E-Paper
Advertisement

IPS Association On KTR: డీజీపీపై అనుచిత వ్యాఖ్యలు.. కేటీఆర్ కు ఐపీఎస్ అధికారుల సంఘం వార్నింగ్

IPS Association On KTR: డీజీపీపై అనుచిత వ్యాఖ్యలు.. కేటీఆర్ కు ఐపీఎస్ అధికారుల సంఘం వార్నింగ్
Advertisement

IPS Association On KTR: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌‌పై తెలంగాణ ఐపీఎస్ అధికారుల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. డీజీపీ శివధర్ రెడ్డిపై కేటీఆర్ అనుచిత వ్యాఖ్యలను ఖండించింది. డీజీపీకి పూర్తి మద్దతు ప్రకటించింది. అవసరమైతే కేటీఆర్ పై చట్టపరమైన చర్యలు తీసుకునే హక్కు తమకు ఉందని పేర్కొంది. ఈ మేరకు ఐపీఎస్ అధికారుల సంఘం ఓ ప్రకటన చేసింది. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో కేటీఆర్ మాట్లాడుతూ..రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణిస్తున్నాయని, డీజీపీ ఏం చేస్తున్నారని అవమానకర వ్యాఖ్యలు చేశారు.

పోలీస్ వ్యవస్థ లక్ష్యంగా

డీజీపీ శివధర్ రెడ్డి, మొత్తం పోలీసు వ్యవస్థను టార్గెట్ చేస్తూ కేటీఆర్ అనుచిత వ్యాఖ్యలు చేశారని ఐపీఎస్ అధికారుల సంఘం ఆరోపించింది. పోలీస్ వ్యవస్థ పై అభ్యంతరాలు ఉంటే చట్టబద్దంగా లేవనెత్తాలని కోరారు. అంతే కానీ బహిరంగంగా దూషించడం సరికాదన్నారు. ఇలాంటి వ్యాఖ్యలు పోలీసు వ్యవస్థ నిష్పాక్షికత, వృత్తి గౌరవాన్ని దెబ్బతీస్తాయని హెచ్చరించారు.

రాజకీయ లబ్దికోసం

Advertisement

తెలంగాణ ప్రజల భద్రత కోసం అవిశ్రాంతంగా పనిచేసే వేలాది మంది పోలీసు అధికారులు, సిబ్బందిపై ఇలాంటి వ్యాఖ్యలు సరికాదని అభిప్రాయపడింది. డీజీపీ పరువు నష్టం కలిగించే వ్యాఖ్యలు చేయడమే కాకుండా మొత్తం పోలీసు వ్యవస్థ ప్రతిష్ఠను దిగజార్చేలా కేటీఆర్ మండిపడ్డారని ఐపీఎస్ అధికారుల సంఘం మండిపడింది. రాజకీయ లబ్దికోసం సర్వీసులో ఉన్న అధికారులపై నిరాధారమైన ఆరోపణలు చేయడం సరికాదంది.

Also Read: Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డిపై.. టెక్ దిగ్గజాల ప్రశంసలు

వ్యక్తిగత వ్యాఖ్యలు సరికాదు

Advertisement

ప్రభుత్వ అధికారులపై ప్రజా ప్రతినిధులు, రాజకీయ నాయకులు, మీడియా సంస్థలు బాధ్యతగా మాట్లాడాలని ఐపీఎస్ అధికారుల అసోసియేషన్ కోరింది. రాజ్యాంగ సంస్థలు, సీనియర్ ప్రభుత్వ ఉద్యోగుల గౌరవాన్ని కాపాడాలని కోరింది. డీజీపీ పోలీసు వ్యవస్థకు అధిపతి, అలాంటి వ్యక్తిపై వ్యక్తిగత లేదా పరువు నష్టం కలిగించే వ్యాఖ్యలు సరైనవి కాదని కోరింది.

Tags

Related News

అసదుద్దీన్ ఒవైసీ అసలైన దేశభక్తుడు.. సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభంలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

కేబినెట్ నుంచి ఔట్.. సురేఖకు ముందు బర్తరఫ్ అయిన మంత్రులు వీళ్లే!

రేవంతే పట్టుబట్టి నన్ను తీసేశారు..సీఎం పై సంచలన కామెంట్స్!

నన్ను అడగకుండా ఎలా బర్తరఫ్ చేస్తారు?.. అధిష్ఠానంపై మంత్రి కొండా సురేఖ ఫైర్!

సురేఖ అక్కా నేనున్నాను, పార్టీలోకి రావాలని కేఏపాల్ ఆహ్వానం

గవర్నర్‌కు సీఎం రేవంత్ లేఖ.. సురేఖను మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌ చేయాలంటూ

Big Stories

Advertisement
×