IPL 2024 51 Match – MI Vs KKR Preview: ఐపీఎల్ 2024 సీజన్ లో అప్పుడే మూడొంతుల మ్యాచ్ లు అయిపోయాయి. ఓవరాల్ గా 74 మ్యాచ్ లకు నేడు ముంబై వర్సెస్ కోల్ కతా మధ్య 51వ మ్యాచ్ జరగనుంది. ముంబై వాంఖేడి స్టేడియంలో రాత్రి 7.30 కి మ్యాచ్ జరగనుంది.
ముంబైకి మాత్రం ఈ మ్యాచ్ చావో రేవో అని చెప్పాలి. ఇక్కడ ఓడిపోతే మాత్రం ఇక ప్లే ఆఫ్ ఆశలు దాదాపు ఆవిరైపోయినట్టే చెప్పాలి. ఎందుకంటే ఇప్పటి వరకు10 మ్యాచ్ లు ఆడి 3 మాత్రమే విజయం సాధించి, 6 పాయింట్లతో ఉంది.
ఇంక మిగిలిన 4 మ్యాచ్ లు గెలిస్తేనే 8 పాయింట్లు వస్తాయి. దాంతో టోటల్ 14 పాయింట్లతో మిగిలిన జట్ల మధ్య నిలుస్తుంది. అప్పుడిక దైవాధీనం అని చెప్పాలి. ఈసారి ఓడిపోతే ఇంకా ఆశ కూడా ఉండదని క్రీడా పండితులు అంటున్నారు. అయితే టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఈసారైన బాగా ఆడుతాడని అనుకుంటున్నారు. ఇక సూర్యకుమార్ కూడా జాగ్రత్తగా ఆడాల్సి ఉంది. అలాగే కెప్టెన్ హార్దిక్ పాండ్యా కూడా ఒత్తిడి నుంచి బయటపడి ఆడాల్సి ఉంది.
Also Read: ఉత్కంఠ పోరులో హైదరాబాద్ గెలుపు.. పోరాడి ఓడిన రాజస్థాన్ రాయల్స్
కోల్ కతా నైట్ రైడర్స్ విషయానికి వస్తే, వారు సాలిడ్ గా ఉన్నారు. ప్రస్తుతం 12 పాయింట్లతో టేబుల్ టాప్ 2లో ఉన్నారు. గెలిస్తే దిల్ దార్ గా ముందుకెళతారు. ఒకవేళ ఓడినా పెద్ద ఫరక్ పడదు. మరో రెండు మ్యాచ్ లు గెలిస్తే ప్లే ఆఫ్ కి చేరిపోతారు. అందుకని వారు ధీమాగా ఉన్నారు. ముంబై మాత్రం టెన్షన్ గా ఉంది. కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ ఆధ్వర్యంలో అటు బ్యాటింగ్, బౌలింగు అంతా బాగుంది.
మొత్తానికి పిల్లికి చెలగాటం, ఎలక్కి ప్రాణ సంకటంలా ముంబై జట్టు పరిస్థితి మారింది. ఇంతవరకు ఈ రెండు జట్ల మధ్య 32 ఐపీఎల్ మ్యాచ్ లు జరిగాయి. ముంబై 23 గెలిస్తే, కోల్ కతా 9 మాత్రమే విజయం సాధించింది. మరి నేడు వీరి మధ్య పోరు ఎలా ఉంటుందో వేచి చూడాల్సిందే.