E-Paper
Advertisement

Inzamam-ul-Haq: 30 బంతుల్లో కోహ్లీ అర్ధ శ‌త‌కం చేస్తే, బాబర్ మాత్రం సెంచ‌రీ చేస్తాడు

Inzamam-ul-Haq: 30 బంతుల్లో కోహ్లీ అర్ధ శ‌త‌కం చేస్తే, బాబర్ మాత్రం సెంచ‌రీ చేస్తాడు
Advertisement

Inzamam-ul-haq : ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ (Indian Premier League 2026 Tournament) చాలా ఉత్కంఠ భరితంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. మార్చి 28వ తేదీన ప్రారంభమైన ఈ మెగా టోర్నమెంటులో ఇప్పటికే 30 కి పైగా మ్యాచులు పూర్తి అయ్యాయి. మరో సగం మ్యాచ్ లు మాత్రమే మిగిలి ఉన్నాయి. అయితే ఈ టోర్నమెంట్ కు పోటీగా పాకిస్తాన్ సూపర్ లీగ్ కూడా కొనసాగుతోంది. ఇలాంటి తరుణంలో ఐపీఎల్ టోర్నమెంట్ ను చిన్నదిగా చేసేందుకు పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు కుట్రలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే విరాట్ కోహ్లీని టెస్ట్ ప్లేయర్ అంటూ పాకిస్తాన్ మాజీ కెప్టెన్ ఇంజమామ్ ( Inzamam-ul-Haq) సంచలన వ్యాఖ్యలు చేశారు. 30 బంతుల్లో విరాట్ కోహ్లీ (Virat Kohli) అర్థ సెంచరీ చేస్తే… బాబర్ ( King Babar ) మాత్రం సెంచరీ చేయడం గ్యారంటీ అంటూ కితాబు ఇచ్చారు. ఏజ్ పైబడిన వాళ్లకు ఐపీఎల్ లో ఛాన్సులు ఇస్తున్నారని పరువు తీసే ప్రయత్నం చేశారు ఇంజమామ్. దీంతో ఇంజమామ్ చేసిన వ్యాఖ్య‌లు దుమారం రేపుతున్నాయి.

Also Read: Rohit Sharma Fitness Video : గంట‌కు 100 Push-Ups..రోహిత్ శ‌ర్మ 2.0 మాములుగా లేదు, గూస్ బంప్స్ రావాల్సిందే

30 బంతుల్లో కోహ్లీ అర్ధ శ‌త‌కం చేస్తే, బాబర్ మాత్రం సెంచ‌రీ చేస్తాడు

Advertisement

పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంట్ ను హైలెట్ చేయాలన్న లక్ష్యంతో ఇంజమం వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ లో మ్యాచ్ ఫిక్సింగ్ తప్ప ఇంకేమీ ఉండదని బాంబు పేల్చారు. ఇందులో భాగంగానే విరాట్ కోహ్లీని కూడా టార్గెట్ చేశారు. ఇస్లాం మతంలోకి మారితే విరాట్ కోహ్లీని పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంట్ లోకి తీసుకుంటామని వ్యాఖ్యానించారు. పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంటులో హిందువులకు ఛాన్స్ ఇవ్వబోమని వెల్లడించారు ఇంజమామ్. ఒకవేళ విరాట్ కోహ్లీ మతం మారితే మాత్రం కచ్చితంగా తీసుకుంటామని తెలిపారు.

అలాగే విరాట్ కోహ్లీ టెస్ట్ ప్లేయర్ అంటూ పరువు తీసే ప్రయత్నం చేశారు ఇంజమాం. 30 బంతులు ఎదుర్కొని విరాట్ కోహ్లీ అర్థ సెంచరీ చేస్తే.. బాబర్ మాత్రం 50 బంతుల్లో సెంచరీ ఫినిష్ చేస్తాడని తెలిపారు. ఇప్పుడు చెప్పండి ఈ ఇద్దరిలో ఎవరు డేంజర్ ఆటగాడో? అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు ఇంజమామ్.  ప్రస్తుతం పెద్దగా ఫామ్ లో లేకపోయినా బాబర్ ఆజం అద్భుతమైన సెంచరీ చేసినట్లు ఇంజమామ్ గుర్తు చేశారు. మంచి ఫామ్ లో ఉన్న విరాట్ కోహ్లీ అర్థ సెంచరీ చేయడానికి నాన తంటాలు పడుతున్నాడని దారుణంగా ట్రోల్ చేశారు. ఇప్పటికైనా విరాట్ కోహ్లీని సెంచరీ చేసి చూపించాలని సవాల్ విసిరారు ఇంజమామ్. అయితే ఇంజమామ్ చేసిన వ్యాఖ్యలపై విరాట్ కోహ్లీ అభిమానులు కౌంటర్ ఇస్తున్నారు. విరాట్ కోహ్లీ కాలి గోటికి కూడా బాబర్ పనికిరాదని దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు.

Advertisement

Also Read: Chris Gayle Controversal Comments ON PBKS: చిన్నపిల్లాడిని చేసిన న‌ర‌కం చూపించారు…పంజాబ్ ఓన‌ర్లు దుర్మార్గులు

 

Related News

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ లో వాడిన‌ బంతుల్లో చిప్స్…షాకింగ్ వీడియో వైర‌ల్ !

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విజేతగా స్పెయిన్‌..ఏకంగా 16 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త చ‌రిత్ర‌

రోహిత్ శ‌ర్మ లార్డ్స్ సెంచ‌రీ వెనుక సీక్రెట్ ఇదే, అత‌ని వ‌ల్లే ల‌క్ క‌లిసివ‌చ్చిందా?

గంభీర్ వెనక కోహ్లీ కుప్పిగంతులు..అస‌భ్యక‌రంగా చేతులు చూపిస్తూ డ్యాన్స్

లార్ట్స్ మైదానంలో ఈ గంట కొట్ట‌డానికి కార‌ణం ఏంటి? దీని వెనుక ఉన్న‌ర‌హ‌స్యం

Big Stories

Advertisement
×