విశాఖపట్నం నగరంలో సంచలనం సృష్టించిన మౌనిక హత్య కేసు విచారణలో నిందితుడు రవీంద్ర సంచలన విషయాలు వెల్లడించాడు. పోలీసుల విచారణలో తన నేరాన్ని అంగీకరించిన అతను.. మౌనికతో తనకున్న బంధం, హత్యకు దారితీసిన పరిస్థితులను క్లియర్ కట్ గా పోలీసులకు వివరించాడు. డేటింగ్ యాప్ ద్వారా మొదలైన వీరి పరిచయం చివరకు ఒక ప్రాణాన్ని బలితీసుకోవడమే కాకుండా ఘోరమైన రీతిలో ముగిసింది.
2021 లో డేటింగ్ యాప్‌లో పరిచయం..
‘2021వ సంవత్సరంలో ఒక డేటింగ్ యాప్ ద్వారా మౌనిక నాకు పరిచయమైంది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. 2023 వరకు మేం ఇద్దరం సన్నిహితంగా మెలిగాం. ఈ క్రమంలోనే నేను ఆమెకు పెళ్లి ప్రతిపాదన చేశాను. అయితే మౌనిక ఆ ప్రతిపాదనను సున్నితంగా తిరస్కరించింది. తనకు మ్యారేజ్ ఫోబియా ఉందని.. పిల్లలను కనే ఉద్దేశ్యం అస్సలు లేదని స్పష్టం చేసింది. వివాహానికి ఆమె నిరాకరించడంతో ఇద్దరి మధ్య దూరం పెరిగి విడిపోయాం. ఆ తర్వాత రవీంద్ర మరో యువతిని పెళ్లి చేసుకుని తన వైవాహిక జీవితాన్ని ప్రారంభించాం’ అని రవీంద్ర పోలీసులకు చెప్పాడు.
విశాఖలో మౌనిక హత్య కేసులో కొత్త ట్విస్ట్
మౌనికతో రిలేషన్‌పై పోలీసుల ముందు పెదవి విప్పిన రవీంద్ర
డేటింగ్ యాప్‌లో 2021లో మౌనిక పరిచయం అయ్యింది
2023 వరకూ ఇద్దరి మధ్య లవ్ ఎఫైర్ నడిచింది
మౌనికకు మ్యారేజ్ ప్రపోజల్ చేశాను
తనకు పెళ్లి ఫోబియా ఉందని మౌనిక తిరస్కరించింది
పిల్లలు కనే… https://t.co/9TdL52VYWF pic.twitter.com/TFCsHrcojo
— BIG TV Breaking News (@bigtvtelugu) March 30, 2026
మళ్లీ పరిచయం మొదలైందంటే..?
‘కొంతకాలం మౌనికకు దూరంగా ఉన్న మూనిక 2025 డిసెంబర్‌లో మళ్లీ మౌనిక టచ్ లోకి వచ్చింది. అదే సమయంలో రవీంద్ర భార్య ప్రసవం కోసం పుట్టింటికి వెళ్లడంతో మౌనికకు దగ్గరయ్యాను. అయితే ఈసారి ఆమె ప్రవర్తనలో మార్పు వచ్చింది. నా వద్ద నుంచి క్రమంగా డబ్బులు వసూలు చేయడం మొదలుపెట్టిందని. అడిగినంత డబ్బు ఇవ్వకపోతే ఆఫీసుకు వచ్చి గొడవ చేస్తానని.. స్నేహితుల ముందు పరువు తీస్తానని ఆమె బెదిరించింది. ఈ క్రమంలోనే పలు విడతల్లో ఆమెకు భారీగా నగదు చెల్లించాను. చివరగా ఒకేసారి రూ.1.90 లక్షలు కూడా ఇచ్చాను’ అని నిందితుడు రవీంద్ర పోలీసులకు వివరించాడు.
శరీర భాగాల నరికివేత..
‘డబ్బుల విషయంలో మా ఇద్దరి మధ్య గత రెండు నెలలుగా తీవ్ర వివాదం నడుస్తుంది. రెండు నెలల క్రితం ముడిసరలోవ పార్క్‌లో కలిసినప్పుడు కూడా ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలోనే సమస్యను పరిష్కరించుకుందామని నిన్న మౌనికను నా ఇంటికి పిలిచాను. అక్కడ మరోసారి వాగ్వాదం ముదరడంతో మౌనిక గట్టిగా అరిచింది. బయట ఎవరికైనా వినిపిస్తుందనే ఆందోళనతో ఆమె గొంతును గట్టిగా నొక్కాను. దీంతో ఆమె స్పృహ కోల్పోయి పడిపోయింది. మౌనిక చనిపోయిందని భావించిన నేను భయంతో మృతదేహాన్ని బాత్రూంలోకి లాక్కెళ్లాడు. సాక్ష్యాలను మాయం చేసే క్రమంలో బాడీని ముక్కలుగా నరికాను’ అని పోలీసులకు సంచలన విషయాలు చెప్పాడు.
ALSO READ: జగిత్యాల ఎస్టీ హాస్టల్‌లో దారుణం.. చీపిరితో విద్యార్థులను చితకబాదిన కూరగాయలు కోసే వ్యక్తి!