E-Paper
Advertisement

IND VS NZ, 1ST ODI: బంగ్లాదేశ్ ఇజ్జ‌త్ తీసిన కోహ్లీ…నాగిన్ డ్యాన్స్ చేసి మ‌రీ

IND VS NZ, 1ST ODI: బంగ్లాదేశ్ ఇజ్జ‌త్ తీసిన కోహ్లీ…నాగిన్ డ్యాన్స్ చేసి మ‌రీ
Advertisement

IND VS NZ, 1ST ODI: టీమిడియా వర్సెస్ న్యూజిలాండ్ ( India vs New Zealand, 1st ODI)  మధ్య వన్డే మ్యాచ్ జరుగుతున్న నేపథ్యంలో బంగ్లాదేశ్ పరువు తీసాడు విరాట్ కోహ్లీ. టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో వేదికలు మార్చాలని డ్రామాలు చేస్తున్న బంగ్లాదేశ్ జట్టుకు వడోదర నుంచే సమాధానం చెప్పాడు విరాట్ కోహ్లీ. న్యూజిలాండ్ తో జరిగిన మొదటి వన్డేలో వికెట్ పడిన తర్వాత, టీమిండియా ప్లేయర్లు సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా బంగ్లాదేశ్ జట్టుకు కౌంటర్ ఇచ్చాడు విరాట్ కోహ్లీ. బంగ్లాదేశ్ ప్లేయర్లు నాగిన్ డాన్స్ చేస్తారన్న సంగతి తెలిసిందే. అయితే వాళ్లకు కౌంటర్ గా అదే తరహాలో విరాట్ కోహ్లీ కూడా డాన్స్ చేసి, పామును పట్టేసినట్లు సైగలు చేస్తాడు. ఈ వీడియో వైరల్ గా మారింది. ఇది చూసిన టీమిండియా ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు. విర్ర వీగిపోతున్న బంగ్లాదేశ్ క్రికెటర్లకు విరాట్ కోహ్లీ అదిరిపోయే కౌంటర్ ఇచ్చాడని మెచ్చుకుంటున్నారు.

Also Read: BCCI-Bangladesh: బంగ్లాదేశ్ జ‌ట్టులో చీలిక‌, శ‌త్రువులో జ‌ట్టులో “ఇండియన్ ఏజెంట్”..త‌ల‌ప‌ట్టుకుంటోన్న BCB

బంగ్లాదేశ్‌, టీమిండియాకు గొడ‌వ ఏంటీ ?

Advertisement

ఇండియా అలాగే బంగ్లాదేశ్ మధ్య గత కొన్ని రోజుల నుంచి ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంటున్న సంగతి తెలిసిందే. బంగ్లాదేశ్ లో హిందువులపై దాడులు జరుగుతున్న నేపథ్యంలో బీసీసీఐ చాలా సీరియస్ గా తీసుకుంది. బంగ్లాదేశ్ కు సంబంధించిన ముస్తాఫిజుర్ రహమాన్ లాంటి క్రికెటర్లను ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ లో ఆడకుండా చేసింది భారత క్రికెట్ నియంత్రణ మండలి. ఈ మేరకు అధికారిక ఆదేశాలు ఇచ్చింది. అయితే ముస్తాఫిజుర్ రహమాన్ పై బిసిసిఐ తీసుకున్న నిర్ణయం పైన వెంటనే బంగ్లాదేశ్ ప్రభుత్వం కూడా సంచలన నిర్ణయం తీసుకోవడం జరిగింది.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ప్రసారాలు తమ దేశంలో రాకూడదని బ్యాన్ కూడా విధించింది బంగ్లాదేశ్. ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాదు టీ20 ప్ర‌పంచ క‌ప్ 2026 టోర్న‌మెంట్ నేప‌థ్యంలో ఇండియాలో ప‌ర్య‌టించ‌బోమ‌ని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు వింత వాద‌న తెర‌పైకి తీసుకొచ్చింది. ఇండియాలో ప‌ర్య‌టిస్తే, త‌మ ప్లేయ‌ర్ల‌పై దాడులు జ‌రిగే ప్ర‌మాదం ఉంద‌ని, వాద‌న వినపిస్తూ ఐసీసీకి ఫిర్యాదు చేసింది బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు. అయితే బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు కోరుతున్న‌ట్లుగా ఐసీసీ ( ICC ) వినే అవ‌కాశాలే లేవు. ఈ మేర‌కు ఇప్ప‌టికే బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుకు స్ప‌ష్టం చేసింద‌ట ఐసీసీ.

బంగ్లాదేశ్ కు విరాట్ కోహ్లీ స్ట్రాంగ్ కౌంటర్

Advertisement

ఇండియా అలాగే బంగ్లాదేశ్ మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొన్న నేపథ్యంలో విరాట్ కోహ్లీ తాజాగా సైగ‌లు చేస్తూ ఆ దేశ పరువు తీశాడు. నాగిన్ డాన్స్ చేస్తూ వాళ్ళ ఇజ్జత్ తీశాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.

 

Also Read: Lizelle Lee: 100 కేజీల బ‌రువు, ద‌క్షిణాఫ్రికాకు రిటైర్మెంట్‌..కానీ WPL 2026లో క‌ళ్లు చెదిరే క్యాచ్‌..ఎవ‌రీ లిజెల్ లీ

Related News

2027 వ‌ర‌ల్డ్ క‌ప్ పాకిస్తాన్ కు అందిస్తా..లేక‌పోతే త‌ల న‌రుక్కుంటా ?

డ‌బుల్ సెంచ‌రీ చేయ‌కుండా ద్రవిడ్ అడ్డుకున్నాడు..స‌చిన్ సంచ‌ల‌నం !

కావ్య పాప‌ పెళ్లికి పాకిస్తాన్ క్రికెట‌ర్లు…SRHను బ్యాన్ చేయాలంటూ మ‌ళ్లీ పోస్టులు ?

పుట్టినిల్లా ? మెట్టినిల్లా ? బక్కోడిని ఆడుకుంటున్న ఐపీఎల్ ఫ్యాన్స్

ఒరేయ్ ఇన్ని రోజులు ఎక్క‌డున్నావ్ రా? న‌మ‌న్ ధీర్ బ్యాటింగ్ చూసి బిత్త‌ర‌పోయిన గంభీర్‌

విండీస్, టీమిండియా మ్యాచ్ రద్దు… వ‌ర్షం ప‌డి బ‌తికిపోయారంటూ తన్వీర్ అహ్మద్ కామెంట్!

పాకిస్తాన్ జట్టులో ప్రకంపనలు..కోచ్ మైక్ హెసన్ కాలర్ పట్టుకున్న షాహీన్ అఫ్రిది

ముస్లిం క్రికెట‌ర్ల‌కు టీమిండియాలో ఛాన్స్ ఇవ్వ‌రు కానీ పాకిస్తాన్ వ‌చ్చేయ్ !

Big Stories

Advertisement
×