IND VS SA ODI Series: టీమిండియా వర్సెస్ దక్షిణాఫ్రికా ( India vs South Africa) మధ్య నిన్నటి వరకు టెస్ట్ సిరీస్ జరిగింది. ఇందులో సఫారీలు గ్రాండ్ విక్టరీ కొట్టగా, ఇప్పుడు 3 వన్డేల సిరీస్ ఈ రెండు జట్ల మధ్య జరగనుంది. నవంబర్ 30వ తేదీ నుంచి దక్షిణాఫ్రికా వర్సెస్ టీమిండియా మధ్య 3 వన్డేల సిరీస్ నిర్వహించబోతున్నారు. ఈ మేరకు ఇప్పటికే షెడ్యూల్ తో పాటు రెండు జట్ల సభ్యులను కూడా ప్రకటించేశారు.
దక్షిణాఫ్రికా వర్సెస్ టీమ్ ఇండియా మధ్య నవంబర్ 30వ తేదీ నుంచి వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. మొట్టమొదటి వన్డే మ్యాచ్ రాంచి స్టేడియంలో నిర్వహించనున్నారు. తొలి వన్డే మ్యాచ్ మధ్యాహ్నం 1:30 గంటలకు జరగనుంది. అంటే మధ్యాహ్నం ఒంటి గంటకు టాస్ ప్రక్రియ ఉంటుందన్నమాట. దక్షిణాఫ్రికా వర్సెస్ టీమ్ ఇండియా మధ్య రెండవ వన్డే డిసెంబర్ మూడవ తేదీన రాయిపూర్ వేదికగా నిర్వహించనున్నారు. ఈ మ్యాచ్ కూడా మధ్యాహ్నం ఒకటిన్నర గంటలకు ప్రారంభం కానుంది. ఇక చిట్ట చివరి వన్డే మ్యాచ్ డిసెంబర్ 6వ తేదీన వైజాగ్ లోని వైయస్ రాజశేఖర్ రెడ్డి అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా జరగనుంది. ఈ మేరకు షెడ్యూలు ఫిక్స్ అయింది.
టీమిండియా వర్సెస్ దక్షిణాఫ్రికా ( India vs South Africa) మధ్య జరుగనున్న వన్డే సిరీస్ జియో హాట్ స్టార్ , స్టార్ స్పోర్ట్స్ లో స్ట్రీమింగ్ కానుంది. టెస్ట్ సిరీస్ కూడా ఇలాగే, జియో హాట్ స్టార్ లో ప్రసారం అయింది. అటు టీ20 సిరీస్ కూడా ఇందులో రానుంది. అయితే జియో సబ్‌స్క్రిప్షన్ చేసుకున్న వారు ఉచితంగా మ్యాచ్ లు తిలకించవచ్చను.
భారత్ ( Team India): కేఎల్ రాహుల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, తిలక్ వర్మ, రిషబ్ పంత్, వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, నితీష్ కుమార్ రెడ్డి, హర్షిత్ రాణా, రుతురాజ్ గైక్వాడ్, ప్రసిద్ధ్ కృష్ణ, అర్ష్దీప్ సింగ్, ధ్రువ్ జురెల్
దక్షిణాఫ్రికా ( SA): టెంబా బావుమా (కెప్టెన్), ఒట్నీల్ బార్ట్‌మాన్, కార్బిన్ బాష్, మాథ్యూ బ్రీట్జ్‌కే, డెవాల్డ్ బ్రీవిస్, నాండ్రే బర్గర్, క్వింటన్ డి కాక్, టోనీ డి జోర్జి, రూబిన్ హెర్మన్, కేశవ్ మహరాజ్, మార్కో జాన్సెన్, ఐడెన్ మార్క్‌రామ్, లుంగి ఎన్‌గిడి, ర్యాన్ రికెల్‌టన్, ప్రెయాన్ రికెల్‌టన్,
IND VS SA ODI SERIES SCHEDULE
I think #Vizag match will be a Decider MATCH#INDvSA #TeamIndia pic.twitter.com/1aVb8laa2r
— Cric Venky (@VenkyK_Offic) November 24, 2025