E-Paper
Advertisement

Sunil Gavaskar on H. Pandya: దేశం కోసం ఆడే ఆటగాళ్లలో హార్దిక్ పాండ్యా కూడా ఒకడు: గవాస్కర్!

Sunil Gavaskar on H. Pandya: దేశం కోసం ఆడే ఆటగాళ్లలో హార్దిక్ పాండ్యా కూడా ఒకడు: గవాస్కర్!
Advertisement
Gavaskar Said Hardik Pandya will Be a different Player in T20 World Cup: జూన్ 2 నుంచి  టీ20 వరల్డ్‌కప్ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హార్దిక్ పాండ్యా ఎంపిక కరెక్ట్ కాదని, ఫామ్‌లో లేని తనని, ఎందుకు ఎంపిక చేశారని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ముంబై ఫ్రాంచైజీ ఓనర్ల నుంచి ఒత్తిడి వచ్చిందా? లేక గుజరాత్ వాడని, అమిత్ షాతో కలిసి తిరిగాడని తీసుకున్నారా? అని ఓపెన్ గానే ప్రశ్నిస్తున్నారు.

ఈ అంశాలపై  క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ అందరికీ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు. ప్రతీ అంశాన్ని వ్యక్తిగతంగా ముడిపెట్టి చూడకూడదని అన్నాడు. ఏదో నాలుగు మ్యాచ్ లు సరిగా ఆడలేదని, ఆ ఆటగాడి కెరీర్ మొత్తాన్ని డిసైడ్ చేయలేమని అన్నాడు. నిజానికి ఐపీఎల్ వేరు, వరల్డ్‌కప్ వేరని అన్నాడు.

ఐపీఎల్‌లో ఆడటానికి, దేశం కోసం ప్రాతినిధ్యం వహించడానికి చాలా తేడా ఉంటుందని తెలిపాడు. జాతీయ జట్టుకు ఆడుతున్నప్పుడు.. ప్రతి ఆటగాడు ఎంతో గర్వంగా ఫీలవుతాడు. హార్దిక్ పాండ్యా అయితే అందుకు రెట్టింపు ఫీలవుతాడు. అదే తన బలం కూడా అని అన్నాడు. దేశం కోసం కమిట్ మెంట్ తో ఆడేవారిలో హార్దిక్ పాండ్యా ఒకడని అన్నాడు.

Advertisement

Also Read: రాజస్థాన్ ఆగుతారా? సాగుతారా? నేడు హైదరాబాద్ సన్ రైజర్స్ తో మ్యాచ్

ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్‌లో అతడు ఎన్నో సమస్యల్ని ఎదుర్కుంటున్నాడు. అయినా వాటిని అధిగమిస్తూ.. తన బాధ్యతల్ని చక్కగా నిర్వర్తిస్తున్నాడని కితాబునిచ్చాడు. వరల్డ్‌కప్ కోసం భారత్ తరఫున రంగంలోకి దిగినప్పుడు.. పాండ్యా మైండ్‌సెట్ పూర్తి భిన్నంగా ఉంటుందని అన్నాడు.

Advertisement

నిజానికి వన్డే వరల్డ్ కప్ 2023 ఫైనల్ లో పాండ్యా లేని లోటు స్పష్టంగా కనిపించిందని అన్నాడు. తనే గానీ ఉండి ఉంటే మనకి కచ్చితంగా కప్పు కొట్టేవాళ్లమని అన్నాడు. బ్యాటింగ్‌, బౌలింగ్‌ విభాగాల్లో పాండ్యా భాగస్వామ్యం ఎంతో కీలకం అవుతుందని అన్నాడు.

Also Read: MI vs kkr Preview IPL 2024: ముంబైకి చావో రేవో.. నేడు కోల్ కతాతో మ్యాచ్

ఇక్కడ ఐపీఎల్ లో అంటే వ్యక్తిగతంగా ఒత్తిడి ఉంటుంది. టీమ్ ఇండియాలో ఆడేటప్పుడు ఆ తలనొప్పి రోహిత్ శర్మ, రాహుల్ ద్రవిడ్ వీరందరూ పడతాడరు. తనకేమీ ఉండదు కదా అన్నాడు. ప్రస్తుతం నాకు మంచి జట్టుని ఎంపికచేశారు. తప్పకుండా టైటిల్ రేస్ లో టీమ్ ఇండియా ఉంటుందని అన్నాడు.

Related News

ఇమామ్ ఉల్ హక్ పెద్ద ద‌ద్ద‌మ్మ‌…త‌న‌ మామ ఇంజ‌మామ్ లాగా బ‌ద్ధ‌క‌స్తుడే

టీమిండియా ఓట‌మిని శాసించిన‌ సామ్‌ కర్రన్..అత‌ను వేసిన మూన్ బాల్స్ కొంప‌ముంచాయి

లార్డ్స్ వన్డేలో బాల్ టాంపరింగ్…శ్రేయస్ అయ్యర్ పై బ్యాన్?

లార్డ్స్ నుంచి అలిగి ఇంటికి వెళ్లిపోయిన గంభీర్..?

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ లో వాడిన‌ బంతుల్లో చిప్స్…షాకింగ్ వీడియో వైర‌ల్ !

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

Big Stories

Advertisement
×