నరకానికి టికెట్టు… సస్పెన్స్ తో పిచ్చెక్కించే సర్వైవల్ థ్రిల్లర్

Advertisement

ఖుదిరాం, ప్రఫుల్ల ఎస్కేప్ ట్రై చేస్తారు. కానీ ప్రఫుల్ల రైలులో పట్టుబడి సైనైడ్ తాగి సూసైడ్ చేసుకుంటాడు. ఖుదిరాం పట్టుబడతాడు. 18 ఏళ్ల 8 నెలల వయసులో బ్రిటిష్ కోర్టు ఉరిశిక్ష విధిస్తుంది. ఖుదిరాం జైలులో కూడా ధైర్యంగా ఉంటాడు. నేను మళ్లీ పుట్టినా భారత స్వాతంత్య్ర కోసమే పుడతానని గర్జించి చెబుతాడు. 1908 ఆగస్ట్ 11న ముజాఫర్‌పూర్ జైలులో ఉరితీశారు. బ్రిటిష్ ఇండియాలో ఉరిశిక్ష అనుభవించిన రెండో అతి చిన్న వయసు ఉన్న సమరయోధుడు ఖుదిరాం. ఇది 18 ఏళ్ల బాలుడు దేశం కోసం ప్రాణాలు అర్పించిన నిజమైన కథ. భగత్ సింగ్‌కి ముందు వచ్చిన ఒక విప్లవకారుడు ఖుదిరాం బోస్ జీవితం.

 

Related News

అల్లరి నరేష్ రంభ ఊర్వశి మేనక ఓటీటీ పార్టనర్ లాక్..స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

కోర్టు రూమ్‌లోనే జడ్జ్‌కి మైండ్ బ్లాకింగ్ ఛాలెంజ్… క్షణక్షణం సీట్ ఎడ్జ్ మైండ్ గేమ్‌లున్న ఈ లీగల్ డ్రామా తెలుగులోనే

ఆకాశంలోనే మిస్సయిన భారీ విమానం… దిమ్మతిరిగే మిలిటరీ ఇన్వెస్టిగేషన్

చిన్నతనంలోనే ప్రపంచాన్ని చుట్టేసిన కుర్రాడి అడ్వెంచర్స్… కళ్ళు ఆర్పకుండా చూసే రియల్ డాక్యుమెంటరీ

నిధి వేట… దెయ్యాలతో ఆట… హారర్ ట్విస్ట్‌తో వస్తున్న వందల కోట్ల నవ్వుల ఫ్రాంచైజీ

పేదరికం నుంచి సామ్రాజ్యం దిశగా విజనరీ ప్రయాణం… కళ్లు చెమర్చేలా చేసే రియల్ లైఫ్ లయన్ స్టోరీ

12 ఏళ్ల ప్రయాణానికి మైండ్ బ్లోయింగ్ ముగింపు… మోటార్ ప్రపంచంలో అడ్వెంచరస్ రోలర్‌కోస్టర్ రైడ్

కుటుంబం, ప్రేమ మధ్య నలిగిపోయే క్లాసికల్ మ్యూజిషియన్ కథ… కన్నీళ్లు పెట్టించే ఎమోషనల్ జర్నీ

Big Stories

Advertisement
×