Ind vs SA 5th T20I: టీమిండియా వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య ఇవాళ ఐదవ టి20 జరగనున్న సంగతి తెలిసిందే. అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ కు సంబంధించిన టాస్ కాసేపటి క్రితమే ముగిసింది. ఇందులో టాస్ నెగ్గిన దక్షిణాఫ్రికా, మొదట బౌలింగ్ చేయాలని నిర్ణయం తీసుకుంది. మ్యాచ్ రాత్రి జరుగుతున్న నేపథ్యంలో అహ్మదాబాద్ లో పొగ మంచు ఛాన్స్ ఉంటుంది. ఈ నేపథ్యంలోనే మొదట బౌలింగ్ చేయాలని నిర్ణయం తీసుకుంది దక్షిణాఫ్రికా. దీంతో టీమిండియా మొదట బ్యాటింగ్ చేయనుంది.
Also Read: Shubman Gill: గిల్ కుట్రలు..నేను ఆడకపోతే మ్యాచే రద్దు కావాలి, లక్నో స్టేడియంలోకి పొగ మంచు పంపి మరీ!
టీమిండియా వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య ఇప్పటికే నాలుగు టి20 మ్యాచ్ లు పూర్తయ్యాయి. ఇందులో టీమిండియా రెండు మ్యాచ్ లలో విజయం సాధించగా దక్షిణాఫ్రికా ఒకే ఒక్క టి20 విజయం సాధించింది. లక్నో వేదికగా జరగాల్సిన నాలుగవ టి20 రద్దయింది. ఇక ఇవాళ అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఐదవ టి20 జరగనుంది. ఈ మ్యాచ్ జియో హాట్ స్టార్ అలాగే స్టార్ స్పోర్ట్స్ లో ఉచితంగా చూడవచ్చు. 6:30 గంటలకు జరగగా సాయంత్రం ఏడు గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇందులో టీమిండియా విజయం సాధిస్తే టైటిల్ గెలవనుంది. అదే దక్షిణాఫ్రికా విజయం సాధిస్తే టి20 సిరీస్ 2-2 సమం కానుంది. అటు సంజు శాంసన్ కు ఎట్టకేలకు జట్టులో స్థానం దక్కించుకున్నాడు. గిల్ కు గాయం కావడంతో సంజు శాంసన్ కు అవకాశం వచ్చింది.
టీమిండియా వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య అహ్మదాబాద్ టెస్ట్ సందర్భంగా మూడు మార్పులతో బరిలోకి దిగుతోంది టీమిండియా. గిల్ కాలుకు దెబ్బ తగలడంతో ఇవాళ జరిగే ఐదవ టి20 కి దూరం కానున్నాడు. దీంతో అతని స్థానంలో ఎన్నో రోజుల నుంచి వెయిట్ చేస్తున్న సంజు శాంసన్ తుది జట్టులో స్థానం దక్కించుకున్నాడు. అలాగే హర్షిత్ రానా, కుల్దీప్ యాదవ్ లపై టీమిండియా యాజమాన్యం వేటు వేసింది. దీంతో ఆ ఇద్దరి స్థానంలో బుమ్రాతో పాటు వాషింగ్టన్ సుందర్ సుది జట్టులో స్థానం సంపాదించుకున్నారు. అయితే గిల్ తుది జట్టు నుంచి బయటకు వెళ్లడంతో దరిద్రుడు వెళ్లిపోయాడు అంటూ కామెంట్ చేస్తున్నారు ఫ్యాన్స్.
భారత్ (ప్లేయింగ్ XI): అభిషేక్ శర్మ, సంజు శాంసన్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, జితేష్ శర్మ(w), వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా, అర్షదీప్ సింగ్
దక్షిణాఫ్రికా (ప్లేయింగ్ XI): క్వింటన్ డి కాక్ (w), రీజా హెండ్రిక్స్, ఐడెన్ మార్క్రామ్(c), డెవాల్డ్ బ్రెవిస్, డేవిడ్ మిల్లర్, డోనోవన్ ఫెరీరా, జార్జ్ లిండే, మార్కో జాన్సెన్, కార్బిన్ బాష్, లుంగి ఎన్గిడి, ఒట్నీల్ బార్ట్‌మన్