IPL Players Like Celebrities : సాధారణంగా సమ్మర్ వచ్చిందంటే చాలు ఐపీఎల్ సీజన్ వచ్చేస్తుంటుంది. ఈ ఐపీఎల్ లో అందరూ ఆటగాళ్లు కలిసి క్రికెట్ ఆడితే ఆ మజానే వేరుంటుంది. ఫోర్లు, సిక్స్ లు, వికెట్లు, సూపర్ ఓవర్ ఇలా ఒక్కటేంటి.. ఐపీఎల్ మ్యాచ్ లో ఉండే మజా మరే మ్యాచ్ లో ఉండదనే చెప్పవచ్చు. అయితే ఈ ఐపీఎల్ లో ఆడే క్రీడాకారులు కొందరూ టాలీవుడ్ హీరోల మాదిరిగా కనిపించడం విశేషం. ముఖ్యంగా హార్దిక్ పాండ్యా, కృణాల్ పాండ్యా, సాయి కిషోర్ వంటి క్రీడాకారుల మాదిరిగానే టాలీవుడ్ హీరోలు కనిపించడం గమనార్హం. ప్రస్తుతం వీరి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా హీరో ధనుష్ మాదిరిగా..కనిపిస్తాడు. సడెన్ గా చూస్తే వారు వారా..?వారు వీరా అన్నట్టు కనిపిస్తోంది. అలాగే ఆర్సీబీ ఆటగాడు కృణాల్ పాండ్యా మాదిరిగానే తారక్ పొన్నప్ప కనిపిస్తాడు. ఇక ప్రస్తుతం కృణాల్ పాండ్యా సోషల్ మీడియాలో కాస్త ఎక్కువగా వైరల్ అవుతున్నాడు. కృనాల్ పాండ్యా పుష్ప2లో నటించాడని.. కొందరు అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. పుష్ప 2లో కృనాల్ పాండ్యా అతిథి పాత్ర చేశాడంటూ చెబుతున్నారు. పుష్ప 2లో కొగటం బుగ్గారెడ్డి పాత్రలో తారక్ పొన్నప్ప నటించారు. ఈ చిత్రంలో ఆయన కేంద్ర మంత్రి కొగటం వీర ప్రతాప్ రెడ్డికి మేనల్లుడిగా, కొగటం సుబ్బారెడ్డి కొడుకుగా నటిస్తున్నారు. సినిమాలోని ఓ సీన్‌లో అతని లుక్ బ్యాంగిల్స్, ముక్కుపుడక, నెక్లెస్, చెవిపోగులతో కనిపించింది. ఈ సినిమాలో ఆయన లుక్ అభిమానులను ఆకట్టుకుంది. సినిమాలో అతని లుక్ కృనాల్ పాండ్యాతో సరిపోతుంది. చాలా మంది ఫ్యాన్స్ కృనాల్ అతిథి పాత్రను పోషించాడంటూ సరదాగా కామెంట్స్ చేస్తున్నారు.
అలాగే గుజరాత్ టైటాన్స్ బౌలర్ సాయి కిషోర్ మాదిరిగానే మ్యాడ్ 2లో నటించిన సంగీత్ శోభన్ కనిపిస్తాడు. అచ్చం వీరు అచ్చు గుద్దినట్టే కనిపిస్తున్నారంటూ సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ చేస్తున్నారు. ముఖ్యంగా మనిషిని పోలిన మనుషులు ఏడుగురు ఉంటారని మన పెద్దలు చెబుతుంటారు. అలాగే వీరున్నారని.. సేమ్ అవే పోలికలు అని చర్చించుకోవడం విశేషం. హార్దిక్ పాండ్యా ప్రస్తుతం ముంబై ఇండియన్స్ టీమ్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. ముంబై టీమ్ ప్రస్తుతం పాయింట్ల పట్టికలో నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతోంది. ఇదే జోరు కనబరిస్తే.. ఈ సారి ముంబైకి మరో టైటిల్ ఖాయమని అభిమానులు పేర్కొంటున్నారు. ఇక కృణాల్ పాండ్యా ఆర్సీబీ తరుపున ఆడుతున్నాడు. అటు బౌలింగ్.. ఇటు బ్యాటింగ్ రెండింటిలో రాణిస్తున్నాడు. ఈ సీజన్ లో అద్భుతమైన బ్యాటింగ్ చేసి జట్టును విజయతీరాలకు చేర్చాడు. మొన్న ఢీల్లీ పై 73 పరుగులు చేసి విజయం లో కీలక పాత్ర పోషించాడు. అలాగే గుజరాత్ బౌలర్ సాయి కిషోర్ కూడా ఈ సీజన్ లో గుజరాత్ తరపున బౌలింగ్ చేస్తున్నాడు. ఈ సీజన్ లో ఫామ్ లోకి వచ్చాడు. అయితే గుజరాత్ కీలక బౌలర్ రబాడ డ్రగ్ వివాదం కారణంగా గుజరాత్ టైటాన్స్ జట్టుకు దూరమయ్యాడు. దీంతో గుజరాత్ కి కాస్త ఎదురుదెబ్బ అనే చెప్పవచ్చు.