Gill-Shami : క్రికెట్ ప్రపంచంలో ఎప్పుడూ చూసినా ఏదో ఒక చర్చ జరుగుతూనే ఉంటుంది. ప్రస్తుతం భారత బౌలర్ మహ్మద్ షమీ గురించి నిత్యం ఏదో ఒక చర్చ జరుగుతోంది. ఇటీవల అతని భార్య గురించి సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. తాజాగా సోషల్ మీడియాలో కూడా మరో వార్త వైరల్ అవుతోంది. అదేంటంటే..? షమీని టీమిండియాలోకి ఎందుకు తీసుకోవడం లేదని కెప్టెన్ శుబ్ మన్ గిల్ కి ప్రశ్న ఎదురైంది. దానికి కెప్టెన్ గిల్ ఇలా సమాధానం చెప్పాడు. షమీ లాంటి బౌలర్లు చాలా తక్కువ మంది ఉంటారని.. గిల్ పేర్కొన్నారు. ఆయనను ఎందుకు సెలెక్ట్ చేయలేదు. ప్యూచర్ లో చేస్తారా..? అనే ప్రశ్నలకు తనకంటే సెలెక్టర్లు బెటర్ గా సమాధానం చెబుతారని ప్రెస్ కాన్పరెన్స్ లో పేర్కొన్నారు కెప్టెన్ గిల్.
Also Read : Smriti Mandhana wedding: స్మృతి మందాన వెడ్డింగ్ కార్డు వైరల్.. పెళ్లి ఎప్పుడంటే?
ప్రస్తుతం ఉన్న బౌలర్లు కూడా చాలా బాగా రాణిస్తున్నరని గుర్తు చేశారు. అలాగే సౌతాఫ్రికా తో జరుగనున్న తొలి టెస్ట్ లో ఆల్ రౌండర్ లేదా ఎక్స్ ట్రా స్పిన్నర్ ను ఆడించే విషయం పై రేపే నిర్ణయం తీసుకుంటామని సమాధానం చెప్పారు కెప్టెన్ గిల్. 2023 వన్డే వరల్డ్ కప్ లో అద్భుతమైన ప్రదర్శన చేసిన అతను 7 మ్యాచ్ ల్లో 24 వికెట్లు తీసుకొని సత్తా చాటాడు. కానీ కొంతకాలం క్రితం గాయాల కారణంగా జట్టులో స్థానం కోల్పోయిన అతను పునరాగమనం చేయలేకపోతున్నాడు. చివరిసారి ఛాంపియన్స్ ట్రోఫీలో కనిపించిన షమీ.. 7 మ్యాచ్ ల్లో 11 వికెట్లు తీసుకున్నాడు. బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో 5 వికెట్ల ప్రదర్శన సైతం చేసాడు. ప్రస్తుతం దేశవాళీ క్రికెట్ లో అద్భుతంగా రాణిస్తున్నాడు. నవంబర్ 14 నుంచి ప్రారంభం కానున్న సౌతాఫ్రికాతో టెస్ట్ సిరీస్ కి షమీ ఎంపిక కాలేదు. కోల్ కతాతో జరుగనున్న తొలి టెస్ట్ మ్యాచ్ కి ముందు నిర్వహించిన విలేకర్ల సమావేశంలో కెప్టెన్ గిల్ షమీ పునరాగమనం గురించి ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం విశేషం.
షమీ గురించి గిల్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరోవైపు ఇటీవలే షమీ సెలెక్ట్ గురించి టీమిండియా మాజీ క్రికెటర్ సౌరబ్ గంగూలీ కూడా సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. టీమిండియా పేసర్ సౌరబ్ గంగూలీ అన్ని ఫార్మాట్లలో ఆడాలని తెలిపాడు. యూకే కి చెందిన కబూ అనే ఏఐ క్రీడా శిక్షణ వేదికకు గంగూలీ బ్రాండ్ అంబాసిటర్ గా నియమితులయ్యాడు. ఈ సందర్భంగా ఓ కార్యక్రమంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రంజీ ట్రోఫీలో షమీ బౌలింగ్ చూశాను. అతను చాలా ఫిట్ గా ఉన్నాడు. అదేవిధంగా అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు. “రంజీ ట్రోఫీలో ఒంటి చేతితో బెంగాల్ జట్టు ను గెలిపించాడు. రెండు మ్యాచ్ ల్లో 15 వికెట్లు తీశాడు. ఇలాంటి అద్భుతమైన ప్రదర్శనను బీసీసీఐ సెలెక్టర్లు కూడా చూశారనే అనుకుంటున్నాను. వాళ్లు షమీతో మాట్లాడుతూనే ఉంటారని భావిస్తున్నా. ప్రస్తుతం షమీ ఉన్న ఫామ్, ఫిట్ నెస్ చూస్తే.. టీమిండియాకి అన్ని ఫార్మాట్లలో ఆడగలడని నేను నమ్ముతున్నాను” అంటూ సౌరబ్ గంగూలీ పేర్కొన్నాడు.
Also Read : NZ vs WI 5th T20i: వెస్టిండీస్ ను చిత్తు చేసిన న్యూజిలాండ్.. 3-1 తేడాతో టీ20 సిరీస్ కైవసం