E-Paper
Advertisement

తొలి మ్యాచ్ లోనే ఫిక్సింగ్..? హేన్రిచ్ క్లాసెన్ నాటౌట్ అంటూ SRH ఫ్యాన్స్ సీరియ‌స్‌

తొలి మ్యాచ్ లోనే ఫిక్సింగ్..? హేన్రిచ్ క్లాసెన్ నాటౌట్ అంటూ SRH ఫ్యాన్స్ సీరియ‌స్‌
Advertisement

Heinrich Klaasen Wicket:   ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026 ) శనివారం ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ టోర్నమెంట్ సందర్భంగా సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్లు ( Royal Challengers Bengaluru vs Sunrisers Hyderabad) తలపడ్డాయి. అయితే ఈ మ్యాచ్ లో టాస్ ఓడిపోయి మొదట బ్యాటింగ్ చేసింది హైదరాబాద్ జట్టు. అయితే ఈ సందర్భంగా 20 ఓవర్లు వాడిన హైదరాబాద్ జట్టు 201 పరుగులు సాధించింది. అయితే ఈ మ్యాచ్ సందర్భంగా సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు డేంజర్ ఆటగాడు హేన్రిచ్ క్లాసెన్ ( Heinrich Klaasen Wicket) వికెట్ పై వివాదం నెలకొంది. బౌండరీ లైన్ వద్ద క్లాసెన్‌ క్యాచ్ సాల్ట్ పట్టుకున్నాడు. అయితే ఇది కచ్చితంగా నాటౌట్ అంటూ సన్ రైజ‌ర్స్‌ హైదరాబాద్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. అంపైర్లు అమ్ముడుపోయారని.. ఫిక్సింగ్ కారణంగానే హేన్రిచ్ క్లాసెన్ ఔట్ అయినట్లు మండిపడుతున్నారు. అటు హేన్రిచ్ క్లాసెన్ కూడా అంపైర్లతో గొడవపడి ఫీల్డ్ నుంచి బయటికి వెళ్లిపోయాడు. దీనికి సంబంధించిన ఫోటోలు అలాగే వీడియోలు వైరల్ అవుతున్నాయి.

Also Read: Shahid Afridi On PSL: ఛీ..ఛీ పింక్ బంతులు వాడ‌టం ఏంట్రా…PSL కంటే గ‌ల్లీ క్రికెట్ న‌యం, కేబుల్ టీవీ ప్ర‌సారాల కంటే దారుణం

హేన్రిచ్ క్లాసెన్ నాటౌట్ అంటూ SRH ఫ్యాన్స్ సీరియ‌స్‌

Advertisement

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ లో చిన్నస్వామి స్టేడియం వేదికగా బెంగళూరు వర్సెస్ హైదరాబాద్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. అయితే ఈ తొలి మ్యాచ్ లోనే హేన్రిచ్ క్లాసెన్ వికెట్ వివాదంగా మారింది. అతడు నాటౌట్ అంటూ సోషల్ మీడియాలో దారుణంగా పోస్టులు పెడుతున్నారు హైదరాబాద్ అభిమానులు. బెంగళూరుతో జరిగిన మ్యాచ్ లో 31 పరుగులు సాధించాడు హేన్రిచ్ క్లాసెన్. ఈ నేపథ్యంలోనే రొమారియో షెఫర్డ్ బౌలింగ్ లో ఫిల్ సాల్ట్ కు బౌండరీ గేట్ దగ్గర క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు క్లాసన్. అయితే ఫీల్డర్ ఫిల్ సాల్ట్ బౌండరీ రోప్ ను తగిలిన‌ప్ప‌టికీ.. థర్డ్ అంపైర్ తప్పుడు నిర్ణయం తీసుకున్నాడని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

అంపైర్లు అమ్ముడుపోవడం కారణంగానే దానిని ఔట్ గా ఇచ్చారని ఫైర్ అవుతున్నారు. అటు రీప్లేలో కూడా ఫిల్ సాల్ట్ ( Phil Salt) బౌండరీ గేటు తగిలినట్లే కనిపించింది. అయినప్పటికీ థర్డ్ అంపైర్ ఔట్ ఇవ్వడంపై క్లాసెన్ కూడా అసహనం వ్యక్తం చేశాడు. ఇక చేసేదేమీ లేక అసంతృప్తితో కోపంగా గ్రౌండ్ ను వీడాడు కాటేరమ్మ కొడుకు క్లాసెన్. దీనికి సంబంధించిన పోస్టులు అలాగే వీడియోలు వైరల్ అవుతున్నాయి. అయితే దీనిపై నెటిజెన్స్‌ కూడా సీరియస్ అవుతున్నారు. మొదటి మ్యాచ్ లోనే ఫిక్సింగ్ ఆరోపణలు చేస్తూ ఫైరవుతున్నారు. థ‌ర్డ్ అంపైర్ నిజంగానే ఆదిత్య బిర్లా గ్రూప్ న‌కు అమ్ముడు పోయాడ‌ని మండిప‌డుతున్నారు.

Advertisement

Also Read: DK Shivakumar On IPL Tickets: ఐపీఎల్ లో కొత్త పంచాయ‌తీ, ప్ర‌తి ఎమ్మెల్యేకు 4 VIP టికెట్లు..? డీకే శివ కుమార్ వివాద‌స్ప‌ద వ్యాఖ్య‌లు

 

 

 

 

?igsh=MWQwZGxtbDA4dG95NA==

 

Related News

పాకిస్తాన్ జ‌ట్టును చావుదెబ్బ కొడ‌తాం..దీప్తి శర్మ హెచ్చ‌రిక‌

పాకిస్తాన్ జోలికి వ‌స్తే, ప‌ళ్లు రాల‌గొడ‌తా.. ఇర్ఫాన్ ప‌ఠాన్ కు వ‌సీం హెచ్చ‌రిక‌

ప్యాంట్లు మార్చినంత ఈజీగా పాకిస్తాన్‌ కోచ్ ల‌ను మార్చుతున్నారు !

ఛీ తూ..అస‌లు నీది బ‌తుకేనా ? ఇంగ్లండ్ దెబ్బ‌కు ఇమామ్ ప్యాంట్ త‌డిపేసుకున్నాడు

టీమిండియాలో లెస్బియన్ జంట..లైవ్ మ్యాచ్ లో రొమాన్స్?

తమిళనాడులో పార్టీ పెడితే, వచ్చే ఎన్నికల్లో ధోని సీఎం కావడం పక్కా?

నా అల్లుడిపై బ్యాన్ వేస్తే, అంద‌రి భాగోతాలు బ‌య‌ట‌పెడ‌తా..ఇంజ‌మామ్ హెచ్చ‌రిక‌

మ‌రో వివాదంలో మ‌హ్మ‌ద్ రిజ్వాన్..డ్ర‌గ్స్ తీసుకున్న‌ట్లు ఆరోప‌ణ‌లు !

Big Stories

Advertisement
×