E-Paper
Advertisement

Illegal Bakery: డేంజర్ బెల్స్.. మీరు ఉస్మానియా బిస్కెట్లు తింటున్నారా..?

Illegal Bakery: డేంజర్ బెల్స్.. మీరు ఉస్మానియా బిస్కెట్లు తింటున్నారా..?
Advertisement

Illegal Bakery: స్వేచ్ఛ బ్యూరో: అపరిశుభ్ర వాతావరణంలో కల్తీ ముడి పదార్థాలతో ఉస్మానియా బిస్కెట్​ తోపాటు బేకరీ ఉత్పత్తులను తయారు చేస్తున్న కేంద్రంపై గోల్కొండ జోన్​ టాస్క్​ ఫోర్స్​ అధికారులు గుడిమల్కాపూర్ పోలీసులతో కలిసి దాడి చేశారు. తనిఖీలు జరిపి 12.54లక్షల రూపాయల విలువ చేసే వస్తువులు, ముడి సరుకును స్వాధీనం చేసుకున్నారు. టాస్క్​ ఫోర్స్​ అదనపు డీసీపీ అందె శ్రీనివాస రావు తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.

నాసిరకం ముడి పదార్థాలతో..

కేడీ కాలనీ నివాసి అహ్మద్ రజా (46) వ్యాపారి. ఎలాంటి లైసెన్స్​ తీసుకోకుండా అపరిశుభ్రమైన వాతావరణంలో నాసిరకం ముడి పదార్థాలతో ఉస్మానియా బిస్కెట్లు, రస్కులు, బటర్​ బన్​ తదితర వాటిని తయారు చేస్తూ కిరాణా షాపులు, హోటళ్లు, కేఫ్​ లకు సరఫరా చేస్తున్నాడు. ఈ మేరకు సమాచారాన్ని సేకరించిన టాస్క్​ ఫోర్స్ సీఐ వెంకటేశ్​, గుడిమల్కాపూర్ సీఐ రామయ్య, ఎస్​ఐలు వెంకటరమణ, సురేశ్​ తోపాటు సిబ్బందితో కలిసి తయారీ కేంద్రంపై దాడి చేశారు.

Advertisement

Also Read: Film industry: ఇండస్ట్రీలో విషాదం.. ఆయన లోటు తీర్చరానిది!

మైదా సీజ్..

తనిఖీలు జరిపి 60 బస్తాల మైదా పిండి, 3‌‌0 బస్తాల చక్కెర, 47 బాక్సుల పామాయిల్ బాక్సులు, 188 బాక్సుల హిమానీ బేక్​ మ్యాజిక్​ నెయ్యితోపాటు తయారు చేసి సిద్ధంగా పెట్టిన ఉస్మానియా బిస్కెట్లు, ఫ్యాన్​ బిస్కెట్లు, రస్కులు, బటర్​ బన్​ లను స్వాధీనం చేసుకున్నారు. దాంతోపాటు షుగర్​ గ్రైండింగ్ మిషన్​, స్పైరల్​ మిక్సర్​, ఓవెన్​ తదితర పరికరాలను కూడా సీజ్ చేశారు. అహ్మద్ రజాను అరెస్ట్ చేసి తదుపరి దర్యాప్తు నిమిత్తం మల్కాజిగిరి పోలీసులకు అప్పగించారు.

Advertisement

Also read: Kishan Reddy: సమస్యకు పరిష్కారం.. ఇందన కొరత పై క్లారిటీ ఇచ్చిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

Related News

Contract Teachers: ఉపాధ్యాయులకు గుడ్ న్యూస్.. రూ.21.99 కోట్ల నిధులు విడుదల!

Voter Revision: హైదరాబాద్‌లో ఓట్ల తొలగింపు కుట్ర?.. విజిలెన్స్ డేగ కన్ను..!

Banjara Ekta: బంజారా ప్రజలకు బిగ్ అలర్ట్.. ఈ నెల 27న ఢిల్లీలో భారీ బహిరంగ సభ!

కానిస్టేబుల్ పై ఫోక్సో కేసు నమోదు.. ఎక్కడంటే..?

నీట్ అక్రమాలపై పార్లమెంట్‌లో చర్చ జరగాల్సిందే.. బీజేపీపై ఎంపీ చామల ఫైర్!

హైదరాబాద్‌లో ఆ ఓట్లపై కాంగ్రెస్, MIM కన్ను.. రంగంలోకి దిగిన బీజేపీ!

కాంగ్రెస్ నడిచే పడవ కాదు.. మునిగే పడవ.. ప్రభుత్వంపై కేటీఆర్ సెటైర్లు!

కేవలం రూ. 6 లక్షలకే హైదరాబాద్‌లో ఇల్లు.. ప్రభుత్వం బంపరాఫర్!

Big Stories

Advertisement
×