U19 Asia Cup 2025: అండర్ 19 ఆసియా కప్ 2025 టోర్నమెంటులో ( ACC Mens U19 Asia Cup 2025) టీమిండియా అదరగొడుతోంది. తన మొదటి మ్యాచ్ లో అద్భుత విజయం సాధించిన టీమిండియా, రెండో మ్యాచ్ లో కూడా గ్రాండ్ విక్టరీ కొట్టింది. ఈ అండర్ 19 ఆసియా కప్ 2025 టోర్నమెంట్ లో భాగంగా ఇవాళ పాకిస్తాన్ వర్సెస్ టీమ్ ఇండియా ( India U19 vs Pakistan U19,) మధ్య మ్యాచ్ దుబాయ్ వేదికగా జరిగింది. ఇందులో అద్భుతంగా రాణించిన టీమ్ ఇండియా, 90 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇండియా విధించిన 241 పరుగుల లక్ష్యాన్ని చేదించే క్రమంలో అట్టర్ ఫ్లాఫ్ అయింది పాకిస్తాన్. 41.2 ఓవర్లలో 150 పరుగులకు కుప్పకూలింది పాకిస్తాన్. దీంతో టీమ్ ఇండియా చేతిలో దారుణ ఓటమి చవిచూసింది పాకిస్తాన్ అండర్ 19 టీం.
అండర్ 19 ఆసియా కప్ 2025 టోర్నమెంట్ లో భాగంగా ఇవాళ పాకిస్తాన్ వర్సెస్ టీమ్ ఇండియా ( India U19 vs Pakistan U19,) మధ్య దుబాయ్ లోని అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ 50 ఓవర్ల మ్యాచ్లో మొదటి బ్యాటింగ్ చేసిన టీమిండియా 46.1 ఓవర్లలో 240 పరుగులు చేసి ఆల్ అవుట్ అయింది. పాకిస్తాన్పై వైభవ్ సూర్య వంశీ అదరగొడతాడు అనుకుంటే అట్టర్ ప్లాప్ అయ్యాడు. కానీ ఆయుష్ మాత్రే 38 పరుగులు చేయగా, అరుణ్ జార్జ్ 85 పరుగులతో దుమ్ము లేపాడు. అటు చివరలో కనిష్క్ చౌహన్ 46 పరుగులతో రఫ్పాడించాడు.
దీంతో 240 పరుగులు చేయగలిగింది టీమిండియా. అయితే ఈ 241 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో పాకిస్తాన్ ఎక్కడ కూడా పోటీ ఇవ్వలేకపోయింది. 41.2 ఓవర్లలో పాకిస్తాన్ ఆల్ అవుట్ అయింది. హజాఫియా హసన్ ఒక్కడే 70 పరుగులతో రాయించగా మిగిలిన బ్యాటర్లందరూ విఫలమయ్యారు. దీంతో 90 పరుగులు తేడాతో టీమిండియా చేతిలో చిత్తుగా ఓడింది పాకిస్తాన్ అండర్ 19 జట్టు. ఇక లీగ్ మ్యాచ్ లో వరుసగా రెండు మ్యాచ్ లలో విజయం సాధించిన టీమిండియా అండర్ 19 జట్టు, దాదాపు సెమీస్ కు దూసుకెళ్లింది. మరో మ్యాచ్ లో గెలిస్తే, అధికారికంగా సెమీస్ కు వెళ్లనుంది.
అండర్ 19 పాకిస్తాన్ పై విజయం సాధించిన టీమిండియా పాయింట్ల పట్టికలో మొదటి స్థానానికి దూసుకు వెళ్ళింది. గ్రూప్ ఏలో ఉన్న టీమిండియా రెండు మ్యాచ్ లు ఆడి, రెండిటిలో విజయం సాధించింది. దీంతో నాలుగు పాయింట్లు సాధించిన అండర్ 19 టీమిండియా మొదటి స్థానానికి దూసుకు వెళ్ళింది. రెండో స్థానంలో పాకిస్తాన్ నిలిచింది. అటు గ్రూప్ బీలో శ్రీలంక మొదటి స్థానంలో ఉండగా, బంగ్లాదేశ్ రెండో స్థానంలో ఉంది.