E-Paper
Advertisement

Telangana Bandh: ఈనెల 14న తెలంగాణ రాష్ట్రా బంద్.. ఎందుకంటే..?

Telangana Bandh: ఈనెల 14న తెలంగాణ రాష్ట్రా బంద్.. ఎందుకంటే..?
Advertisement

Telangana Bandh: బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అంశంపై హైకోర్టు స్టే ఇవ్వడంపై ఆ సామాజికవర్గం నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈనెల 14న తెలంగాణ బంద్‌కు పిలుపునిచ్చారు. ఈ బంద్‌కు బీజేపీ మద్దతు తెలపాలని రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య.. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కిషన్ రెడ్డిని కలిసి బంద్‌కు మద్దతు ఇవ్వాలని కోరారు. అయితే, తాను పార్టీతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని కిషన్ రెడ్డి తెలిపారని కృష్ణయ్య వెల్లడించారు.

బంద్ స్వచ్ఛందంగా పాల్గొని విజయవంతం చేయాలని పిలుపు..
22 బీసీ సంఘాల మద్దతుతో లోకల్ బాడీ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ జీవోపై హైకోర్టు స్టే ఇవ్వడం, ప్రభుత్వ నిర్లక్ష్యంపై నిరసన తెలిపేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 14న బంద్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఆర్. కృష్ణయ్య. అందరూ ఈ బంద్‌ను విజయవంతం చేయాలని కోరారు. అన్ని రాజకీయ పార్టీలు, కుల సంఘాలు మద్దతు ఇవ్వాలని కోరినట్లు తెలిపారు. ఎన్నికల షెడ్యూల్ వచ్చాక కోర్టులు జోక్యం చేసుకోవడమేంటని ప్రశ్నించారు.

Advertisement

ఆర్గ్యుమెంట్స్ వినిపించడంలో ప్రభుత్వం విఫలం -ఆర్. కృష్ణయ్య..
బీసీ సంఘాలు ఇప్పటికే పెద్ద ఎత్తున రౌండ్ టేబుల్ సమావేశాలు, నిరసనలు, ధర్నాలు చేపడుతున్నాయని ఆర్. కృష్ణయ్య గుర్తుచేశారు. నామినేషన్లు వేశాక కోర్టుకు స్టే ఇచ్చే అధికారం లేదని ఆయన విమర్శలు చేశారు. తెలంగాణ ఉద్యమం మాదిరిగానే బీసీల ఉద్యమం ఉండబోతోందని సర్కార్‌ను హెచ్చరించారు. కోర్టు తీర్పు బీసీలకు నోటి కాడి ముద్దను లాక్కునట్టు ఉన్నదన్నారు. ఆర్గ్యుమెంట్స్ వినిపించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శలు చేశారు.

Related News

కొండా‌ సురేఖ ఆసక్తికర పోస్టు.. త్వరలో భారీ అప్‌డేట్, అసలు మేటరేంటి?

తెలంగాణ సీఎం భద్రతా సమాచారం లీక్.. తెలుగు స్క్రైబ్ నిర్వాహకులపై కేసు, అసలేం జరిగింది?

రేవంత్‌ కేబినెట్‌లోకి మరో ఫైర్‌బ్రాండ్.. హైకమాండ్‌తో విజయశాంతి మంతనాలు, ఆ శాఖ కోసం పట్టు

సొంత పార్టీని ముంచేస్తున్న నేతల దూకుడు.. కాంగ్రెస్‌ పార్టీలో నెక్స్ట్ ఏ సీనియర్ టార్గెట్?

స్పీడ్ పెంచిన రేవంత్ రెడ్డి.. రేపటి నుంచి సొంత గడ్డపై రెండు రోజుల పర్యటన !

అసదుద్దీన్ ఒవైసీ అసలైన దేశభక్తుడు.. సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభంలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

Big Stories

Advertisement
×