E-Paper
Advertisement

నిర్జన ద్వీపంలో చిక్కుకుపోయే 8 మంది అమ్మాయిలు… కట్ చేస్తే ఒళ్లు గగుర్పొడిచే ట్విస్ట్

నిర్జన ద్వీపంలో చిక్కుకుపోయే 8 మంది అమ్మాయిలు… కట్ చేస్తే ఒళ్లు గగుర్పొడిచే ట్విస్ట్
Advertisement

Survival Thriller OTT : యాక్షన్, రొమాన్స్, కామెడీ, హారర్ సిరీస్‌లు చూసి చాలా కాలం అయ్యిందా ? అయితే ఈ సిరీస్ మీకు కొత్త థ్రిల్లింగ్ అనుభవం ఇస్తుంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో వచ్చిన ‘ది వైల్డ్స్’ ఇప్పటికే రెండు సీజన్లతో ప్రేక్షకుల హృదయాలు గెలుచుకుంది. కథ, నటన, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్, అందమైన లొకేషన్లు… ఇందులో ఉన్న అన్నీ ఆడియన్స్ ను పూర్తిగా కట్టిపడేస్తాయి. మరి ఈ సినిమాను ఎక్కడ చూడవచ్చు ? స్టోరీ ఏంటి ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.

కథ ఏమిటి ?

ఇందులో కథ మొత్తం ఒక డేంజరస్ ఐలాండ్ లో చిక్కుకున్న అమ్మాయిల గురించే ఉంటుంది. విభిన్న నేపథ్యాలు గల టీనేజ్ అమ్మాయిల బృందం విమానంలో వెళ్తుంది. ప్రయాణం మధ్యలో ఆ విమానం కూలిపోవడంతో ప్రమాదకర పరిస్థితుల్లో బయట పడతారు. నిజానికి ఆ విమాన ప్రమాదం వల్ల పెద్దగా గాయపడరు. కానీ ఒక నిర్జన ద్వీపంలో చిక్కుకుపోతారు. ఆకలి, భయం, వాతావరణ మార్పులు.. వంటి పరిస్థితుల మధ్య ప్రాణాలను నిలబెట్టుకోవడానికి వాళ్ళు పోరాటం చేయాల్సి వస్తుంది. అప్పటిదాకా ఇలాంటి కష్టాల గురించి తెలియని ఆ అమ్మాయిలు, ఆ ఐలాండ్లో తీవ్ర సవాళ్లను ఎదుర్కొవాల్సి. మొదట్లో ఒకరినొకరు తెలుసుకున్నప్పుడు వారి మధ్య విభేదాలు, గొడవలు తలెత్తుతాయి. కానీ క్రమంగా ఒకరిపై ఒకరు ఆధారపడటం, ప్రేమ, స్నేహం కూడా మొదలవుతాయి. ఈ సిరీస్‌ లో అతి పెద్ద ట్విస్ట్ ఏమంటే… ఈ అమ్మాయిలు యాదృచ్ఛికంగా ఆ ద్వీపానికి రాలేదు. వారందరూ ఒక పెద్ద కుట్రలో భాగమై, ప్రయోగం కోసం ఎంపిక చేయబడిన బాధితులు. ఆ రహస్యం చివర్లో బయట పడటం ఉత్కంఠను మరిన్నింతలు పెంచుతుంది. మరి ఆ ద్వీపం నుంచి ఆ అమ్మాయిలు ఎలా బయట పడ్డారు ? అనేది ఈ సర్వైవల్ థ్రిల్లర్ లో చూడాల్సిన అంశం.

