E-Paper
Advertisement

Tanveer Ahmed: వైభ‌వ్ సూర్యవంశీ “ఇల్లీగ‌ల్ డ్ర‌గ్స్” తీసుకున్నాడు, వెంట‌నే విచార‌ణ చేయండి

Tanveer Ahmed: వైభ‌వ్ సూర్యవంశీ “ఇల్లీగ‌ల్ డ్ర‌గ్స్” తీసుకున్నాడు, వెంట‌నే విచార‌ణ చేయండి
Advertisement

Tanveer Ahmed: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంటులో ( Indian Premier League 2026 Tournament) 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ ప్రత్యర్థి బౌలర్లకు కొరకరాని కొయ్యగా తయారయ్యాడు. బూమ్రా నుంచి మొదలుకొని భువనేశ్వర్ వరకు తోపు బౌలర్లు అందరినీ ఒక ఆట ఆడుకుంటున్నాడు. మొన్న ముంబై పై ఇరగదీసిన వైభవ్ సూర్యవంశీ, నిన్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు చుక్కలు చూపించాడు. 15 బంతుల్లో అర్థ సెంచరీ చేసిన వైభవ్ ( vaibhav Sooryavanshi )  చరిత్ర సృష్టించాడు. అయితే ఈ క్రమంలో వైభవ సూర్యవంశీ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు పాకిస్తాన్ మాజీ క్రికెటర్ తన్వీర్ అహ్మద్. 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ ఇంత పవర్ జనరేట్ చేయలేదని.. అతడు ఇల్లీగల్ డ్రగ్స్ ( Illigal Drugs) తీసుకున్నాడని బాంబు పేల్చారు. దీనిపై వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ( ICC) విచారణ చేయాలని కూడా డిమాండ్ చేశారు తన్వీర్ అహ్మద్. దీంతో తన్వీర్ ( Tanveer Ahmed) చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

Also Read: Vaibhav Sooryavanshi: బుమ్రా, హేజిల్‌వుడ్‌, భువ‌నేశ్వ‌ర్ ఎవడైతే నాకేంటి ? కొడితే అవ‌త‌ల ప‌డాల్సిందే

వైభవ్ సూర్య వంశీ పై విషం కక్కుతున్న పాకిస్తాన్

Advertisement

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026 Tournament) నేపథ్యంలో అదరగొడుతున్న వైభవ్ సూర్యవంశీ పైన పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు విషం కట్టడం మొదలుపెట్టారు. తమ జట్టులో ఇలాంటి ప్లేయర్ లేడన్న అసూయతో మాట్లాడుతున్నారు. బూమ్రా లాంటి పెద్ద బౌలర్లను ఎదుర్కొని అదరగొడుతున్న వైభవ్ సూర్య వంశీని మెచ్చుకోకుండా అతనిపై అనేక ఆరోపణలు చేస్తున్నారు. తాజాగా పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ తన్వీర్ అహ్మద్ కీలక వ్యాఖ్యలు చేశారు. 15 సంవత్సరాల ఉన్న వైభవ్ సూర్యవంశీకి ఇంత ఎనర్జీ ఎలా వచ్చిందో అర్థం కావడం లేదని పేర్కొన్నారు తన్వీర్ అహ్మద్. అతడు ఇల్లీగల్ డ్రగ్స్ తీసుకొని ఐపీఎల్ మ్యాచ్లు ఆడుతున్నాడని బాంబు పేల్చారు. అందుకే పెద్ద పెద్ద బౌలర్లపై విరుచుకుపడుతూ భారీ సిక్సర్లు కొడుతున్నాడని బాంబు పేల్చారు. ఇలాంటి క్రమంలో ఖచ్చితంగా అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ రంగంలోకి దిగి విచారణ చేపట్టాలని కోరారు.

లేకపోతే నెంబర్ వన్ అంతర్జాతీయ బౌలర్లు అందరూ భజన చేసుకోవడం తప్ప ఏమీ ఉండదని చురకలు అంటించారు. కచ్చితంగా వైభవ్ సూర్య వంశీ డ్రగ్స్ తీసుకొని ఆడతాడని బాంబు పేల్చారు. లేకపోతే ఇంత స్ట్రైక్ రేటుతో.. విపరీతంగా పరుగులు చేయడం అసాధ్యమన్నారు. పాకిస్తాన్ సూపర్ లీగ్ లాంటి టోర్నమెంట్ లోకి వస్తే, వైభవ్ సూర్య వంశీకి చెమటలు పట్టిస్తామని హెచ్చరించారు. అటు పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది కూడా ఇదే తరహాలో స్పందించారు. వెంటనే వైభవ్ సూర్యవంశీ డోపింగ్ టెస్టులు నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిలకు కూడా లేఖ రాస్తానని హెచ్చరించారు. అయితే పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు చేస్తున్న ఈ కామెంట్లపై ఇండియన్ ఫాన్స్ కూడా కౌంటర్ ఇస్తున్నారు.

Advertisement

Also Read: Chahal Smoking: వివాదంలో యుజ్వేంద్ర చాహల్..సిగ‌రేట్ తాగి, న‌డిరోడ్డుపైనే..ఏం బ‌తుకురా నీది

 

?igsh=MWM0dGpteGNnZmw2aQ==

Related News

ధోని లేక ఒక్కొక్క‌డి సుఖాలు ఎక్కువ‌య్యాయి..లేకుంటే గంభీర్‌, అగార్క‌ర్ తోక‌లు క‌ట్ చేసేవాడు

పాకిస్తాన్ త‌యారు చేసిన బంతుల వ‌ల్లే, ఫిఫా వరల్డ్ కప్ స‌క్సెస్!

పిక్ పాకెట్ కేసులో పాక్ క్రికెట‌ర్ హసన్ అలీ..తోలు తీసిన ఇండియ‌న్‌ పోలీసులు !

పాకిస్తాన్ ద‌య వ‌ల్లే, మేం క్రికెట్ నేర్చుకున్నాం..ఆఫ్ఘనిస్తాన్ ప్లేయ‌ర్ సంచ‌ల‌నం !

‘వరల్డ్‌కప్‌’ ఫార్మాట్‌ మార్పు వెనుక అంబానీ కుట్ర‌లు..ఐసీసీతో BCCI కుమ్మ‌క్కై !

పియూష్ చావ్లాకు న‌ర‌కం చూపించిన‌ పాక్ బ్యాట‌ర్ న‌వాజ్..ఒకే ఓవ‌ర్ లో 20 ప‌రుగులు

ఇంగ్లాండ్ కు గుడ్ బై…శ్రీలంక జ‌ట్టులో చేరిపోయిన జోఫ్రా ఆర్చ‌ర్‌?

ఐపీఎల్ ఆడ‌టానికి సిగ్గుగా లేదా? ద‌క్షిణాఫ్రికా ప్లేయ‌ర్ల‌పై ఆండ్రీ నెల్ సీరియ‌స్‌

Big Stories

Advertisement
×