E-Paper
Advertisement

మార్క్ శంకర్‌కు రెండో జన్మ అంటూ ఎమోషన్ అయిన అన్నా కొణిదల.. ఎందుకంటే?

మార్క్ శంకర్‌కు రెండో జన్మ అంటూ ఎమోషన్ అయిన అన్నా కొణిదల.. ఎందుకంటే?
Advertisement

Anna Lezhneva: జనసేనాని, సినీ నటుడు పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజ్నెవా సోషల్ మీడియాలో చాలా అరుదుగా కనిపిస్తుంటారు. అయితే, తాజాగా ఆమె షేర్ చేసిన ఒక పోస్ట్ అభిమానులను కలచివేస్తోంది. తన కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ ఒక ఏడాది క్రితం ఎదుర్కొన్న భయంకరమైన అగ్నిప్రమాదాన్ని గుర్తు చేసుకుంటూ ఆమె అత్యంత భావోద్వేగంగా రాసుకొచ్చారు. ఆ రోజును తన కుమారుడికి “రెండవ పుట్టినరోజు”గా ఆమె అభివర్ణించారు.

Read also-Allu Arjun: ‘గంగోత్రి’లో పరికిణి వేసుకుంటే ట్రోల్ చేశారు.. ‘పుష్ప 2’లో చీరతో నేషనల్ అవార్డ్..

అకిరా పుట్టినరోజు వేళ..

Advertisement

మెగా వారసుడు అకిరా నందన్ పుట్టినరోజు సందర్భాన్ని పురస్కరించుకుని అన్నా ఈ పోస్ట్ పెట్టారు. అకిరా ఎదుగుతున్న తీరును చూసి గర్వపడుతున్నానని చెబుతూనే, సరిగ్గా ఇదే రోజున ఏడాది క్రితం జరిగిన ఒక విషాద ఘటనను ఆమె గుర్తు చేసుకున్నారు. “ఈరోజు మా కుటుంబానికి చాలా భావోద్వేగమైన రోజు. అకిరా పుట్టినరోజు వేడుక ఒకవైపు అయితే, మరోవైపు ఏడాది క్రితం జరిగిన అగ్నిప్రమాదంలో మార్క్ చావును జయించి వచ్చిన రోజు” అని ఆమె పేర్కొన్నారు.

ఏమిటా ప్రమాదం?

ఏడాది క్రితం జరిగిన ఒక అగ్నిప్రమాదంలో మార్క్ శంకర్ తీవ్రంగా గాయపడ్డారు. ఆ ప్రమాదంలో 10 ఏళ్ల ఫ్రేయా అనే చిన్నారి ప్రాణాలు కోల్పోగా, మరో 18 మంది పిల్లలు ఆసుపత్రి పాలయ్యారు. మార్క్ ఊపిరితిత్తులు కూడా ఆ పొగ కారణంగా దెబ్బతిన్నాయి. “ఆసుపత్రి బెడ్ పక్కన కూర్చుని, నా కొడుకు ఊపిరి తీసుకోవడానికి పడుతున్న ఇబ్బందిని చూసిన క్షణాలు ఏ తల్లికీ రాకూడదు” అంటూ అన్నా తన ఆవేదనను పంచుకున్నారు. దేవుడి దయ వల్ల మార్క్ ప్రాణాలతో బయటపడ్డాడని, నేడు అతను క్షేమంగా ఉండటమే తమకు పెద్ద ఊరటని ఆమె తెలిపారు.

Advertisement

Read also-ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ మూవీపై వస్తున్న వార్తలకు చెక్ పెట్టిన మూవీ టీం..

వారికి కృతజ్ఞతలు

ఈ ప్రమాద సమయంలో అగ్నిమాపక సిబ్బంది రాకముందే 15 మంది పిల్లలను కాపాడిన నిర్మాణ కార్మికులను అన్నా ఈ సందర్భంగా ప్రశంసించారు. వారు చూపిన ధైర్యానికి కృతజ్ఞతలు తెలుపుతూ, వారే నిజమైన హీరోలని కొనియాడారు. అయితే, ఏడాది గడిచినా ఈ ప్రమాదానికి కారణమైన వ్యక్తులు ఎవరో ఇంకా తెలియకపోవడం, విచారణ ఇంకా కొనసాగుతూనే ఉండటం పట్ల ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. తన వ్యక్తిగత బాధను పంచుకోవడమే కాకుండా, సామాజిక బాధ్యతగా అన్నా ఒక ముఖ్యమైన విషయాన్ని కోరారు. ప్రతి ఒక్కరూ తమ ఇళ్లలో ఫైర్ ఎక్స్‌టింగ్విషర్ లేదా ఫైర్ బ్లాంకెట్ వంటి భద్రతా పరికరాలను ఉంచుకోవాలని, ఎవరూ ఇలాంటి ప్రమాదాల బారిన పడకూడదని ఆమె ప్రార్థించారు. ప్రస్తుతం అన్నా లెజ్నెవా చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Related News

టాలీవుడ్ లో నేషనల్ అవార్డు అందుకున్న తొలి చైల్డ్ ఆర్టిస్ట్ ఎవరంటే?

భాయ్ చిక్కిపోయాడని ఏడ్చేసిన ఫ్యాన్స్.. రివర్స్ సెటైర్ వేసిన సల్మాన్ !

రికార్డుల వేటలో ‘ది ఒడిస్సీ’..మన మేకర్స్ ఇప్పటికైనా మారతారా?

విదేశాల్లో షాట్లు.. ఏపీలో ఓట్లు! టాలీవుడ్ స్టార్స్‌పై అంబికా కృష్ణ మార్కు కౌంటర్లు!

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

Big Stories

Advertisement
×