BigTV English

Amit Shah Calls Defeat Razakars Representative: ఓల్డ్ సిటీలో అమిత్ షా.. రజాకార్ల వారసులకు విముక్తి కలిగించాలని పిలుపు

Amit Shah Calls Defeat Razakars Representative: ఓల్డ్ సిటీలో అమిత్ షా.. రజాకార్ల వారసులకు విముక్తి కలిగించాలని పిలుపు

Amit Shah Calls Defeat Razakars Representative: హైదరాబాద్‌లో ఎంఐఎం పార్టీని టార్గెట్ చేశారు కేంద్రమంత్రి అమిత్ షా. నాలుగు దశాబ్దాలుగా రజాకార్ల వారసులు హైదరాబాద్‌‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నారని, ఈసారి ఆ వారసులకు విముక్తి కల్పించాలన్నారు.


దేశంలో బీజేపీ గెలిచే సీట్లలో హైదరాబాద్ నియోజకవర్గం కూడా ఉండాలన్నారు అమిత్ షా. హైదరాబాద్ ప్రజలు ఎవరికీ భయపడాల్సిన పనిలేదని, ధైర్యంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని పిలుపు నిచ్చారు. ముఖ్యంగా ఎవరి మీద దాడులు జరగవని భరోసా ఇచ్చారు. బుధవారం హైదరాబాద్‌లోని ఓల్డ్ సిటీలో బీజేపీ రోడ్ షో నిర్వహించింది. దీనికి కేంద్రమంత్రి అమిత్ షా హాజరయ్యారు. అభ్యర్థి మాధవీలత తరపు ప్రచారం చేశారు. ఈసారి బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతను గెలిపించాలని ఓటర్లను కోరారు.

రాత్రి తొమ్మిది గంటల సమయంలో లాల్ దర్వాజ అమ్మవారిని దర్శించుకున్న అమిత్ షా,  అంతుకు ముందు ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. దాదాపు 25 నిమిషాల సేపు రోడ్ షో సాగింది. బీజేపీ ఏ వర్గానికీ వ్యతిరేకం కాదన్న అమిత్ షా, అందరికీ అండగా ఉంటామన్నారు. రాత్రి పది గంటలు కావడంతో తన ప్రసంగాన్ని మధ్యలోనే ముగించారాయన. కొన్నాళ్లుగా ఇక్కడ అత్యాచారాలు జరుగుతున్నాయని, అవి ఆగాలంటే బీజేపీ గుర్తుకు ఓటేయాలన్నారు బీజేపీ అభ్యర్థి మాధవీలత.


Also Read: బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ అరెస్ట్, ఆ కేసులో..

పాతబస్తీలో బీజేపీ అభ్యర్థుల తరపున గతంలో మాజీ ప్రధాని వాజ్‌పేయి ప్రచారం చేయగా, ఆ తర్వాత ఇప్పుడు అమిత్ షా వంతైంది. ఎంఐఎంకు కంచుకోట అయిన పాతబస్తీలో అమిత్ షా రోడ్ షోతో ఆ పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం కనిపించింది. నిన్నటివరకు ఎడముఖం, పెడముఖంగా ఉన్న గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ రోడ్ షోలో పాల్గొన్నారు.

Tags

Related News

Hyderabad floods: హైదరాబాద్‌కు భారీ వర్షాల భయం పోతుందా? సీఎం రేవంత్ రెడ్డి కొత్త ప్రణాళిక ఇదే!

Bandi Sanjay: వావి వరుసలు లేకుండా వారి ఫోన్లు ట్యాపింగ్ చేశారు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ 12 జిల్లాల్లో దంచుడే దంచుడు.. పిడుగులు కూడా..?

Weather Update: వర్షపాతాన్ని ఎలా కొలుస్తారు ? రెడ్, ఆరెంజ్, ఎల్లో అలెర్ట్‌కు అర్థం ఏంటి ?

Sunil Kumar Ahuja Scam: వేల కోట్లు మింగేసి విదేశాలకు జంప్..! అహూజా అక్రమాల చిట్టా

Phone Tapping Case: ప్రూఫ్స్‌తో సహా.. ఉన్నదంతా బయటపెడ్తా.. సిట్ విచారణకు ముందు బండి షాకింగ్ కామెంట్స్

Big Stories

×