E-Paper
Advertisement

పీక‌ల‌దాకా తాగివ‌చ్చిన‌ మహ్మద్ అమీర్…బ్యాట్ తో దాడి చేసిన పాక్ బ్యాట‌ర్‌

పీక‌ల‌దాకా తాగివ‌చ్చిన‌ మహ్మద్ అమీర్…బ్యాట్ తో దాడి చేసిన పాక్ బ్యాట‌ర్‌
Advertisement

Faheem – Amir War:  పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Pakistan Super League 2026) చాలా రసవత్తరంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ టోర్నమెంట్ నేపథ్యంలో రావల్పిండిజ్ వర్సెస్ ఇస్లామాబాద్ యునైటెడ్ ( Rawalpindiz vs Islamabad United) జ‌ట్ల‌ మధ్య 34వ మ్యాచ్ జరిగింది. కరాచీలోని నేషనల్ స్టేడియం ( National Stadium, Karachi) వేదికగా ఈ రెండు జట్లు తలపడ్డాయి. అయితే ఈ మ్యాచ్ లో రావల్పిండిజ్ ఆరు వికెట్ల తేడాతో విక్టరీ సాధించింది. అయితే ఈ మ్యాచ్ లో మహమ్మద్ అమీర్ ( Mohammad Amir), ఫహీమ్ అష్రఫ్ ( Faheem Ashraf) మధ్య గొడవ జరిగింది. ఫహీమ్ అష్రఫ్ వికెట్ తీసిన అనంతరం అమీర్ అసభ్యకరంగా సైగలు చేస్తూ బూతులు తిట్టాడు. దీంతో మహమ్మద్ అమీర్ ను కొట్టేందుకు మీద మీదకు వచ్చాడు ఫహీమ్ అష్రఫ్. బ్యాట్ ఎత్తి చూపుతూ, రెచ్చిపోయాడు ఫహీమ్ అష్రఫ్. అయితే, రావల్పిండిజ్ ప్లేయ‌ర్లు ఈ ఇద్ద‌రిని ఎంతో క‌ష్ట‌ప‌డి ఆపేశారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.

Also Read: Chris Gayle Controversal Comments ON PBKS: చిన్నపిల్లాడిని చేసిన న‌ర‌కం చూపించారు…పంజాబ్ ఓన‌ర్లు దుర్మార్గులు

పీక‌ల‌దాకా తాగివ‌చ్చిన‌ అమీర్…బ్యాట్ తో దాడి చేసిన పాక్ బ్యాట‌ర్‌

Advertisement

పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో ఇవాళ రావల్పిండిజ్ వర్సెస్ ఇస్లామాబాద్ యునైటెడ్ మధ్య 34వ మ్యాచ్ జరిగింది. అయితే ఈ మ్యాచ్ లో రావల్పిండిజ్ జట్టుకు సంబంధించిన మహమ్మద్ అమీర్, ఇస్లామాబాద్ యునైటెడ్ బ్యాటర్ ఫహీమ్ అష్రఫ్ మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఇస్లామాబాద్ యునైటెడ్ జట్టు బ్యాటింగ్ చేస్తున్న క్రమంలో 17వ ఓవర్ అమీర్ వేశాడు. అయితే అతడు వేసిన మూడవ బంతికి ఫహీమ్ అష్రఫ్ ఔట్ అయ్యాడు. వికెట్ కీపర్ మహమ్మద్ రిజ్వాన్ కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ దారిపట్టాడు. అయితే ఈ సందర్భంగా అసభ్యకరంగా బూతులు తిడుతూ రెచ్చిపోయాడు మహమ్మద్ అమీర్. పీకలదాకా తాగిన వాడిలాగా ప్రవర్తించాడు. అయితే ఫహీమ్ అష్రఫ్ వెంటనే రియాక్ట్ అయ్యాడు. బ్యాట్ చూపిస్తూ నిన్ను కొడతా అంటూ మీదకు వచ్చేసాడు. అంతలోనే ఫీల్డర్లు ఇద్దరినీ ఆపే ప్రయత్నం చేశారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. ఇది చూసిన ఇండియన్ ఫ్యాన్స్ నవ్వుకుంటున్నారు. పాకిస్తాన్ వెధ‌వలకు కొట్టుకోవడం తప్ప.. ఏది చేతకాదని సెటైర్లు పేల్చుతున్నారు.

PSL టోర్నమెంట్ లో తొలి విజయం నమోదు

పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంట్ (PSL 2026) నేపథ్యంలో రావల్పిండిజ్ జట్టు తొలి విజయాన్ని నమోదు చేసుకుంది. ఇస్లామాబాద్ యునైటెడ్ జట్టు పైన ఆరు వికెట్ల తేడాతో విక్టరీ అందుకుంది. ఈ మ్యాచ్ లో ఇస్లామాబాద్ యునైటెడ్ జట్టు 137 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని 18.1 ఓవర్లలోనే చేదించింది రావల్పిండిజ్.

Advertisement

 

Also Read: Rohit Sharma Fitness Video : గంట‌కు 100 Push-Ups..రోహిత్ శ‌ర్మ 2.0 మాములుగా లేదు, గూస్ బంప్స్ రావాల్సిందే

 

 

 

Related News

ఇమామ్ ఉల్ హక్ పెద్ద ద‌ద్ద‌మ్మ‌…త‌న‌ మామ ఇంజ‌మామ్ లాగా బ‌ద్ధ‌క‌స్తుడే

టీమిండియా ఓట‌మిని శాసించిన‌ సామ్‌ కర్రన్..అత‌ను వేసిన మూన్ బాల్స్ కొంప‌ముంచాయి

లార్డ్స్ వన్డేలో బాల్ టాంపరింగ్…శ్రేయస్ అయ్యర్ పై బ్యాన్?

లార్డ్స్ నుంచి అలిగి ఇంటికి వెళ్లిపోయిన గంభీర్..?

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ లో వాడిన‌ బంతుల్లో చిప్స్…షాకింగ్ వీడియో వైర‌ల్ !

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

Big Stories

Advertisement
×