BigTV English

Sara Tendulkar : గిల్ కు షాక్… కొత్త కుర్రాణ్ణి పట్టిన సచిన్ టెండుల్కర్ కూతురు సారా!

Sara Tendulkar : గిల్ కు షాక్… కొత్త కుర్రాణ్ణి పట్టిన సచిన్ టెండుల్కర్ కూతురు  సారా!

Sara Tendulkar : టీం ఇండియా స్టార్ బ్యాట్స్‌మన్ శుభ్‌మాన్ గిల్ తన ఆటతోనే కాకుండా తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి వార్తల్లో నిలుస్తున్నాడు. గత కొన్ని సంవత్సరాలుగా, గిల్ పేరు మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కుమార్తె సారా టెండూల్కర్‌తో ముడిపడి ఉంది. కానీ, వీరిద్దరూ దీనిపై ఇంతవరకు స్పందించలేదు. ఇప్పుడు వీరిద్దరూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకున్నారు. ఆ తర్వాత, ఇద్దరూ విడిపోయారని రూమర్స్ కూడా వినిపించాయి. తాజాగా అవి వాస్తవం అనే తేలాయి. అంతేకాదు.. ఇప్పుడు కొత్త కుర్రాడిని పట్టినట్టు తెలుస్తోంది.


Also Read :  Kagiso Rabada: ఐపీఎల్ 2025 పై డ్రగ్స్ భూతం… అడ్డంగా దొరికిపోయిన రబాడ

బాలీవుడ్  లో ఓ కొత్త రూమర్ క్రియేట్ అవుతోంది. పవర్ పుల్ పెర్పార్మెన్స్ కి పేర్గాంచిన రైజింగ్ స్టార్ సిద్ధాంత్ చతుర్వేది, క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ కుమార్తె సారా టెండూల్కర్ తో డేటింగ్ చేస్తున్నట్టు సమాచారం. తాజా సమాచారం  ప్రకారం.. ఇద్దరూ అనేక సందర్భాల్లో కలిసి కనిపించారు. ఇది బి-టౌన్‌లో సరికొత్త ప్రేమ పక్షులు కావచ్చు అనే ఊహాగానాలకు దారితీసింది. వాస్తవానికి వీరిద్దరి మధ్య కెమిస్ట్రీకి ఇవి ప్రారంభం రోజులేనని.. వారు ఒకరి సహవాసాన్ని ఆనందిస్తున్నట్టు అనిపించింది. ఒకరినొకరు చాలా సౌకర్యంగా కనిపించారు.  అమితాబ్ బచ్చన్ మనవరాలు నవ్య నవేలి నందాతో సిద్ధాంత్ రిలేషన్ షిప్‌లో ఉన్నట్లు గతంలో పుకార్లు రావడంతో ఈ పరిణామం చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేసింది. సిద్ధాంత్, నవ్య ఇద్దరూ ఎప్పుడూ పెదవి విప్పకుండానే ఉన్నారు. సోషల్ మీడియాలో వీరి ప్రేమ వ్యవహారం పై కోడై కూసింది.


తాజాగా సారా టెండూల్కర్ ( Sara Tendulkhar ).. సిద్ధాంత్ చతుర్వేది మధ్య రిలేషన్ పై రూమర్స్ వినిపించడం విశేషం. సారా టెండూల్కర్ గతంలో క్రికెటర్ శుభ్ మన్ గిల్ తో ప్రేమలో పడింది. వారిద్దరూ మాత్రం అధికారికంగా ప్రేమలో ఉన్నట్టు మాత్రం ఎక్కడ ఆధారాలు లేవు. కానీ సోషల్ మీడియాలో మాత్రం వీరిపై రకరకాల వార్తలు వినిపించాయి. ఒకానొక సమయంలో గిల్ తో డేటింగ్ చేస్తున్నట్టు రూమర్స్ వచ్చినా ఆమె పట్టించుకోలేదు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన కొంతమంది అబ్బాయిలకు మీరు తప్పుగా భావించారు అబ్బాయిలు అంటూ రిప్లై కూడా ఇచ్చింది సారా టెండూల్కర్. మరోవైపు వృత్తి పరంగా సిద్ధాంత్ చతుర్వేదికి రోలర్ కోస్టర్ ఆఫ్ రైడ్ ఉంది. గల్లీ బాయ్ లో తన అద్భుతమైన పాత్రకు విమర్శకుల ప్రశంసలు పొందాడు.  ఇటీవలే చిత్రం, యుధ్రా, మోస్తరు వంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద యావరేజ్ గానే ఆడాయి. అయినప్పటికీ ఈ నటుడు మాత్రం స్పీడ్ మాత్రం తగ్గించలేదు. కానీ సిద్ధాంత్ చతుర్వేది ( Siddhant Chaturvedi ).. సారా టెండూల్కర్ తో ప్రేమాయణం.. గిల్ కి సారా బ్రేక్ చెప్పేసిందనే వార్త ఇప్పుడు సంచలనంగా మారడం విశేషం.

Also Read: Kagiso Rabada: ఐపీఎల్ 2025 పై డ్రగ్స్ భూతం… అడ్డంగా దొరికిపోయిన రబాడ

Related News

Babar Azam : 712 రోజులు అయింది.. కానీ మాత్రం ఒక్క సెంచరీ చేయలేకపోయాడు… అత్యంత ప్రమాదంలో బాబర్

Virender Sehwag: డైపర్ వేసుకొని సచిన్ సెంచరీ కొట్టాడు.. సీక్రెట్ బయటపెట్టిన సెహ్వాగ్

Watch Video : ఇదెక్కడి క్రికెట్ రా.. ఇలా ఆడితే అస్సలు రన్ అవుట్ కాబోరు

Sanju Samson : సంజూ అరాచకం.. వరుసగా 6,6,6,6,6,6

Rahul Dravid : రాహుల్ ద్రావిడ్ ఎప్పుడైనా సిక్స్ లు కొట్టడం చూశారా.. ఇదిగో వరుసగా 6,6,6… వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే

Mohammed Siraj : ప్రియురాలితో రాఖీ కట్టించుకున్న టీమిండియా ఫాస్ట్ బౌలర్!

Big Stories

×