E-Paper
Advertisement

Harbhajan Singh: అగార్క‌ర్ నీకు మైండ్ దొబ్బిందా…200 స్ట్రైక్ రేట్ ఉన్న ర‌జ‌త్ ను గ‌డ్డి పీక‌మంటావా ?

Harbhajan Singh:  అగార్క‌ర్ నీకు మైండ్ దొబ్బిందా…200 స్ట్రైక్ రేట్ ఉన్న ర‌జ‌త్ ను గ‌డ్డి పీక‌మంటావా ?

Harbhajan Singh:  ఇంగ్లాండ్, ఐర్లాండ్ టీ20ల‌తో పాటు ఏషియన్ గేమ్స్ కోసం తాజాగా టీమిండియా జట్టును ప్రకటించింది. సూర్య కుమార్ యాదవ్ పై వేటు వేసిన బీసీసీఐ, శ్రేయస్ అయ్యర్ కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించింది. అలాగే తెలుగు కుర్రాడు తిలక్ వర్మకు వైస్ కెప్టెన్సీ అప్పగించారు. 15 ఏళ్ల వైభవ్ కూడా తుది జట్టులోకి వచ్చాడు. అయితే ఈ టి20 టోర్నమెంట్ల నేపథ్యంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ రజత్ పాటిదార్ ను ( Rajat Patidar) సెలెక్ట్ చేయకపోవడంపై టీమిండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ (Harbhajan Singh) చాలా సీరియస్ అయ్యారు. 200 స్ట్రైక్ రేట్ తో మొన్న ఐపిఎల్ లో ఇరగదీసిన రజత్ పాటిదార్ ను ఎందుకు సెలెక్ట్ చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ కు (Ajit Agarkar ) మైండ్ దొబ్బిందా? ఇదేం సెలక్షన్ అంటూ ఫైర్ అయ్యారు. టీమిండియాను శాసించిన అజిత్ అగార్కర్, గౌతమ్ గంభీర్ లను ( Gautam Gambhir) ఉరి తీసినా తప్పులేదంటూ బాంబు పేల్చారు. దీంతో హర్భజన్ సింగ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

Also Read:  Tanveer Ahmed: బాబ‌ర్ ను ( babar azam) ఐపీఎల్ లోకి తీసుకోండి..వైభ‌వ్ కంటే భ‌యంక‌రంగా ఆడ‌తాడు

200 స్ట్రైక్ రేట్ ఉన్న ర‌జ‌త్ ను గ‌డ్డి పీక‌మంటావా ?- హర్భజన్

ఇంగ్లాండ్, ఐర్లాండ్ టీ20ల‌తో పాటు ఏషియన్ గేమ్స్ కోసం తాజాగా టీమిండియా జట్టును బీసీసీఐ ప్రకటించింది. ఈ క్రమంలో మాజీ క్రికెటర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సూర్య కుమార్ యాదవ్ కెప్టెన్సీని పీకి పారేసిన బిసిసిఐపై మండిపడుతున్నారు. అటు రజత్ పాటిదార్ కు అవకాశం ఇవ్వకపోవడంపై హర్భజన్ సింగ్ చాలా సీరియస్ అయ్యారు. బెంగళూరు కెప్టెన్ గా రజత్ పాటిదార్ అద్భుతంగా రాణించాడని గుర్తు చేశారు. ఐపీఎల్ 2026 టోర్నమెంట్ సందర్భంగా 500 పరుగులు సాధించడమే కాకుండా 200 స్ట్రైక్ రేట్ సంపాదించాడని బెంగళూరు కెప్టెన్ రజత్ పాటిదార్ ను మెచ్చుకున్నాడు. అలాంటి డేంజర్ ఆటగాన్ని అజిత్ అగార్కర్ పట్టించుకోలేదని ఫైర్ అయ్యారు.

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ రజత్ పాటిదార్ ను సెలెక్ట్ చేసి ఉంటే టీమిండియా మిడిల్ ఆర్డర్ చాలా బలంగా తయారయ్యేది అంటూ వ్యాఖ్యానించారు. మిడిల్ ఓవర్లలో స్పిన్నర్లను ఎదుర్కొనే సత్తా ఉన్న ఆటగాడు రజత్ పాటిదార్ అంటూ ప్రశంసించారు. టి20 క్రికెట్ కు సరిగ్గా సరిపోయే ఆటగాడు రజత్ పాటిదార్ అంటూ వెల్లడించారు. అలాంటి రజత్ ను సెలెక్ట్ చేయకపోవడం అన్యాయమని ఎమోషనల్ అయ్యారు.  అవలీలగా సిక్సర్లు, బౌండరీలు కొట్టగల రజత్ పాటిదార్ ను సెలెక్ట్ చేయకపోవడం వెనక గౌతమ్ గంభీర్, అజిత్ అగార్కర్ ల కుట్ర ఉందని మండిపడ్డారు. 200 స్ట్రైక్ రేట్ సాధించిన కుర్రాడిని సెలెక్ట్ చేయకపోతే.. ఎలా అంటూ నిలదీశారు. ఇప్పుడు రజత్ పాటిదార్ ఇంటిదగ్గర గడ్డి పీక్కోవాలా ? అంటూ సీరియస్ అయ్యారు.

Also Read: Ambati Rayudu: బ‌ల‌హీనమైన గుజ‌రాత్ పై గెలిచి బిల్డ‌ప్ ఇస్తున్నారు..RCB ప‌రువు తీసిన అంబ‌టి Ambati Rayudu!

 

 

Related News

ఇంగ్లాండ్ టూర్ కు వైభ‌వ్ రావొద్దు దేవుడా..వ‌స్తే మాత్రం మా బౌల‌ర్ల ప్యాంట్లు త‌డిచిపోవ‌డం గ్యారంటీ!

వైభ‌వ్ వ‌చ్చేస్తున్నాడు..ఒళ్లు ద‌గ్గ‌ర పెట్టుకోని ఆడు..అభిషేక్ శ‌ర్మ‌కు యువ‌రాజ్ హెచ్చ‌రిక‌

Ajit Agarkar: బీసీసీఐ ఒత్తిడి చేస్తే, బ‌ల‌వంతంగా వైభ‌వ్ ను సెల‌క్ట్ చేశాం

15 ఏళ్ల వైభ‌వ్ కు పెరుగుతోన్న అమ్మాయిల ఫాలోయింగ్, బిల్డింగ్ ఎక్కి మ‌రీ

టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్య‌ర్‌..జ‌ట్టులోకి వైభవ్ సూర్య‌వంశీ

వివాదంలో గౌత‌మ్ గంభీర్..లైవ్ మ్యాచ్ లో డ్రగ్స్ తీసుకున్న‌ట్లు ఆరోప‌ణ‌లు !

ధోనీ నా మాట లెక్క‌చేయ‌లేదు..కోట్ల రూపాయాలు రాకుండా చేశాడు, BAS బ్యాట్ ఓన‌ర్ సంచ‌ల‌నం !

Big Stories

×