E-Paper
Advertisement

Klaasen: ఆర్సీబీకి అమ్ముడుపోయిన కాటేర‌మ్మ కొడుకు క్లాసెన్..ప‌ట్టిన క్యాచ్ వ‌దిలేసి మ‌రీ

Klaasen: ఆర్సీబీకి అమ్ముడుపోయిన కాటేర‌మ్మ కొడుకు క్లాసెన్..ప‌ట్టిన క్యాచ్ వ‌దిలేసి మ‌రీ
Advertisement

Klaasen:  ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026 Tournament ) మూడు రోజుల కింద ప్రారంభం కాగా, ప్రతి మ్యాచ్ వివాదం గానే మారుతోంది. ముఖ్యంగా మార్చి 28వ తేదీన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ (RCB VS SRH ) జట్ల మధ్య బిగ్ ఫైట్ జరిగింది. చిన్న స్వామి స్టేడియం వేదికగా జరిగిన ఈ తొలి మ్యాచ్ లో ఫిక్సింగ్ ఆరోపణలు తెరపైకి వచ్చాయి. బెంగళూరు జట్టు గెలిచేలా సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలర్లు బంతులు వేశారని పాకిస్తాన్ నుంచి కూడా ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పటికే తన్వీర్ అహ్మద్ లాంటి వాళ్లు ఫిక్సింగ్ అయిందని పేర్కొన్నారు. అయితే లేటెస్ట్ గా సన్ రైజర్స్ హైదరాబాద్ కాటేరామ్మ కొడుకు హేన్రిచ్ క్లాసెన్ ( Klaasen) చేసిన పని ఇప్పుడు వివాదంగా మారింది. విరాట్ కోహ్లీ క్యాచ్ పట్టుకున్నహేన్రిచ్ క్లాసెన్ కావాలనే వదిలేసాడని సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ చేస్తున్నారు. ఈ వీడియోలు చూస్తుంటే కూడా ఫిక్సింగ్ జరిగినట్లే మనకు కనిపిస్తోంది.

Also Read: MI vs KKR Toss Fixing: వివాదంగా టాస్..తెర‌పైకి ఫిక్సింగ్ ఆరోప‌ణ‌లు, KKRపై ముంబై విజ‌యం

హేన్రిచ్ క్లాసెన్ అమ్ముడుపోయాడంటూ ఆరోప‌ణ‌లు

Advertisement

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ 2026 టోర్న‌మెంట్ నేప‌థ్యంలో మార్చి 28వ తేదీన హైదరాబాద్ వర్సెస్ బెంగళూరు మధ్య బిగ్ ఫైట్ జరిగింది. ఈ మ్యాచ్ సందర్భంగా హైదరాబాద్ అద్భుతంగానే బ్యాటింగ్ చేసింది. కానీ బౌలింగ్ తో పాటు ఫీల్డింగ్ కారణంగా ఓడిపోవాల్సి వచ్చింది. అయితే ఈ మ్యాచ్ లో 69 పరుగులు సాధించిన విరాట్ కోహ్లీ.. 29 పరుగుల వద్ద ఔట్ అయ్యేవాడు. బౌండరీ గేటు దగ్గర విరాట్ కోహ్లీ కొట్టిన షార్ట్ ను హేన్రిచ్ క్లాసెన్ అందుకునే ప్రయత్నం చేశాడు. డైవ్ చేసి మరీ క్యాచ్ అందుకున్నారు. ఏమైందో తెలియదు కానీ ఆ బంతిని చేతిలో నుంచి హేన్రిచ్ క్లాసెన్ బయటకు నెట్టేసినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియోనే వైరల్ గా మారింది. ఈ వీడియోలో హేన్రిచ్ క్లాసెన్ కావాలనే క్యాచ్ వదిలేసినట్లు కనిపిస్తోంది. దీంతో మొదటి మ్యాచ్ లో ఫిక్సింగ్ జరిగిందని ఆరోపణలు వస్తున్నాయి. కాటేరమ్మ కొడుకు హేన్రిచ్ క్లాసెన్ కూడా బెంగళూరు ఇచ్చిన‌ డబ్బులకు అమ్ముడుపోయాడని ఫైర్ అవుతున్నారు హైదరాబాద్ అభిమానులు అంటున్నారు.

హేన్రిచ్ క్లాసెన్ ఔట్ పై కూడా వివాదం

హేన్రిచ్ క్లాసెన్ ఔట్ పై కూడా వివాదం రాజుకుంది. స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ బ్యాటింగ్ చేస్తోన్న క్ర‌మంలో హేన్రిచ్ క్లాసెన్ సిక్స‌ర్ కోసం ప్ర‌య‌త్నం చేశాడు. కానీ బౌండ‌రీ గేట్ ద‌గ్గ‌ర ఫిల్ సాల్ట్ క్యాచ్ అందుకున్నాడు. అయితే, సాల్ట్ కాలు బౌండ‌రీ గేటుకు తాకిన‌ప్ప‌టికీ, ఔట్ ఇచ్చారు అంపైర్లు. దీంతో హేన్రిచ్ క్లాసెన్ క్యాచ్ పై కూడా వివాదం నెల‌కొంది.

Advertisement

Also Read: PSL లో ఫిక్సింగ్ క‌ల‌క‌లం..అర్ధ‌రాత్రి హోట‌ల్ గ‌దిలోకి 4 గురు దుండ‌గులు..షాహీన్‌, సికంద‌ర్ పై 2 ఏళ్ల బ్యాన్

 

 

Related News

విజయ్ మాల్యాతో మందుకొట్టిన ధోనీ, రిషబ్ పంత్..షాకింగ్ వీడియో వైర‌ల్ !

డ్రెస్సింగ్ రూంలో త‌న్నుకున్న పాకిస్తాన్ క్రికెట‌ర్లు..!

ఐర్లాండ్ చేతిలో టీమిండియానే వైట్ వాష్ అయింది, అందుకే పాకిస్తాన్ ఓడిపోతోంది

ఎవ‌రెంత గింజుకున్నా, నేను రాజీనామా చేయ‌ను..న‌ఖ్వీ సంచ‌ల‌నం

ఒరేయ్ న‌ఖ్వీ? పాకిస్తాన్ జ‌ట్టును 9వ స్థానానికి దిగ‌జార్చావ్ క‌ద‌రా !

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ ఇండియాను వైట్ వాష్ చేస్తాం…రికీ పాంటింగ్ హెచ్చరిక

రిజ్వాన్ చేత‌కాని ద‌ద్ద‌మ్మ‌…భ‌విష్య‌తుల్లో పాకిస్తాన్ తరఫున మళ్లీ ఆడ‌కుండా చేస్తా

రెండు టైటిల్స్ గెలిచినా, RCB ప్లేయ‌ర్లను జంతువుల కంటే హీనంగా చూస్తున్నారు

Big Stories

Advertisement
×