Pandya- Vaibhav: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026 Tournament) చాలా రసవత్తరంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ టోర్నమెంట్ లో నిన్న రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ ( Rajasthan Royals vs Mumbai Indians) మధ్య బిగ్ ఫైట్ జరిగింది. ఈ మ్యాచ్ వర్షం కారణంగా 11 ఓవర్లకు ఫిక్స్ చేశారు. అయినప్పటికీ అద్భుతంగా రాణించిన రాజస్థాన్ రాయల్స్ గ్రాండ్ విక్టరీ కొట్టింది. ఇందులో వైభవ్ సూర్య వంశీ ( Vaibhav Suryavanshi) తుఫాన్ ఇన్నింగ్స్ ఆడాడు. ఈ క్రమంలోనే వైభవ్ సూర్య వంశీ, బ్యాట్ లో స్ప్రింగులు (Springs ) ఉన్నాయని ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా ( Hardik Pandya) చెక్ చేశాడు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో అలాగే ఫోటోలు వైరల్ గా మారాయి. అదే సమయంలో వైభవ్ సూర్యవంశీ కన్నీళ్లు పెట్టుకున్న ఫోటోలు కూడా బయటకు వచ్చాయి. దీంతో హార్దిక్ పాండ్యా ప్రవర్తన పై సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి.
Also Read: Inzamam-ul-Haq: కేకేఆర్, పంజాబ్ మ్యాచ్ రద్దు వెనుక కుట్రలు…క్లౌడ్ బరస్ట్ క్రియేట్ చేశారంటూ
ముంబై ఇండియన్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ ( Rajasthan Royals vs Mumbai Indians) మధ్య మంగళవారం మ్యాచ్ జరిగింది. 11 ఓవర్ల మ్యాచ్ అయిన నేపథ్యంలో రాజస్థాన్ రాయల్స్ అద్భుతంగా ఆడి, విక్టరీ అందుకుంది. అయితే వర్షం ఆగిపోయిన తర్వాత వైభవ్ సూర్య వంశీకి సంబంధించిన బ్యాట్లను హార్దిక్ పాండ్యా చెక్ చేశాడు. ఎందుకు ఇలా బాగా ఆడుతున్నాడు? వీడేమైనా బ్యాటులో స్ప్రింగులు పెట్టాడా ? ఇంకా ఏమైనా సీక్రెట్ ఉందా ? అని చెక్ చేసాడు హార్దిక్ పాండ్యా. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో అలాగే ఫోటోలు వైరల్ గా మారాయి. ఇది చూసిన క్రికెట్ అభిమానులు ఫైర్ అవుతున్నారు. 15 ఏళ్లకు కుర్రాడు వైభవ్ సూర్య వంశీని ఇలా హార్దిక్ పాండ్యా అవమానించడం దారుణం అంటున్నారు.
ముంబై ఇండియన్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మధ్య నిన్న మ్యాచ్ జరగగా వైభవ్ సూర్య వంశీ ఊచ కోత కోశాడు. 14 బంతుల్లో 39 పరుగులతో రెచ్చిపోయాడు. 278 స్ట్రైక్ రేట్ తో రఫ్ ఆడించాడు. ఇందులో ఐదు సిక్సర్లు అలాగే ఒక బౌండరీ కూడా ఉంది. ముఖ్యంగా బుమ్రా వేసిన ఓవర్ లో రెండు సిక్సర్లు కొట్టాడు వైభవ్. అయితే శార్దూల్ ఠాగూర్ వేసిన ఓ అద్భుతమైన బంతిని సిక్సర్ కొట్టే ప్రయత్నంలో తిలక్ వర్మకు క్యాచ్ ఇచ్చి వైభవ్ సూర్య వంశీ ఔట్ అయ్యాడు. అయితే ఔట్ అయిన వైభవ్ సూర్య వంశీ, తీవ్ర నిరాశకు గురై కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో కూడా వైరల్ గా మారింది.
Also Read: Farhan – Smith: సింగిల్ తీయకుండా స్మిత్ ను అవమానించిన ఫర్హాన్..బాబర్ పగను తీర్చుకున్నాడుగా
🚨 VAIBHAV SURYAVANSHI IN CRYING AFTER HUS DISMISSAL AGAINST MI 🚨
He may be emotional right now, but that’s not weakness it’s passion. Hitting Jasprit Bumrah for a six on the very first ball shows fearless intent and a champion mindset.
Keep your head high, Vaibhavwe’re all… pic.twitter.com/C4VD6tAiJo
— lndian Sports Netwrk (@IS_Netwrk29) April 7, 2026