Ind vs NZ 2nd ODI: టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ ( India vs New Zealand, 2nd ODI ) మధ్య మరికాసేపట్లో రెండవ వన్డే ప్రారంభం కానుంది. ఇలాంటి తరుణంలో రాజ్ కోట్ వేదికగా జరగనున్న రెండో వన్డే టాస్ ప్రక్రియ ముగిసింది. ఇందులో టాస్ గెలిచిన న్యూజిలాండ్ జట్టు, మొదట బౌలింగ్ చేయాలని నిర్ణయం తీసుకుంది. న్యూజిలాండ్ టాస్ నెగ్గడంతో టీమిండియా మొదట బ్యాటింగ్ చేయనుంది. ఇవాల్టి పిచ్చి కారణంగా మొదట బౌలింగ్ చేయాలని న్యూజిలాండ్ నిర్ణయం తీసుకుంది.
టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ ( India vs New Zealand, 2nd ODI ) మధ్య వన్డే సిరీస్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ వన్డే సిరీస్ నేపథ్యంలో మొదటి మ్యాచ్ లో టీమిండియా గ్రాండ్ విక్టరీ కొట్టింది. ఇవాళ రాజ్ కోట్ లోని నిరంజన్ షా స్టేడియంలో ( Niranjan Shah Stadium, Khandheri, Rajkot ) మ్యాచ్ జరుగుతోంది. అయితే ఇందులో టాస్ గెలిచి న్యూజిలాండ్ మొదట బౌలింగ్ చేయనుంది. ఇక ఈ మ్యాచ్ ప్రసారాలు జియో హాట్ స్టార్ లో ఉచితంగా చూడవచ్చు. స్టార్ స్పోర్ట్స్ లో కూడా మ్యాచ్ తిలకించవచ్చు.
టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ ( India vs New Zealand, 2nd ODI ) మధ్య రెండో వన్డే నేపథ్యంలో తెలుగోడు నితీష్ కుమార్ రెడ్డికి అవకాశం కల్పించారు కెప్టెన్ శుభ్ మన్ గిల్. వాషింగ్టన్ సుందర్ స్థానంలో నితీష్ కుమార్ రెడ్డికు ఛాన్స్ వచ్చింది. ఇక అటు మరోసారి అర్షదీప్ సింగ్ కు అవమానమే జరిగింది. మొదటి వన్డేలో ప్రసిద్ధ్ కృష్ణ పెద్దగా రాణించలేదు. అయినా కూడా ప్రసిద్ధ్ కృష్ణకు ఛాన్స్ ఇచ్చాడు గంభీర్. దీంతో అర్షదీప్ సింగ్ కు నిరాశే ఎదురైంది. ఇక ఇవాళ్టి మ్యాచ్ లో ఆయుష్ బడోని ఆడతాడని జోరుగా ప్రచారం సాగింది. కానీ ట్రోలింగ్ చేస్తారని గంభీర్ భయపడినట్లు సమాచారం. ఈ తరుణంలోనే తెలుగోడు నితీష్ కుమార్ రెడ్డికి ( Nitish Kumar Reddy) ఛాన్స్ ఇచ్చారు.
న్యూజిలాండ్ (ప్లేయింగ్ XI): డెవాన్ కాన్వే, హెన్రీ నికోల్స్, విల్ యంగ్, డారిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్, మిచెల్ హే(wk), మైఖేల్ బ్రేస్‌వెల్ (c), జకారీ ఫౌల్క్స్, జేడెన్ లెన్నాక్స్, క్రిస్టియన్ క్లార్క్, కైల్ జామిసన్
టీమిండియా (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ, శుభ్‌మాన్ గిల్ (c), విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, KL రాహుల్(wk), రవీంద్ర జడేజా, నితీష్ కుమార్ రెడ్డి, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ
Also Read: Ayushi Soni retired out: WPLలోనే తొలిసారి రిటైర్డ్ ఔట్…రిజ్వాన్ కు జరిగిన అవమానమే ఆయుషి సోనికి