E-Paper
Advertisement

Hanuma Vihari: RCB ప్లేయ‌ర్ల‌ను తొక్కేశారు…ఇదేం చెత్త సెల‌క్ష‌న్ రా నాయ‌నా

Hanuma Vihari:  RCB ప్లేయ‌ర్ల‌ను తొక్కేశారు…ఇదేం చెత్త సెల‌క్ష‌న్ రా నాయ‌నా

Hanuma Vihari:  ఇంగ్లాండ్ ( England), ఐర్లాండ్  (Ireland) టీ20 సిరీస్ లతో పాటు ఏషియన్ గేమ్స్ ( Asian Games) కోసం తాజాగా టీమిండియా జట్టును ప్రకటించింది బీసీసీఐ (BCCI). ఇందులో ఏకంగా కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ పై వేటు వేసి… శ్రేయస్ అయ్యర్ కు ( Sheyas Iyer) అవకాశం ఇచ్చింది. అలాగే తెలుగు కుర్రాడు తిలక్ వర్మకు ( Tilak Varma) వయసు కెప్టెన్సీ ఇవ్వడమే కాకుండా… వైభవ్ సూర్యవంశీని (Vaibhav Suryavanshi) T20 సిరీస్ ల కోసం తీసుకున్నారు. ఈ క్రమంలో టీమిండియా సెలక్షన్ పైన తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ( RCB ) తరఫున ఆడిన ఏ ఒక్క ఆటగాడికి కూడా టీమిండియాలో అవకాశం రాలేదని.. వాళ్లపై వివక్షతో సెలక్షన్ జరిగిందని సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి. ఇదే అంశంపై తాజాగా టీమిండియా మాజీ క్రికెటర్ హనుమ విహారి (Hanuma Vihari ) కూడా స్పందించారు. ఆర్సిబి ప్లేయర్లను తొక్కేసారని.. వాళ్లకు పూర్తిగా అన్యాయం జరిగిందని ఫైర్ అయ్యారు. ఇదేం చెత్త సెలక్షన్ అంటూ సీరియస్ అయ్యారు. ఈ మేరకు సోషల్ మీడియాలో వీడియో కూడా పెట్టారు హనుమ విహారి.

Also Read: Ambati Rayudu: బ‌ల‌హీనమైన గుజ‌రాత్ పై గెలిచి బిల్డ‌ప్ ఇస్తున్నారు..RCB ప‌రువు తీసిన అంబ‌టి Ambati Rayudu!

RCB ప్లేయ‌ర్ల‌ను తొక్కేశారు…ఇదేం చెత్త సెల‌క్ష‌న్ రా నాయ‌నా

ఇంగ్లాండ్ ( England), ఐర్లాండ్  (Ireland) టీ20 సిరీస్ లతో పాటు ఏషియన్ గేమ్స్ ( Asian Games) కోసం తాజాగా టీమిండియా జట్టును ప్ర‌క‌టించిన త‌రుణంలో హ‌నుమ విహారి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు రెండుసార్లు టైటిల్ తీసుకువచ్చిన కెప్టెన్ రజత్ పాటిదార్ ను ( Rajat Patidar) సెలెక్ట్ చేయకపోవడం దారుణం అంటూ మండిపడ్డారు. మిడిల్ ఆర్డర్ లో 200కు పైగా స్ట్రైక్ రేట్ ఉన్న ఆటగాడు అతడని, స్పిన్నర్లను బాగా డీల్ చేయగల సత్తా కూడా ఉందని గుర్తు చేశారు హనుమ విహారి. కెప్టెన్సీ పరంగా కూడా అతడు పనికి వస్తాడని వెల్లడించారు. అన్యాయంగా రజత్ పాటిదార్ కొంప ముంచారని ఫైర్ అయ్యారు. తన దృష్టిలో శ్రేయస్ అయ్యర్ కంటే రజత్ పాటిదార్ బెస్ట్ కెప్టెన్ అంటూ వ్యాఖ్యానించారు.

ఇక ప్రతి మ్యాచ్ లో కృనాల్ పాండ్యా (Krunal Pandya) అద్భుతంగా రానిస్తున్నప్పటికీ.. అతనికి మాత్రం అవకాశం ఇవ్వడం లేదని ఫైర్ అయ్యారు. స్పిన్నర్ గా అలాగే బ్యాటర్ గా కూడా కృనాల్ ఇండియాకు పనికి వచ్చేవాడని.. అలాంటి ప్లేయర్ ను పక్కకు పెట్టడం ఆశ్చర్యానికి గురి చేసిందన్నారు. ఇక సీనియర్ ప్లేయర్ భువనేశ్వర్ కుమార్ ను ( Bhuvaneshwar) అసలు పట్టించుకోవడంలేదని నిప్పులు చెరిగారు. భవిష్యత్తు కోసం సెలక్షన్ అంటూనే.. మంచి ప్లేయర్లను వదిలేస్తున్నారని ఫైర్ అయ్యారు. విరాట్ కోహ్లీ తో పాటు రోహిత్ శర్మాను జట్టులో కొనసాగిస్తున్నప్పుడు.. సీనియర్ ఆటగాడు భువనేశ్వర్ ఎందుకు మీకు గుర్తుకు రావడంలేదని నిలదీశారు.

 

Also Read:  Tanveer Ahmed: బాబ‌ర్ ను ( babar azam) ఐపీఎల్ లోకి తీసుకోండి..వైభ‌వ్ కంటే భ‌యంక‌రంగా ఆడ‌తాడు

 

?igsh=Y2c4ZXZmZm10Zm92

Related News

శ్రేయ‌స్ కు టీమిండియా కెప్టెన్సీ…రెచ్చిపోయిన శ్రేష్ఠ‌ అయ్యర్, న‌డుము అందాలు చూపిస్తూ !

ఇంగ్లాండ్ టూర్ కు వైభ‌వ్ రావొద్దు దేవుడా..వ‌స్తే మాత్రం మా బౌల‌ర్ల ప్యాంట్లు త‌డిచిపోవ‌డం గ్యారంటీ!

Harbhajan Singh: అగార్క‌ర్ నీకు మైండ్ దొబ్బిందా…200 స్ట్రైక్ రేట్ ఉన్న ర‌జ‌త్ ను గ‌డ్డి పీక‌మంటావా ?

వైభ‌వ్ వ‌చ్చేస్తున్నాడు..ఒళ్లు ద‌గ్గ‌ర పెట్టుకోని ఆడు..అభిషేక్ శ‌ర్మ‌కు యువ‌రాజ్ హెచ్చ‌రిక‌

Ajit Agarkar: బీసీసీఐ ఒత్తిడి చేస్తే, బ‌ల‌వంతంగా వైభ‌వ్ ను సెల‌క్ట్ చేశాం

15 ఏళ్ల వైభ‌వ్ కు పెరుగుతోన్న అమ్మాయిల ఫాలోయింగ్, బిల్డింగ్ ఎక్కి మ‌రీ

టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్య‌ర్‌..జ‌ట్టులోకి వైభవ్ సూర్య‌వంశీ

Big Stories

×