E-Paper
Advertisement

ఇంగ్లాండ్ టూర్ కు వైభ‌వ్ రావొద్దు దేవుడా..వ‌స్తే మాత్రం మా బౌల‌ర్ల ప్యాంట్లు త‌డిచిపోవ‌డం గ్యారంటీ!

ఇంగ్లాండ్ టూర్ కు వైభ‌వ్ రావొద్దు దేవుడా..వ‌స్తే మాత్రం మా బౌల‌ర్ల ప్యాంట్లు త‌డిచిపోవ‌డం గ్యారంటీ!
Advertisement

Graeme Swann:  టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ (England vs India) మధ్య జూలైలో టి20 సిరీస్ జరగనున్న సంగతి తెలిసిందే. ఇలాంటి క్రమంలో టీమిండియా జట్టును ప్రకటించింది భారత క్రికెట్ నియంత్రణ మండలి. శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలోని టీమిండియా.. ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లనుంది. ఇలాంటి క్రమంలో ఇంగ్లాండ్ టూర్ కోసం 15 ఏళ్ల బుడ్డోడు వైభవ్ సూర్యవంశీని (Vaibhav Sooryavanshi) కూడా సెలెక్ట్ చేసింది బీసీసీఐ. చివరి క్షణంలో అతని పేరును చేర్చారు. అయితే వైభవ్ సూర్య వంశీ ఇంగ్లాండ్ టూర్ కు వస్తున్న నేపథ్యంలో అక్కడి మాజీ క్రికెటర్లు వణికిపోతున్నారు. వైభవ్ సూర్యవంశీ ఇంగ్లాండ్ వస్తున్న నేపథ్యంలో మాజీ స్పిన్నర్ గ్రేమ్ స్వాన్ ( Graeme Swann) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇంగ్లాండ్ టూర్ కు వైభ‌వ్ రావొద్దని తాను కోరుకుంటున్న‌ట్లు వెల్ల‌డించారు. ఒక‌వేళ వైభ‌వ్ వ‌స్తే, మాత్రం మా బౌల‌ర్ల‌కు న‌ర‌క‌మే అంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు గ్రేమ్ స్వాన్. దీంతో గ్రేమ్ స్వాన్ చేసిన వ్యాఖ్య‌లు దుమారం రేపుతున్నాయి.

Also Read: Ambati Rayudu: బ‌ల‌హీనమైన గుజ‌రాత్ పై గెలిచి బిల్డ‌ప్ ఇస్తున్నారు..RCB ప‌రువు తీసిన అంబ‌టి Ambati Rayudu!

ఇంగ్లాండ్ కు వైభ‌వ్ వ‌స్తే మా బౌల‌ర్ల ప్యాంట్లు త‌డిచిపోవ‌డం గ్యారంటీ!

Advertisement

ఇంగ్లాండ్ టూర్ కు వైభవ్ సూర్యవంశీని (Vaibhav Sooryavanshi)  భారత క్రికెట్ నియంత్రణ మండలి ( BCCI) సెలెక్ట్ చేసింది. ఈ క్రమంలో ఇంగ్లాండ్ మాజీ స్పిన్నర్ గ్రేమ్ స్వాన్ ( Graeme Swann) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఐపీఎల్ 2026 టోర్నమెంట్లో 15 ఏళ్ల బుడ్డోడు వైభవ్ అద్భుతంగా రాణించాడని పేర్కొన్నారు. మంచినీళ్లు తాగినంత సులభంగా సిక్సర్లు, ఫోర్లు కొట్టి బౌలర్లకు చుక్కలు చూపించాడని వెల్లడించారు. ఇలాంటి ఆటగాడిని తాను ఎప్పుడు చూడలేదని వెల్లడించారు. అలాంటి డేంజర్ వైభవ్ సూర్యవంశీని ఇంగ్లాండ్ టూర్ కు తీసుకురావడం పెను ప్రమాదమని తెలిపారు.

ఏదో ఒక కారణం వల్ల వైభవ్.. ఈ టూర్ రాకుండా దేవుడే కాపాడాలని షాకింగ్ కామెంట్స్ చేశారు. ఒకవేళ ఇంగ్లాండ్ టూర్ కు వైభవ్ సూర్య వంశీ వస్తే మాత్రం, తమ బౌలర్ల ప్యాంట్లు తడవడం గ్యారంటీ అంటూ హెచ్చరించారు. మా ఇంగ్లాండ్ బౌలర్లను చీల్చి చెండాడుతాడని.. స్టేడియం నలువైపులా సిక్సర్లతో నరకం చూపిస్తాడని బాంబు పేల్చారు. ఐపీఎల్ లో అదరగొట్టిన వైభవ్… ప్రపంచ క్రికెట్లో ఒక అద్భుతమైన బాక్సాఫీస్ స్టార్ అవుతాడని కూడా ప్రశంసించారు గ్రేమ్ స్వాన్. మరోవైపు ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ కూడా వైభవ్ రాకపై కీలక వ్యాఖ్యలు చేశారు. వైభవ్ లాంటి టాలెంటెడ్ ఆటగాడు ఇంగ్లాండ్ రావడం శుభ సూచకం అన్నారు. అతనికి విదేశీ గడ్డపై ఆడడం అలవాటైతే… మంచి భవిష్యత్తు ఉంటుందని కూడా సూచనలు చేశారు. దీంతో వైభ‌వ్ సెల‌క్ష‌న్ హాట్ టాపిక్ అయింది.

Advertisement

 

Also Read:  Tanveer Ahmed: బాబ‌ర్ ను ( babar azam) ఐపీఎల్ లోకి తీసుకోండి..వైభ‌వ్ కంటే భ‌యంక‌రంగా ఆడ‌తాడు

 

 

Related News

ర్యాంకింగ్స్ లో అట్ట‌డుగున ఉన్న పాకిస్తాన్‌..వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వ‌డం అసాధ్యం

కావ్య పాప‌కు బిగ్ షాక్‌…స‌న్ రైజ‌ర్స్ మ్యాచ్ లు చూడకుండా కుట్ర‌లు !

మాతో అంతా ఈజీగా ఉండదు.. టీమిండియాకు పీడకల మిగుల్చుతాం…జింబాబ్వే కెప్టెన్ వార్నింగ్

టీమిండియా-పాక్ మ‌ధ్య ఓ సిరీస్ నిర్వ‌హించండి..ICCకి షాహిద్ అఫ్రిది సంచ‌ల‌న లేఖ

పీక‌ల్లోతు అప్పుల్లో కూరుకుపోయిన PCB…మోడీ కాళ్ల ద‌గ్గ‌ర‌కు న‌ఖ్వీ ?

పాకిస్తాన్ వాళ్లు అంద‌రూ చేత‌కానీ వెధ‌వ‌లే..నాకు న‌ర‌కం చూపించారు

“ప్లాస్టిక్ క‌వ‌ర్” లో ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్…అంగంట్లో స‌రుకు కంటే దారుణం, స్పెయిన్ ప‌త‌నం మొద‌లైందంటూ

ఇమామ్ ఉల్ హక్ పెద్ద ద‌ద్ద‌మ్మ‌…త‌న‌ మామ ఇంజ‌మామ్ లాగా బ‌ద్ధ‌క‌స్తుడే

Big Stories

Advertisement
×