Hardik Pandya: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 20026 Tournament) నేపథ్యంలో ముంబై ఇండియన్స్ వరుసగా ఓటమి పాలు అవుతుంటే.. ఆ జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్యా మాత్రం రోజు రోజుకు దిగజారిపోతున్నాడు. తన ప్రియురాలు మహికా శర్మతో క్లోజ్ మూవ్ అవుతూ… ఓవర్ గా బిహేవ్ చేస్తున్నాడు. స్టేడియంలో అందరూ చూస్తుండగానే హగ్గులు ఇచ్చుకోవడం.. సైగలు చేసుకోవడం చేస్తున్నాడు. ఇక లేటెస్ట్ గా డ్రెస్సింగ్ రూమ్ నుంచే ఫ్లయింగ్ కిస్సులు ఇస్తూ హార్దిక్ పాండ్యా ( Hardik Pandya) రచ్చ చేశాడు. జనాల మధ్య మహికా శర్మ ( Mahieka Sharma) కూర్చుంటే.. ఆమెను పిలిచి మరి, డ్రెస్సింగ్ రూమ్ లో నుంచి ఫ్లయింగ్ కిస్సులు ( Hardik Pandya Flying Kisses) ఇచ్చిన హార్దిక్ పాండ్యా వీడియో వైరల్ గా మారింది. ఇది చూసిన ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక వీడికి బుద్ధి రాదు.. ముంబై ఓడిపోతుంటే, వీడికి పడక సుఖం కావాల్సి వచ్చిందంటూ మండిపడుతున్నారు. వెంటనే ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ నుంచి హార్దిక్ పాండ్యాను తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు.
Also Read: Inzamam-ul-Haq: Inzamam-ul-Haq: 30 బంతుల్లో కోహ్లీ అర్ధ శతకం చేస్తే, బాబర్ మాత్రం సెంచరీ చేస్తాడు
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 20026 Tournament) నేపథ్యంలో ముంబై ఇండియన్స్ అత్యంత దారుణమైన ప్రదర్శన కనబరుస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు ముంబై ఇండియన్స్ ఏడు మ్యాచ్ లు ఆడింది. ఇందులో రెండు మ్యాచ్ లలో మాత్రమే విజయం సాధించింది ముంబై ఇండియన్స్. కేకేఆర్ అలాగే గుజరాత్ లాంటి జట్లపైన మాత్రమే విక్టరీ అందుకుంది. దీంతో పాయింట్ల పట్టికలో ముంబై ఇండియన్స్ ఎనిమిదవ స్థానంలో కొనసాగుతోంది. అయితే ముంబై ఇండియన్స్ ఇంత దిగజారడానికి కారణం హార్దిక్ పాండ్యా అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. అతని చెత్త నిర్ణయాల వల్ల ముంబై ఇండియన్స్ ఓటమిపాలవుతోందని మండిపడుతున్నారు.
ముంబై ఇండియన్స్ పైన ఫోకస్ కంటే తన ప్రియురాలు మహికా శర్మపైన ( Mahieka Sharma) హార్దిక్ పాండ్యా దృష్టి సారిస్తున్నాడని ట్రోల్స్ చేస్తున్నారు. హార్థిక్ పాండ్యా ఎక్కడికి వెళ్లినా తోకలాగా అతని ప్రియురాలు మహికా శర్మ వస్తోందని.. అటు హార్దిక్ పాండ్యా కూడా ఓవర్ గా సొల్లు పెడుతున్నాడని మళ్లీ పడుతున్నారు. లేటెస్ట్ గా డ్రెస్సింగ్ రూమ్ నుంచి ఫ్లయింగ్ కిస్సులు ఇవ్వడం పట్ల కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ముంబై ఇండియన్స్ అభిమానులు. దీనిపై ముకేశ్ అంబానీ ఫ్యామిలీ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కెప్టెన్ హార్దిక్ పాండ్యాను మార్చేసి రోహిత్ శర్మకు పదవి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.
Hardik Pandya was blowing a kiss from the dressing room towards his girlfriend and his son after match loss to CSK. He’s quite clever by bringing his son along with his girlfriend, it leaves people confused about who the kiss was actually for.😂🫡 pic.twitter.com/gFEi2FsRxk
— 𝐑𝐮𝐬𝐡𝐢𝐢𝐢⁴⁵ (@rushiii_12) April 25, 2026