ఐయండీబిలో రేటింగ్

Advertisement

సోఫియా అలీ, షానన్ బెర్రీ, జెన్నా క్లాజ్, రైన్ ఎడ్వర్డ్స్, మియా హీలీ, హెలెనా హోవార్డ్, అరియానా జేమ్స్, సారా పిడ్జియన్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ యువ నటీమణులు తమ నటనతో సిరీస్ లో ప్రతి సన్నివేశానికి జీవం పోశారు. మొత్తం 2 సీజన్లు, 18 ఎపిసోడ్లు ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉన్నాయి. సీజన్ 1 2020లో రిలీజ్ కాగా, 7.7 రేటింగ్… సీజన్ 2 ఆ తరువాత రెండేళ్లకు 2022లో రిలీజ్ కాగా, 7.6 రేటింగ్ ఉంది. 2020లో వచ్చిన మొదటి సీజన్ యంగ్ అడల్ట్ జానర్‌ లో అమెజాన్‌ కి పెద్ద విజయాన్ని అందించింది. “ఎల్లో జాకెట్స్”కి ముందే ఇలాంటి సర్వైవల్ డ్రామాను ప్రేక్షకులకు అందించింది.

మూడవ సీజన్ ఎందుకు రాలేదు ?

సీజన్ 1 బాగా సక్సెస్ అయినా, సీజన్ 2 వ్యూస్ పేలవంగా ఉండటంతో అమెజాన్ ప్రైమ్ వీడియో ఈ సిరీస్‌ ను రద్దు చేసింది. అయినప్పటికీ, ఇప్పటికీ చాలా మంది ఫ్యాన్స్ మూడవ సీజన్ కోసం ఆశలు పెట్టుకుని ఉన్నారు.

Advertisement

Also Read : ఒక్క క్షణం కూడా విసుగు రాకుండా పరుగులు తీసే సౌత్ మూవీస్… చివరి క్షణం వరకూ వీడని సస్పెన్స్

ఎందుకు చూడాలి ?

ఈ సిరీస్ కేవలం సర్వైవల్ కథ కాదు. స్నేహం, ప్రేమ, విశ్వాసం, మోసం, స్వార్థం.. వంటి మానవ సంబంధాల లోతును అద్భుతంగా చూపిస్తుంది. అందమైన ద్వీప లొకేషన్లు, ఉద్వేగభరితమైన సన్నివేశాలు, శక్తివంతమైన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ పూర్తిగా ఆకర్షిస్తాయి. ప్రైమ్ వీడియోలో ఇప్పుడు రెండు సీజన్లు కూడా అందుబాటులో ఉన్నాయి. వీకెండ్‌లో ఒక్కసారి చూడడం మొదలు పెడితే పూర్తయ్యేదాక ఆపలేరు.

Related News

Weekend OTT Releases : ఈ వీకెండ్ ఓటీటీ వినోదం.. డోంట్ మిస్ ఇట్..

3024 కోట్లు కొల్లగొట్టిన హర్రర్ థ్రిల్లర్… ఓటీటీలోకి తెలుగులో వచ్చేసిన వణికించే వైరల్ హిట్

అండర్‌వరల్డ్‌ని షేక్ చేసిన గ్యాంగ్‌స్టర్ కథ… సీట్-ఎడ్జ్‌లో కూర్చోబెట్టే కన్నడ యాక్షన్ ధమాకా

26 మంది పిల్లలు మిస్సింగ్… ఓటీటీని షేక్ చేస్తున్న మలయాళం మిస్టరీ థ్రిల్లర్

మనుషుల నిజస్వరూపాలను కళ్లకు కట్టే కథ… హృదయాలను తాకే డాక్యుమెంటరీ స్టైల్ ఎమోషనల్ ఫిల్మ్

క్షణం కూడా కన్ను మూయనివ్వని ఫైట్లు… ఓటీటీలో సందడి చేస్తున్న ఇంటెన్స్ యాక్షన్ డ్రామా

అడవిలో చిక్కుకున్న పైలట్ సాహసం… నవ్వులతో పాటు మైండ్ బ్లోయింగ్ యాక్షన్ ట్రీట్

వీరభద్రుని రహస్యం’ క్లైమాక్స్ ప్రశ్నలకు సమాధానం… ఒళ్ళు గగుర్పొడిచే మలుపులతో వస్తున్న మైండ్ బెండింగ్ థ్రిల్లర్

Big Stories

Advertisement
×