Yashasvi Jaiswal Century: టీమిండియా వర్సెస్ వెస్టిండీస్ ( India vs West Indies, 2nd Test) జట్ల మధ్య ప్రస్తుతం రెండవ టెస్టు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఢిల్లీలోని అరుణ్ జెట్లీ మైదానంలో ( Arun Jaitley Stadium, Delhi ) ఈ మ్యాచ్ ఇవాళ ఉదయం 9 గంటలకు ప్రారంభమైంది. ఇందులో టాస్ గెలిచిన టీమ్ ఇండియా మొదట బ్యాటింగ్ చేయాలని నిర్ణయం తీసుకుంది. దీనికి తగ్గట్టుగానే టీమిండియా భారీ స్కోరు దిశగా దూసుకు వెళ్తోంది. ఈ నేపథ్యంలోనే టీమ్ ఇండియా యంగ్ కుర్రాడు యశస్వి జైష్వాల్ ( Yashasvi Jaiswal) సెంచరీ కూడా నమోదు చేశాడు. యశస్వి జైష్వాల్ సెంచరీ నమోదు చేయగా, సాయి సుదర్శన్ హఫ్ సెంచరీ చేశాడు. దీంతో ఒకే ఒక్క వికెట్ కోల్పోయిన టీమిండియా 203 పరుగులు చేసింది. ఇదే ఊపు కొనసాగితే, ఇవాళ 400లకు పైగా పరుగులు చేస్తుంది టీమిండియా.
Also Read: MS Dhoni: CSK ఫ్యాన్స్ కు ధోని గుడ్ న్యూస్….రూ.325 కోట్లతో భారీ స్కెచ్, కాళ్లు మొక్కిన కుర్రాడు
టీమిండియా వర్సెస్ వెస్టిండీస్ మధ్య ఢిల్లీ వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ లో ఓపెనర్ యశస్వి జైస్వాల్ అద్భుతంగా రాణిస్తున్నాడు. మొదటి టెస్ట్ లో పెద్దగా రాణించకపోయిన యశస్వి జైస్వాల్, ఇవాల్టి మ్యాచ్ లో మాత్రం సెంచరీ నమోదు చేశాడు. 145 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు యశస్వి జైస్వాల్. ఇందులో 16 బౌండరీలు ఉన్నాయి. దీంతో తన టెస్టు కెరీర్ లో ఏడవ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. సెంచరీ నమోదు చేయడమే కాకుండా తన టెస్ట్ క్రికెట్ లో 3,000 పరుగులు పూర్తి చేసుకున్నాడు.
వెస్టిండీస్ జట్టుపై సెంచరీ నమోదు చేసుకున్న 23 ఏళ్ల యశస్వి జైస్వాల్… సచిన్ టెండూల్కర్ లాంటి క్రికెటర్ రికార్డు కూడా బద్దలు కొట్టాడు. ఆడిన 48 ఇన్నింగ్స్ లోనే, లిటిల్ మాస్టర్ సచిన్ టెండూల్కర్ రికార్డ్ కు చేరువయ్యాడు. 48 ఇన్నింగ్స్ లలో టీమిండియా తరఫున ఎక్కువ సార్లు 50 కి పైగా పరుగులు చేసిన ప్లేయర్ గా చరిత్ర సృష్టించాడు యశస్వి జైస్వాల్. ఇలా గతంలో 21 సార్లు రాహుల్ ద్రావిడ్ 50 కి పైగా 48 ఇన్నింగ్స్ లలో పరుగులు చేశాడు. ఆ తర్వాత సునీల్ గవాస్కర్ 48 ఇన్నింగ్స్ లలో 20 సార్లు 50 కి పైగా పరుగులు చేశాడు.
అటు సచిన్ టెండూల్కర్ 19 సార్లు ఈ ఫీట్ అందుకోగా, తాజాగా సచిన్ టెండూల్కర్ రికార్డును బద్దలు కొట్టాడు యశస్వి జైస్వాల్. 19 ఇన్నింగ్స్ లలో 50కి పైగా 48 ఇన్నింగ్స్ లలో పరుగులు చేశాడు యశస్వి జైస్వాల్. సచిన్ టెండూల్కర్ రికార్డు బద్దలు కొట్టడమే, 23 సంవత్సరాల లో సెంచరీ నమోదు చేసి మరో చరిత్ర సృష్టించాడు ఈ కుర్రాడు. 23 సంవత్సరాల వయసులో సచిన్ టెండూల్కర్ 11 సెంచరీలు చేస్తే, యశస్వీ జైశ్వాల్ ఏడు సెంచరీలు చేసి దుమ్ము లేపాడు. అంటే సచిన్ తరహాలోనే అద్భుతంగా ఆడుతున్నాడు అన్నమాట.
Also Read: IND-W vs SA-W: కొంపముంచిన హర్మన్.. దక్షిణాఫ్రికా విక్టరీ..పాయింట్ల పట్టికలో టీమిండియా సేఫ్
🚨 At just 23, Yashasvi Jaiswal completes 3,000 runs in international cricket
A true talent on the rise!#YashasviJaiswal #INDvsWI #TestCricket #TeamIndia #Cricket pic.twitter.com/0sSgDNzgsq
— OneCricket (@OneCricketApp) October 10, 2025
Young gun Yashasvi Jaiswal is on level terms with the great Sachin Tendulkar 🙌🏻🏏#YashasviJaiswal #SachinTendulkar #RahulDravid #SunilGavaskar #Tests #IndianCricket #Insidesport #CricketTwitter pic.twitter.com/DdsnIAObqa
— InsideSport (@InsideSportIND) October 10, 2025