E-Paper
Advertisement

Cheapest Automatic Cars: ఇండియాలో అత్యంత చౌకైన ఆటోమేటిక్ కార్లు, జస్ట్ రూ. 4.75 లక్షల నుంచే..

Cheapest Automatic Cars: ఇండియాలో అత్యంత చౌకైన ఆటోమేటిక్ కార్లు, జస్ట్ రూ. 4.75 లక్షల నుంచే..
Advertisement

India’s Cheapest Automatic Cars 2026: రద్దీగా ఉండే సిటీ ట్రాఫిక్ లో ప్రతి రోజూ డ్రైవ్ చేసే వారికి ఆటోమేటిక్ కార్లు చక్కగా సూట్ అవుతున్నాయి. అందుకే, గత కొంత కాలంగా గేర్ల కార్లతో సమానంగా ఆటో మేటిక్ కార్లు అమ్మకాలు జరపుకుంటున్నాయి. అయితే, ఇప్పుడు తక్కువ ధరలోనూ పలు బడ్జెట్ ఫ్రెండ్లీ ఆటోమేటిక్ కార్లు అందుబాటులో ఉన్నాయి. దేశంలో అత్యంత సరసమైన మోడళ్లలో కొన్ని రూ. 4.75 లక్షల నుంచి ప్రారంభమవుతున్నాయి. ఇండియాలో టాప్ 5 చౌకైన ఆటోమేటిక్ కార్ల గురించి ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం

⦿ మారుతి సుజుకి S-ప్రెస్సో

మారుతి సుజుకి S-ప్రెస్సో VXi ఆప్ట్ AT దేశంలో అత్యంత సరసమైన ఆటోమేటిక్ కార్లలో ఒకటి. ఇది 65 bhp పవర్ ను అందిస్తుంది. 998cc పెట్రోల్ ఇంజిన్‌తో వస్తుంది. ఆటోమేటిక్ AMT వేరియంట్ ధర దాదాపు రూ. 4.75 లక్షలు(ఎక్స్ షోరూమ్). ఇది పెట్రోల్ వేరియంట్‌ లో  దాదాపు 25 కిలో మీటర్ల మైలేజీ అందిస్తుంది.

⦿ మారుతి సుజుకి ఆల్టో K10  

Advertisement

మారుతి సుజుకి ఆల్టో K10 AGS కూడా చౌక ధరలో అందుబాటులో ఉంది. ఇది 67 bhp పవర్, 90 Nm టార్క్‌ ను ఉత్పత్తి చేస్తుంది. 998cc పెట్రోల్ ఇంజిన్‌ ను ఉపయోగిస్తుంది. ఆటోమేటిక్ AGS వేరియంట్ ధర సుమారు రూ. 4.95–రూ. 5.6 లక్షలు (ఎక్స్-షోరూమ్) ఉంటుంది. ఇది పెట్రోల్ వేరియంట్‌ లో లీటర్‌కు 24.9 కి.మీ మైలేజీ అందిస్తుంది.

⦿ రెనాల్ట్ క్విడ్ 1.0

రెనాల్ట్ క్విడ్ 1.0 AMT తక్కువ ధరకు SUV స్టైల్ డిజైన్‌ ను కలిగి ఉంటుంది. ఇది 69 hp పవర్ ను ఉత్పత్తి చేసే 999cc 1.0-లీటర్ పెట్రోల్ ఇంజిన్‌ ను కలిగి ఉంటుంది. 5 స్పీడ్ AMT గేర్‌ బాక్స్‌ తో వస్తుంది. ఆటోమేటిక్ వేరియంట్ ధర సుమారు రూ. 5–రూ. 5.99 లక్షలు (ఎక్స్-షోరూమ్) ఉంటుంది. పెట్రో వెర్షన్ కారు, లీటర్‌కు 22 కి.మీ మైలేజ్ అందిస్తుంది.

⦿ మారుతి సుజుకి సెలెరియో  

Advertisement

మారుతి సుజుకి సెలెరియో VXI AMT  మంచి మైలేజ్, స్మూత్ డ్రైవింగ్ కు అనుకూలంగా ఉంటుంది. ఇది 68 hp పవర్, 91 Nm టార్క్ ఉత్పత్తి చేసే 998cc పెట్రోల్ ఇంజిన్‌ ను కలిగి ఉంది. ఆటోమేటిక్ వేరియంట్ ధర దాదాపు రూ. 5.60 లక్షలు (ఎక్స్-షోరూమ్) ఉంటుంది. ఇది దాదాపు 26.6 kmpl మైలేజీని అందిస్తుంది.

Read Also:  రోజు వారీ ప్రయాణాలకు బెస్ట్ ఎలక్ట్రిక్ కార్లు, టాప్ 5లో మీ ఛాయిస్ ఏంటి?

⦿ టాటా టియాగో  

టాటా టియాగో XTA AMT కూడా ఈ లిస్టులో ఉంది. ఇది దాదాపు 86 hp పవర్ ఉత్పత్తి చేసే 1.2-లీటర్ పెట్రోల్ ఇంజిన్‌ తో వస్తుంది. XTA AMT ఆటోమేటిక్ వేరియంట్ ధర దాదాపు రూ. 6.8–రూ. 7 లక్షలు (ఎక్స్-షోరూమ్) ఉంటుంది. ఇది దాదాపు 19–20 కిలో మీటర్ల మైలేజీ అందిస్తుంది.

Read Also: కారు విండోస్ ఓపెన్ చేసి కారు నడిపితే తక్కువ పెట్రోల్ ఖర్చవుతుందా? ఏసీతో నడిపితేనా?

Related News

మినీ సైజ్.. మ్యాక్సిమమ్ స్టైల్.. ఈ మైక్రో ఈవీలు భారత్‌లోకి వస్తే సూపర్ హిట్ పక్కా!

25 ఏళ్ల క్రితమే భారత్ లో పరుగులు తీసిన ఎలక్ట్రిక్ కారు.. మళ్లీ మార్కెట్ లోకి వస్తుందా?

లాంచ్‌కు ముందే క్రేజీ డీటైల్స్ లీక్.. కొత్త బ్రెజ్జాలో ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

ఆగస్టు 15న మహీంద్రా బిగ్ బ్లాస్ట్.. 3 కొత్త SUVలు వచ్చేస్తున్నాయ్!

టీవీఎస్ నుంచి సూపర్ సర్‌ ప్రైజ్.. ఒకేసారి 3 మోడల్స్ వచ్చేస్తున్నాయ్!

కొత్త బ్రెజ్జా To హిలక్స్.. 10 రోజుల్లో 3 క్రేజీ మోడల్స్ ఎంట్రీ!

టెస్లా నుంచి పిల్లల కోసం కొత్త బైక్.. రేట్ ఎంత అంటే?

EV బ్యాటరీల్లో ఏది సేఫ్? కొనుగోలు చేసే ముందు ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోవాల్సిందే!

Big Stories

Advertisement
×