E-Paper
Advertisement

Mumbai Crime: ట్రయాంగిల్ లవ్.. ప్రియుడి కోసం ఇద్దరు ఫైటింగ్. ఒకరిపై మరొకరు కాల్పులు

Mumbai Crime: ట్రయాంగిల్ లవ్.. ప్రియుడి కోసం ఇద్దరు ఫైటింగ్. ఒకరిపై మరొకరు కాల్పులు
Advertisement

Mumbai Crime: అసలే అమ్మాయి దొరక్క పెళ్లి కాని ప్రసాదులు పెరిగిపోతున్నారు. కానీ ఓ యువకుడి కోసం ఇద్దరు యువతుల మధ్య వివాదం తీవ్రమైంది. అందరూ చూస్తుండగా పట్టపగలు గొడవకు దిగారు. పట్టరాని కోపంతో ఓ యువతి మరో యువతిపై గన్‌తో  కాల్పులు జరిపింది. బాధిత యువతి చికిత్స పొందుతూ మృతి చెందింది. అసలు ఏమి జరిగింది?

ముంబైలో ట్రయాంగిల్ లవ్ స్టోరీ.. ప్రియుడి కోసం యువతుల కొట్లాట

Advertisement

ముంబైలోని గోవాండి శివాజీ నగర్‌కు చెందిన 19 ఏళ్ల షిఫా షేక్(అసలు పేరు కాదు) స్థానికంగా ఓ యువకుడిని లవ్ చేస్తోంది. ఇదివరకు ఆ యువకుడికి మరో యువతితో ప్రేమ వ్యవహారం నడుపుతున్నాడు. పాత ప్రియురాలికి తెలియకుండా షిఫాతో లవ్ కంటిన్యూ చేశాడు. ఇలాంటివి ఒకటి లేదా ఒక నెల మాత్రం దాయొచ్చు.

ఈ వ్యవహారం తెలియడంతో ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. చివరకు తీవ్రరూపం దాల్చాయి. ఈ నేపథ్యంలో మంగళవారం షిఫా షేక్‌కు మరో యువతి ఫోన్ చేసింది. నీతో మాట్లాడాలని ఉందంటూ ఫుర్కానియా ప్రాంతానికి రావాలని పిలిచింది. ఇద్దరు అక్కడకి చేరుకున్న తర్వాత ప్రియుడి కోసం గొడవ తీవ్రమైంది.

Advertisement

ఒకరిపై మరొకరు కాల్పులు, ఓ యువతి మృతి, ఆపై అరెస్ట్

ఇద్దరి మధ్య మాటా మాటా పెరగడంతో ఓ యువతి తనతో తెచ్చుకున్న గన్‌తో షిఫా షేక్‌పై కాల్పులు జరిపింది. పాయింట్ బ్లాంక్‌లో కాల్చడంతో బుల్లెట్ షిఫా తలలోకి దూసుకెళ్లింది. వెంటనే స్థానికులు బాధితురాలిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఘటన తర్వాత మరొక యువతి అక్కడి నుంచి పరారైంది.

ఈ ఘటన గురించి స్థానికులు సమాచారం ఇవ్వగానే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి, సీసీటీవీ ఫుటేజ్ ని పరిశీలించారు. నిందితులను గుర్తించారు. హత్య జరిగిన 12 గంటల్లో ప్రధాన నిందితురాలు, ఆమె ప్రియుడ్ని అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలు తన పేరెంట్స్, ఇద్దరు తోబుట్టువులతో గోవండిలోని కమలా రామన్ నగర్‌లో నివాసం ఉంటోంది.  యువతి తండ్రి నిర్మాణ రంగంలో కాంట్రాక్టర్‌గా పని చేస్తున్నాడు.

ALSO READ: ఘోర రోడ్డు ప్రమాదం.. కంటైనర్‌ని ఢీ కొట్టిన కారు, టెక్కీ సహా ఆరుగురు మృతి

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×