E-Paper
Advertisement

Ind vs NZ 1st T20I: అభిషేక్ శ‌ర్మ స‌రికొత్త రికార్డు..5 వేల ప‌రుగులు పూర్తి, న్యూజిలాండ్ ముందు భారీ టార్గెట్‌

Ind vs NZ 1st T20I: అభిషేక్ శ‌ర్మ స‌రికొత్త రికార్డు..5 వేల ప‌రుగులు పూర్తి, న్యూజిలాండ్ ముందు భారీ టార్గెట్‌

Ind vs NZ 1st T20I: న్యూజిలాండ్ వర్సెస్ టీమిండియా ( India vs New Zealand, 1st T20I) మధ్య ఇవాళ తొలి టి20 మ్యాచ్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. అయితే ఇందులో మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా జట్టు భారీ స్కోర్ సాధించింది. నిర్ణీత 20 ఓవర్లు ఆడిన టీమిండియా, 7 వికెట్ల నష్టానికి 238 పరుగులు సాధించింది. టీమిండియా బ్యాటర్లందరూ దాదాపు రాణించారు. ముఖ్యంగా అభిషేక్ శర్మ ( Abhishek Sharma), సూర్య కుమార్ యాదవ్, చివరలో రింకు సింగ్, హార్దిక్ పాండ్యా రఫ్ఫాడించారు. ఈ నేపథ్యంలోనే న్యూజిలాండ్ ముందు 239 పరుగుల టార్గెట్ ఉంచింది టీం ఇండియా.

Also Read: Shoaib Malik Retirement: పాకిస్తాన్ కు ఎదురుదెబ్బ‌..PSL 2026 ప్రారంభాని కంటే ముందే షోయబ్ మాలిక్ రిటైర్మెంట్‌

న్యూజిలాండ్ ముందు భారీ టార్గెట్‌

టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ ( India vs New Zealand, 1st T20I)  మధ్య నాగ్ పూర్ లోని విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియం ( Vidarbha Cricket Association Stadium, Nagpur) వేదికగా తొలి టి20 మ్యాచ్ జరిగింది. అయితే ఈ మ్యాచ్ లో టాస్ ఓడిపోయి మొదట బ్యాటింగ్ చేయాల్సి వచ్చింది టీమిండియా. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 238 పరుగులు సాధించింది టీమిండియా. ఇందులో అభిషేక్ శర్మ 35 బంతుల్లో 84 పరుగులు సాధించగా కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ 32 పరుగులతో రాణించాడు. ఆ తర్వాత హార్దిక్ పాండ్యా 16 బంతుల్లో 25 పరుగులతో రెచ్చిపోయాడు. చివరలో ఫినిషర్ గా వచ్చిన రింకు సింగ్ తన పని ఫినిష్ చేశాడు. 20 బంతుల్లో 44 పరుగులతో అదరగొట్టాడు. చివరలో 20 పరుగులు సాధించాడు రింకు సింగ్. దీంతో టీమ్ ఇండియా భారీ స్కోర్ సాధించగలిగింది.

5000 పరుగుల క్లబ్ లో అభిషేక్ శర్మ

న్యూజిలాండ్ వర్సెస్ టీమ్ ఇండియా ( India vs New Zealand, 1st T20I) మధ్య జరిగిన మ్యాచ్ లో అభిషేక్ శర్మ ఇరగదీశాడు. కేవలం 35 బంతుల్లో 84 పరుగులతో రాణించాడు. ఇందులో ఎనిమిది సిక్సర్లు అలాగే ఐదు బౌండరీలు ఉన్నాయి. 240 స్ట్రైక్ రేటుతో ఊచ కోత కోశాడు అభిషేక్ శర్మ. ఈ నేపథ్యంలోనే టి20 క్రికెట్ చరిత్రలో 5000 పరుగులు వేగంగా పూర్తి చేసిన ప్లేయర్గా చరిత్ర సృష్టించాడు అభిషేక్ శర్మ. 25 సంవత్సరాల వయసులోనే ఈ ఘనత సాధించాడు. దీంతో 5000 పరుగులు వేగంగా సాధించిన ప్లేయర్లలో మొదటి వరుసలో నిలిచాడు. టి20 లలో వేగంగా 5 వేల పరుగులు సాధించిన ప్లేయర్లలో అభిషేక్ శర్మ తర్వాత వెస్టిండీస్ ఆటగాడు ఆండ్రీ రస్సెల్ ఉన్నాడు. ఆ తర్వాత టిమ్ డేవిడ్ ఉండగా నాలుగో స్థానంలో విల్ జాక్స్ నిలిచాడు. ఇక ఐదవ స్థానంలో ఆస్ట్రేలియా డేంజర్ ఆటగాడు గ్లెన్ మ్యాక్స్ వెల్ ఉన్న సంగతి తెలిసిందే. ఈ ఐదు వేల పరుగులు పూర్తి చేయడానికి అభిషేక్ శర్మ కేవలం 2898 బంతులు మాత్రమే ఎదుర్కొన్నాడు.

Also Read: Rinku Singh AI Video Controversy: దేవుళ్ల‌పై ఆ పోస్టులు…రింకు సింగ్ అరెస్ట్ కు రంగం సిద్ధం..అస‌లు ఏంటి ఈ వివాదం ?

 

 

 

 

 

 

Related News

Jos Buttler: న‌న్ను నంబ‌ర్ 4లో పంపి, ఆశిష్ నెహ్రానే స‌ర్వ నాశ‌నం చేశాడు !

బాబ‌ర్ పై ట్రోల్స్‌..ఇండియ‌న్స్ అనుకుని, ఆస్ట్రేలియా ఫ్యాన్స్ ను అరెస్ట్ చేసిన పాక్ !

మైదానంలోనే స్మోకింగ్..మ‌రో వివాదంలో టిమ్ డేవిడ్, ఇక ప‌ర్మినెంట్ బ్యాన్ !

టీమిండియాకు బిగ్ షాక్‌..బంగ్లాదేశ్ లోనే ఆసియా కప్ 2027, షెడ్యూల్ ఇదే

ఎలిమినేట‌ర్ లో ఓడిపోయిన‌ SRHకు ఊపిరిపోసిన పాకిస్తాన్ ప్లేయ‌ర్

రెండోసారి ఛాంపియ‌న్ గా RCB..ప్ర‌మాదంలో సూర్య‌, శ్రేయ‌స్ అయ్య‌ర్ భ‌విష్య‌త్తు !

Tanveer Ahmed: విరాట్ కోహ్లీ మ‌గాడైతే, పాకిస్తాన్ పిచ్ ల‌పై ఆడి చూపించాలి

లాహోర్ గ‌డ్డ‌పై విరాట్ కోహ్లీ ప్లకార్డులు…గూస్ బంప్స్ రావాల్సిందే

Big Stories

×