Kagiso Rabada: సౌతాఫ్రికా స్టార్ పేసర్, గుజరాత్ టైటాన్స్ ప్రధాన బౌలర్ కగిసో రబాడకి డ్రగ్స్ టెస్ట్ లో పాజిటివ్ రావడంతో ఐపీఎల్ కి దూరమయ్యాడు. ఈ విషయాన్ని స్వయంగా రబాడనే వెల్లడించడం గమనార్హం. రబాడ నిషేదిత డ్రగ్స్ వాడిన కారనంగా క్రికెట్ నుంచి తాత్కాలికంగా సస్పెండ్ చేశారు. దీంతో ఈ విషయం ప్రపంచాన్ని కలిచివేసింది. తొలుత వ్యక్తిగత కారణాలంటూ ఐపీఎల్ 2025 సీజన్ కి రెండు మ్యాచ్ లు ఆడిన తరువాత రబాడ లీగ్ నుంచి తప్పుకున్నాడు. తాజాగా విడుదల చేసిన అధికారిక ప్రకటనలో డ్రగ్స్ టెస్ట్ లో పాజిటివ్ రావడంతోనే స్వదేశానికి తిరిగి వెళ్లినట్టు వెల్లడించారు. ఇక ఈ ప్రకటన దక్షిణాఫ్రికా క్రికెటర్స్ అసోసియేషన్ ద్వారా విడుదల చేశారు. ఈ సస్పెన్షన్ ఇంకెంత కాలం అమలులో ఉండబోతున్నదనేది మాత్రం తెలియదు. రబాడ లేకపోవడంతో గుజరాత్ టైటాన్స్ కి బౌలింగ్ పరంగా కొంచెం ఇబ్బంది అవుతుందనే చెప్పవచ్చు.
Also Read : RCB Fans Trolls CSK: ధోనిని ర్యాగింగ్ చేస్తున్న కోహ్లీ ఫ్యాన్స్.. జైలు జెర్సీలతో !
ఐపీఎల్ 2025లో గుజరాత్ టైటాన్స్ జట్టుకు పెద్ద దెబ్బ కాకుండా జూన్ 11న జరుగనున్న ముఖ్యమైన వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్ కి కూడా అతని ఆడటం పై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. క్రికెట్ కి తిరిగి రాలేకపోతే దక్షిణాఫ్రికా జట్టుకు అదిపెద్ద లోటే అవుతుంది. తన ప్రకటనలో రబాడ ఈ పరిణామం వల్ల నిరాశకు గురి చేసినందుకు మన్నించండి. నేను క్రికెట్ ను ఎప్పటికీ తేలికగా తీసుకోను. నా బాధ్యతను తెలుసుకున్నాను. త్వరలో పోటీ క్రికెట్ కి తిరిగి రావాలని ఆశిస్తున్నట్టు తెలిపారు. రబాడప్రకటనకు గుజరాత్ టైటాన్స్, సౌతాఫ్రికా క్రికెట్ అసోసియేషన్ తన లీగల్ టీమ్ అందించిన మద్దతుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. తాను కష్టపడి తిరిగి వచ్చి బలంగా రాణించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతానని ధైర్యంగా చెప్పారు రబాడ. అయితే రబాడ వాడినటువంటి డ్రగ్ ఏది అనేది మాత్రం ఇప్పటివరకు అధికారికంగా వెల్లడించలేదు. అసలు దానిని ఎప్పుడు వాడారు.. ఎలా వాడారు అనే అంశాలపై కూడా ఇంకా స్పష్టత ఇవ్వలేదు.
గుజరాత్ టైటన్స్ జట్టుకు ఇది తీవ్రమైన పరిణామం అనే చెప్పాలి. ఈ సీజన్ మధ్యలో కీలక బౌలర్‌ను కోల్పోవడం జట్టుకు వ్యూహాత్మకంగా దెబ్బతీసే అవకాశం ఉంది. రబాడ గతంలో దక్షిణాఫ్రికా తరఫున అన్ని ఫార్మాట్లలో గన్ బౌలర్‌గా రాణించడమే కాక.. IPLలో కూడా చాలా విజయవంతమైన ప్రయాణం కొనసాగించడంలో ముందు వరుసలో ఉన్నాడు. కానీ ఇప్పుడు జరిగిన ఈ డ్రగ్ వివాదం అతని కెరీర్‌ను చిన్న భిన్నం చేసే ప్రమాదం కూడా లేకపోలేదు. క్రికెట్ ప్రపంచం మొత్తం అతని పునరాగమనాన్ని ఎంతో ఆసక్తిగా గమనిస్తోంది. ఐపీఎల్ లీగ్ లో పిచ్ ల గురించి కూడా ఆయన కామెంట్స్ చేయడంతో బీసీసీఐ ఆగ్రహించి తొలగించినట్టు రూమర్స్ వచ్చాయి. మరీ రబాడ డ్రగ్ బారీన పడటం ఏంటి అని అందరూ చర్చించుకోవడం విశేషం.