E-Paper
Advertisement

Shubman Gill neck injury: ICUలో టీమిండియా కెప్టెన్ గిల్‌.. షాక్ లో ఫ్యాన్స్ ?

Shubman Gill neck injury: ICUలో టీమిండియా కెప్టెన్ గిల్‌.. షాక్ లో ఫ్యాన్స్ ?
Advertisement

Shubman Gill neck injury: టీమిండియా వర్సెస్ దక్షిణాఫ్రికా ( India vs South Africa, 1st Test) మధ్య టెస్ట్ సిరీస్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈడెన్ గార్డెన్స్ ( Eden Gardens ) వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో ఇప్పటికే రెండు రోజుల ఆట పూర్తయింది. ఈ మ్యాచ్ లో టీమిండియా అదరగొడుతోంది. రేపు ఈ మ్యాచ్ లో శుభ్‌మ‌న్ గిల్ సేన విజయం సాధించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇలాంటి నేపథ్యంలో టీమిండియా జట్టుకు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. టీమిండియా కెప్టెన్ శుభ్‌మ‌న్ గిల్ ( Shubman Gill) ఆసుపత్రి పాలయ్యాడు. అతడు ప్రస్తుతం మెడ నొప్పితో బాధపడుతూ ఐసీయూలో ( Shubman Gill ) చికిత్స తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. కలకత్తాలోని ( Kolkata) ఓ ప్రముఖ ఆసుపత్రిలో ఐసీయూలో అడ్మిట్ అయ్యారట. దీనికి సంబంధించిన న్యూస్ ఇప్పుడు వైరల్ గా మారింది. ఇది చూసిన అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవ‌ల కాలంలోనే టీమిండియా ప్లేయ‌ర్ శ్రేయాస్ అయ్య‌ర్‌ ఐసీయూలో గాయం కారణంగా చికిత్స పొంద‌గా, ఇప్పుడు శుభ్‌మ‌న్ గిల్ ( Shubman Gill) కు అలాంటి పరిస్థితి వచ్చిందని ఎమోషనల్ అవుతున్నారు టీమిండియా ఫ్యాన్స్.

Also Read: Vaibhav Suryavanshi: వైభవ్ ఊచకోత.. 32 బంతుల్లో సెంచరీ,20 ఓవ‌ర్ల‌లో 297 ప‌రుగులు, SRH రికార్డ్ బ‌ద్ద‌లు

ICUలో టీమిండియా కెప్టెన్ గిల్‌

Advertisement

ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరుగుతున్న మొదటి టెస్ట్ సందర్భంగా శుభ్‌మ‌న్ గిల్ కు తీవ్ర గాయం అయింది. అతడు బ్యాటింగ్ చేస్తున్న సమయంలో గాయం అయింది. మూడు బంతులు ఆడిన తర్వాత మెడ నొప్పికి గురయ్యాడు. బంతేమీ తాకలేదు కానీ, విపరీతమైన మెడ నొప్పితో బాధపడ్డాడు కెప్టెన్ శుభ్‌మ‌న్ గిల్. దీంతో రంగంలోకి దిగిన టీమిండియా ఫిజీషియన్లు, గ్రౌండ్ లోకి వచ్చి, శుభ్‌మ‌న్ గిల్ కు కాసేపు ప్రథమ చికిత్స అందించారు. అయినప్పటికీ శుభ్‌మ‌న్ గిల్ నొప్పి ఎక్కడా తగ్గలేదు. దీంతో అతన్ని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం కోల్ క‌తాలోని ఓ ప్రముఖ ఆసుపత్రి ఐసీసీలో చికిత్స పొందుతున్నారట.

శుభ్‌మ‌న్ గిల్ కు శ్వాస తీసుకోవడం కాస్త కష్టమవుతోందట. దీంతో ICU లో చికిత్స అందిస్తున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉండగా శుభ్‌మ‌న్ గిల్ గాయం పై తాజాగా భారత క్రికెట్ నియంత్రణ మండలి స్పందించింది. శుభ్‌మ‌న్ గిల్ మెడ నొప్పితో బాధపడుతున్నాడని తెలిపింది. అతని మెడ కండరాలు పూర్తిగా పట్టినట్లు వెల్లడించింది భారత క్రికెట్ నియంత్రణ మండలి. ప్రస్తుతం దీనిపై వైద్యులు మెరుగైన వైద్యం అందిస్తున్నారని వివరించారు బీసీసీఐ అధికారి. ఇక హెల్త్ బులిటెన్ రిలీజ్ అయిన తర్వాత మొదటి టెస్టులో శుభ్‌మ‌న్ గిల్ ఆడతాడా? లేదా? అనేది రేపు ప్రకటిస్తామని వివరించింది బీసీసీఐ. కాగా ప్ర‌స్తుతం టీమిండియాను వైస్ కెప్టెన్సీ హోదాలో రిష‌బ్ పంత్ లీడ్ చేస్తున్నారు.

Advertisement

Also Read: KKR: అన్ని జట్లు తోపు ప్లేయర్లను కొనుగోలు చేస్తే, KKR మాత్రం కోచ్ లను తెచ్చుకుంటుంది.. వీళ్ళు ఏంటో, వీళ్ళ కట్టుబాట్లు ఏంటో

Related News

ఇమామ్ ఉల్ హక్ పెద్ద ద‌ద్ద‌మ్మ‌…త‌న‌ మామ ఇంజ‌మామ్ లాగా బ‌ద్ధ‌క‌స్తుడే

టీమిండియా ఓట‌మిని శాసించిన‌ సామ్‌ కర్రన్..అత‌ను వేసిన మూన్ బాల్స్ కొంప‌ముంచాయి

లార్డ్స్ వన్డేలో బాల్ టాంపరింగ్…శ్రేయస్ అయ్యర్ పై బ్యాన్?

లార్డ్స్ నుంచి అలిగి ఇంటికి వెళ్లిపోయిన గంభీర్..?

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ లో వాడిన‌ బంతుల్లో చిప్స్…షాకింగ్ వీడియో వైర‌ల్ !

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

Big Stories

Advertisement
×