E-Paper
Advertisement

SRH Vs RR Preview: రాజస్థాన్ ఆగుతారా..? సాగుతారా..? నేడు హైదరాబాద్ సన్ రైజర్స్ తో మ్యాచ్

SRH Vs RR Preview: రాజస్థాన్ ఆగుతారా..? సాగుతారా..? నేడు హైదరాబాద్ సన్ రైజర్స్ తో మ్యాచ్
Advertisement

IPL 2024 50th Match – Sunrisers Hyderabad Vs Rajasthan Royals: ఐపీఎల్ లో సరిగ్గా 50వ మ్యాచ్ నేడు రాజస్థాన్ వర్సెస్ హైదరాబాద్ మధ్య జరగనుంది. ఇంతవరకు ఒకే ఒక మ్యాచ్ ఓడి, సంజూ శాంసన్ కెప్టెన్సీలో రాజస్థాన్ అప్రతిహితంగా సాగిపోతోంది. ఇప్పటివరకు 8 మ్యాచ్ ల్లో విజయం సాధించి నెంబర్ వన్ స్ఠానంలో ఉంది.

ఇక హైదరాబాద్ వరుసగా మూడు మ్యాచ్ లు ధనాధన్ గెలిచి, ఒక్కసారి చతికిల పడింది. వరుసగా రెండు మ్యాచ్ లు ఓడిపోయింది. ప్రస్తుతం 5 వ స్థానంలో ఉంది. మరి ముందుకెళుతుందా? తిరిగి రేస్ లోకి వస్తుందా? లేదా అన్నది చూడాలి.

Advertisement

నేడు హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ స్టేడియంలో ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ రాత్రి 7.30 గంటలకి జరగనుంది. ఇంతవరకు ఈ రెండు జట్ల మధ్య 18 మ్యాచ్ లు జరిగాయి. రాజస్థాన్ 9 మ్యాచ్ లు, హైదరాబాద్ 9 మ్యాచ్ లు గెలిచాయి. ఈ లెక్కన చూస్తే రెండు జట్ల బలాబలాలు సమానంగా ఉన్నాయి.

Also Read: జూలు విదిల్చిన పంజాబ్ కింగ్స్ మరో గెలుపు.. ధోనీ సేన ఓటమి

Advertisement

హైదరాబాద్ విషయానికి వస్తే ఈ ముగ్గురి మీద విపరీతంగా ఆధారపడి ఉంది. వారు అయిపోతే మొత్తం తేలిపోతోంది. దీంతో అన్ని జట్లు ఆ మూడు వికెట్లపైనే ఫోకస్ పెట్టి, ముందు వారిని లేపేస్తున్నారు. ఆ ముగ్గురు ఎవరంటే ఓపెనర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, మార్ క్రమ్.. వీరే జట్టుకి ప్రధాన బలంగా ఉన్నారు. వీరిలో ఒకరు అయిపోతే తర్వాత నితీష్ నిలబెడుతున్నాడు. లేదంటే తర్వాత వచ్చిన క్లాసెన్ చూసుకుంటున్నాడు.

గత రెండు మ్యాచ్ ల్లో టాప్ ఆర్డర్ ముగ్గురు త్వరగా అయిపోయారు. అప్పుడు మొత్తం భారం వీరిమీద పడటంతో ఒత్తిడితో అవుట్ అయిపోయి మ్యాచ్ లు పోగొట్టారు. మరోవైపు బౌలింగులో కూడా బలంగానే ఉంది.

Also Read: Kavya Maran Jumps In enjoy SRH win: అప్పటివరకు టెన్షన్‌.. విజయం తర్వాత కావ్యమారన్ ఎగిరి..

ఇక రాజస్థాన్ రాయల్స్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత బాగుంటుంది. వారు అన్ని విభాగాల్లో బలంగా ఉన్నారు. ప్రతి ఒక్కరి శక్తిని పొదుపుగా వాడుతున్నారు. అందరూ కలిసి జట్టుని ఒక రేంజ్ లో ముందుకు తీసుకువెళుతున్నారు.

బౌలర్లు తేలిపోతుంటే బ్యాటర్లు నిలబెడుతున్నారు. బ్యాటర్లు ముందుగా అవుట్ అయి, లో స్కోరు చేస్తే, తర్వాత బౌలర్లు వికెట్లు తీసి మ్యాచ్ లను నిలబెడుతున్నారు. అందుకే 16 పాయింట్లతో టాప్ వన్ గా ఉన్నారు.  మరీ రెండు జట్ల మధ్య నేడు జరగబోయే మ్యాచ్ ఎలా ఉంటుందో వేచి చూడాల్సిందే.

Tags

Related News

ఇమామ్ ఉల్ హక్ పెద్ద ద‌ద్ద‌మ్మ‌…త‌న‌ మామ లాగా బ‌ద్ధ‌క‌స్తుడే

టీమిండియా ఓట‌మిని శాసించిన‌ సామ్‌ కర్రన్..అత‌ను వేసిన మూన్ బాల్స్ కొంప‌ముంచాయి

లార్డ్స్ వన్డేలో బాల్ టాంపరింగ్…శ్రేయస్ అయ్యర్ పై బ్యాన్?

లార్డ్స్ నుంచి అలిగి ఇంటికి వెళ్లిపోయిన గంభీర్..?

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ లో వాడిన‌ బంతుల్లో చిప్స్…షాకింగ్ వీడియో వైర‌ల్ !

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

Big Stories

Advertisement
×