Sania Mirza: వైద్యశాస్త్రంలో ఎన్నో కొత్త కొత్త టెక్నాలజీలు అందుబాటులోకి వస్తున్నాయి. ముఖ్యంగా సంతానం విషయంలో ఈ టెక్నాలజీలు మరింత ఎక్కువగా ఉన్నాయి. అందులో ఎగ్ ఫ్రీజింగ్ ఒకటి. ఇటీవల దీని గురించి ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు. దీనికి అధికంగా ప్రేరణ ఇచ్చింది మాత్రం సెలబ్రిటీలే. ఉపాసన కామినేని, ప్రియాంక చోప్రా, ఏక్తా కపూర్ సహా చాలా మంది అగ్ర కథానాయికలు అండాన్ని దాచి ఉంచాలనే భవిష్యత్తు ఆలోచనకు మద్దతు పలికారు.
Also Read: Temba Bavuma: CSKలోకి మరగుజ్జు.. ధోని అదిరిపోయే ప్లాన్ ?
ఒక వయసు దాటాక పిల్లలు పుట్టడం కష్టం అయినందువల్ల.. యుక్త వయసులో ఉన్నప్పుడే అండాలను ఫ్రీజ్ చేసి ఉంచడం ఎంతో శ్రేయస్కరం. అయితే ఇదే విషయాన్ని మాజీ టెన్నిస్ ఛాంపియన్ సానియా మీర్జా కూడా తాజాగా ఓ పాడ్ కాస్ట్ లో గుర్తుచేసుకున్నారు. తాను కూడా తన అండాన్ని ఫ్రీజ్ చేయించిన విషయాన్ని వెల్లడించారు.
తన కుమారుడు ఇజ్జాన్ పుట్టిన తర్వాత తన ఆండాలను ఫ్రీజ్ చేయించుకున్నానని తెలిపింది సానియా మీర్జా. ఇది భవిష్యత్తు కోసం ఒక ఆచరణాత్మక అడుగు అని పేర్కొంది. మొదటిసారి సహజంగా గర్భం దాల్చి.. ఆ వెంటనే తన అండాలను నిల్వ చేయించుకున్నానని తెలిపింది. ఇందుకోసం తన స్నేహితురాలు ఫరా ని సంప్రదించి దీనిపై అభిప్రాయం కోరినట్లు వెల్లడించింది. అయితే ఓ నిపుణుడిని సంప్రదించి నిర్ణయం తీసుకోవాలని ఫరా సూచించిందని.. దీంతో తన అండాలను ఫ్రీజ్ చేయించుకున్నట్లు తెలిపింది.
అయితే షోయబ్ మాలిక్ తో వివాహ బంధంలో ఉన్న సమయంలో భవిష్యత్తులో మరొకరిని కనాలి అని తన ఎగ్స్ ని స్టోర్ చేసుకుంది. కానీ అంతలోనే ఈ జంట విడాకులు తీసుకుంది. దీంతో ఒక్కరితోనే సరిపెట్టుకుంది. అయితే వృత్తిపరమైన, ఆరోగ్య సంబంధిత లేదా వ్యక్తిగత కారణాలవల్ల ఇప్పుడు చాలామంది మహిళలు రెండవ గర్భధారణను ఆలస్యం చేస్తున్నారు. ఇది పునరుత్పత్తి సామర్ధ్యాన్ని తగ్గిస్తుంది. కాగా ఇప్పుడు సానియా మీర్జా చెప్పిన ఈ విషయాలు మహిళలలో ఫెర్టిలిటీ అవగాహనను పెంచాల్సిన అవసరాన్ని మరోసారి గుర్తు చేస్తున్నాయి.
Also Read: Sanju-CSK: ధోని గుర్తులు చెరిపేస్తోన్న సంజు… చెన్నైలో అతిపెద్ద కటౌట్లతో సరికొత్త రికార్డ్
అసలు ఎగ్ ఫ్రీజింగ్ అంటే ఏమిటి..? ఏం చేస్తారు..? ఎలా చేస్తారంటే..? మహిళల అండాలను వేరు చేసి.. వాటిని ఫ్రీజ్ చేసి నిల్వ ఉంచుతారు. ఈ ప్రాసెస్ లో మహిళలు కాస్త అసౌకర్యానికి గురయ్యే అవకాశం ఉంటుంది. పొట్ట ఉబ్బరంగా అనిపించడం, నొప్పి రావడం వంటివి జరుగుతాయి. అయితే ఇలాంటి ఇబ్బందులు అనిపించినప్పుడు మత్తు ఇచ్చి ఆ తరువాతే అండాలను సురక్షితంగా బయటకు తీస్తారు. ఇలా చేయడం వల్ల నొప్పి తెలియదు, అసౌకర్యంగా కూడా అనిపించదు. కానీ ఇది సరైన నిపుణుల పర్యవేక్షణలో జరగాల్సి ఉంటుంది. కాస్త తేడా వచ్చిన ఇబ్బందులు తప్పవు. ఈ భయం కారణంగానే చాలామంది ఇప్పటికీ ఎగ్ ఫ్రీజింగ్ అంటే వెనకడుగు వేస్తున్నారు.