E-Paper
Advertisement

Lionel Messi private jet: మెస్సీ ఇండియాకు వ‌చ్చిన‌ ఈ విమానం ధ‌ర ఎంతో తెలుసా..దీని ఫీచ‌ర్స్ చూస్తే షాక్ అవ్వాల్సిందే

Lionel Messi private jet:  మెస్సీ ఇండియాకు వ‌చ్చిన‌ ఈ విమానం ధ‌ర ఎంతో తెలుసా..దీని ఫీచ‌ర్స్ చూస్తే షాక్ అవ్వాల్సిందే
Advertisement

Lionel Messi private jet: అర్జెంటీనా దిగ్గజ ఫుట్ బాల్ ప్లేయర్ లియోనెల్ మెస్సీ ( Lionel Messi ) గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఎన్నో ఫుట్ బాల్‌ మ్యాచ్ లు ఆడి ప్రపంచ చరిత్ర సృష్టించాడు. రోనాల్డోకు పోటీగా నిలిచాడు లియోనెల్ మెస్సీ. అయితే అలాంటి లియోనెల్ మెస్సీ గోట్ టూర్ ఆఫ్ ఇండియా కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగానే శనివారం అంటే డిసెంబ‌ర్ 13వ తేదీ వేకువ జామున రెండున్నర గంటల ప్రాంతంలో కోల్ కతాకు చేరుకున్న లియోనెల్ మెస్సీ, అక్కడ 70 అడుగుల తన విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. అక్కడి నుంచి నేరుగా హైదరాబాద్ వచ్చిన లియోనెల్ మెస్సీ, ఉప్పల్లో మ్యాచ్ ఆడాడు.

Also Read: Messi Meets Revanth: నేడే రేవంత్ రెడ్డి వ‌ర్సెస్‌ మెస్సీ మ్యాచ్‌…షెడ్యూల్ ఇదే,ఒక్క‌ ఫోటోకు రూ.10 లక్షలు

లియోనెల్ మెస్సీ విమానం ధర, దీని స్పెషాలిటీ ఏంటో తెలుసా ?

Advertisement

డిసెంబర్ 13వ తేదీన ఇండియాకు లియోనెల్ మెస్సీ ( Lionel Messi G.O.A.T Tour) వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇండియాకు వచ్చిన లియోనెల్ మెస్సీ ప్రత్యేకంగా ఓ ప్రైవేట్ జెట్ లోనే ఇండియాకు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో అతడు వాడుతున్న ప్రైవేటు విమానం గురించి సోషల్ మీడియాలో చర్చిస్తున్నారు. ఈ స్పెషల్ ప్రైవేట్ జెట్ చాలా సేఫ్టీ అని తెలుస్తోంది. సౌకర్యవంతంగా ఉండటమే కాకుండా అధునాతన సౌకర్యాలు ఇందులో ఉంటాయట.

ఈ ప్రైవేట్ జెట్ మోడల్ పేరు గల్ఫ్ స్ట్రీమ్ V ( Gulfstream V Private Jet). ఇది మన ఇండియాలో ఏ దిగ్గజ వ్యాపారవేత్త దగ్గర కూడా లేదట. ఏ దేశానికి వెళ్లినా ఈ విమానాన్ని మాత్రమే లియోనెల్ మెస్సీ ఉపయోగిస్తాడని అంటున్నారు. దీని కండిషన్, సేఫ్టీ, లగ్జరీ చాలా బాగుంటుందట. ఇక ఇండియాకు తీసుకువచ్చిన ఈ ప్రైవేట్ జెట్ ధర 15 మిలియన్ల వరకు ఉంటుందని సమాచారం. అంటే మన ఇండియన్ రూపాయలలో రూ. 136 కోట్లకు పైగా ఈ విమానం ధర ఉంటుందట. ఈ గల్ఫ్ స్ట్రీమ్ వి గరిష్టంగా mach 0.885 వేగంతో దూసుకు వెళ్తుందని చెబుతున్నారు. అంతేకాదు ఆల్ట్రా లాంగ్ రేంజ్ బిజినెస్ జెట్ ఇది. ఇది నాన్ స్టాప్ గా 6500 నాటికల్ మైల్స్ వరకు ప్రయాణిస్తుందని నిపుణులు చెబుతున్నారు. అంటే సుమారు 12000 కిలోమీటర్ల వరకు దూసుకు వెళ్తుందట.

లియోనెల్ మెస్సీ విమానం ప్రత్యేకతలు

Advertisement

లియోనెల్ మెస్సీ ప్రైవేట్ విమానం చాలా భద్రతను అందిస్తుంది. ఈ విమానంలో 14 లెదర్ సీట్లు ఉంటాయి. అంటే కేవలం 14 మంది మాత్రమే ప్రయాణించవచ్చు. ఈ 14 సీట్లను పడుకోవడానికి కూడా మార్చుకోవచ్చు. సీటు అడ్జస్ట్మెంట్ చేసి హాయిగా నిద్రించవచ్చట. ఈ విమానంలో కిచెన్ కూడా ఉంటుందట. రెండు బాత్రూంలతో పాటు బెడ్ రూమ్ తరహాలో రూమ్స్ కూడా ఉంటాయట. ఇక ఈ జెట్ తోక భాగంగా లియోనెల్ మెస్సీ జెర్సీ నంబ‌ర్ 10 ఉంటుంది. ఈ విమానం మెట్ల ద‌గ్గ‌ర లియోనెల్ మెస్సీ జెర్సీ ఫ్యామిలీ ఫోటోలు ఉంటాయి.

Also Read: T20 World Cup 2026: అదంతా ఫేక్‌.. టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ ప్ర‌సారాల‌పై ICC అదిరిపోయే ప్ర‌క‌ట‌న‌, 2027 వ‌ర‌కు ఢోకా లేదు

 

Related News

పాకిస్తాన్ జట్టులో ప్రకంపనలు..కోచ్ మైక్ హెసన్ కాలర్ పట్టుకున్న షాహీన్ అఫ్రిది

ముస్లిం క్రికెట‌ర్ల‌కు టీమిండియాలో ఛాన్స్ ఇవ్వ‌రు కానీ పాకిస్తాన్ వ‌చ్చేయ్ !

ఇస్లామాబాద్ లో హై టెన్ష‌న్‌…ఇంగ్లాండ్ క్రికెట‌ర్లు బ‌స చేస్తున్న హోట‌ల్ ద‌గ్గ‌ర భారీ బ్లాస్ట్ !

ప్రీతి జింటా లాగా సొట్ట బుగ్గలేసుకుని, వీడేం వికెట్ కీపింగ్ చేస్తాడురా నాయ‌నా ?

పాకిస్తాన్ అంటేనే ఎగిరెగిరి ప‌డ‌తారు, కానీ సిగ్గు లేకుండా మాతో మ్యాచ్ లు ఆడ‌తారు!

ద‌రిద్రుడు అగార్క‌ర్ పోయినా రాత మార‌లేదే…ష‌మీ, భువీల‌ను న‌ట్టేట ముంచారు క‌ద‌రా?

విండీస్ పై చివ‌రి మ్యాచ్ ఆడేశాడు…ఇక ర‌వీంద్ర జ‌డేజా రిటైర్మెంట్ ఇవ్వాల్సిందే

రీ-ఎంట్రీపై ప‌గ‌టి క‌ల‌లు వ‌ద్దు..ఇక‌ రిటైర్మెంట్ ఇచ్చేసి, స‌న్యాసం తీసుకో !

Big Stories

Advertisement
×