E-Paper
Advertisement

Ban Players Coma: టీ20 ప్ర‌పంచ క‌ప్ ఎఫెక్ట్..సంక్షోభంలో బంగ్లాదేశ్ క్రికెట్‌…కోమాలోకి వెళ్లిన‌ ఇద్ద‌రు ఆట‌గాళ్లు

Ban Players Coma: టీ20 ప్ర‌పంచ క‌ప్ ఎఫెక్ట్..సంక్షోభంలో బంగ్లాదేశ్ క్రికెట్‌…కోమాలోకి వెళ్లిన‌ ఇద్ద‌రు ఆట‌గాళ్లు
Advertisement

Ban Players Coma: టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ( T20 World Cup 2026 tournament)  బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డును ( bangladesh cricket board ) కుదిపేస్తోంది. అర్ధాంతరంగా ఈ టోర్నమెంట్ ను ( Bangladesh boycott T20 wc 2026) బహిష్కరించిన బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డ్, కోట్లల్లో నష్టపోవాల్సిన పరిస్థితి నెలకొంది. టోర్నమెంట్ బహిష్కరించినందుకుగాను ఐసీసీకి కచ్చితంగా డబ్బులు చెల్లించాల్సిందే. దానికి తోడు ఇండియాతో కూడా సంబంధాలు తెంచుకుంది బంగ్లాదేశ్. పాకిస్తాన్ మాట విన్న బంగ్లా, ఇప్పుడు క‌ష్టాలు ఎదుర్కొంటోంద‌వి. అయితే ఈ వ్యవహారంపై బంగ్లాదేశ్ క్రికెట్ జట్టుకు సంబంధించిన అసిస్టెంట్ కోచ్ మహమ్మద్ సలావుద్దీన్ ( Ban assistant coach salahuddin) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ నుంచి బంగ్లాదేశ్ త‌ప్పుకున్న‌ నేపథ్యంలో తమ జట్టుకు సంబంధించిన ఇద్దరు క్రికెటర్లు కోమాలోకి ( Ban Players Coma ) వెళ్లారని.. ఐదు రోజులుగా వాళ్ల పరిస్థితి దారుణంగా తయారైందని బాంబు పేల్చాడు. దీనికి మాజీ క్రీడా సలహాదారులు ఆసీఫ్ న‌జ్రుల్ ( Bangladesh ex-sports advisor asif nazrul) కార‌ణం అంటూ ఆగ్ర‌హించారు. దీంతో సలావుద్దీన్ చేసిన కామెంట్లు దుమారం రేపుతున్నాయి.

Also Read: T20 World Cup Super 8: ద‌క్షిణాఫ్రికాతో తొలి మ్యాచ్‌, టీమిండియా సూప‌ర్ 8 షెడ్యూల్ ఇదే..తెలుగోడికి అన్యాయం, సంజుకు బంప‌ర్ ఆఫ‌ర్ !

సంక్షోభంలో బంగ్లాదేశ్ క్రికెట్‌…కోమాలోకి వెళ్లిన‌ ఇద్ద‌రు ఆట‌గాళ్లు

Advertisement

టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ను బంగ్లాదేశ్ బహిష్కరించిన సంగతి తెలిసిందే. ముస్తాఫిజుర్ రహమాన్ ను (Mustafizur Rahman) ఐపీఎల్ ఆడకుండా భారత క్రికెట్ నియంత్రణ మండలి ఆదేశాలు ఇచ్చింది. దీంతో టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ఆడబోమని బంగ్లాదేశ్ ప్రభుత్వమే ప్రకటించింది. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు సంబంధించిన సభ్యులను అడగకుండానే అక్కడి తాత్కాలిక ప్రభుత్వం తమ నిర్ణయాన్ని వెల్లడించింది. దీంతో టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ నుంచి బంగ్లాదేశ్ వైదొలిగింది.

ఇక ఈ టోర్నమెంట్ నుంచి బంగ్లాదేశ్ బయటకు వచ్చిన నేపథ్యంలో.. ఇద్దరు తమ జట్టుకు సంబంధించిన ప్లేయర్లు కోమాలోకి వెళ్లినట్లు తాజాగా బంగ్లాదేశ్ అసిస్టెంట్ కోచ్ మహమ్మద్ సలావుద్దీన్ ( Ban assistant coach salahuddin) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఐదు రోజులుగా వీళ్ళ పరిస్థితి దారుణంగా ఉందని పేర్కొన్నాడు. ఇదంతా జరగడానికి కారణం బంగ్లాదేశ్ మాజీ స్పోర్ట్స్ అడ్వైజర్ ఆసీఫ్ న‌జ్రుల్ అంటూ ఫైర్ అయ్యారు. టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ఆడకుండా తప్పుడు నిర్ణయాలు తీసుకున్నాడని.. దానివల్ల బంగ్లాదేశ్ క్రికెటర్లు మానసిక ఆందోళనకు గురయ్యారని మహమ్మద్ సలావుద్దీన్ వెల్లడించారు. ఇప్పుడు ఇద్దరు బంగ్లాదేశ్ క్రికెటర్ల పరిస్థితి దారుణంగా ఉందని పేర్కొన్నారు.

Advertisement

ఇది ఇలా ఉండ‌గా, ముందుగా బంగ్లాదేశ్ సర్కారే.. టి20 ప్రపంచ కప్ ఆడబోమని వెల్లడించారు మాజీ స్పోర్ట్స్ అడ్వైజర్ ఆసీఫ్ న‌జ్రుల్. కానీ టోర్నమెంట్ ప్రారంభమైన తర్వాత ఆసీఫ్ మాట మార్చారు. బాయ్ కాట్ నిర్ణ‌యం స‌ర్కార్ ది కాద‌ని, బంగ్లాదేశ్ క్రికెటర్లు, బోర్డుదే అంటూ వ్యాఖ్యానించారు. ఇండియాకు వెళ్తే చంపేస్తారేమోన‌ని బంగ్లా క్రికెట‌ర్లు భ‌య‌ప‌డిపోయార‌ని ఆసీఫ్ న‌జ్రుల్ వెల్ల‌డించారు. ఇక ఇప్పుడు బంగ్లాదేశ్ లో కొత్త స‌ర్కార్ ఏర్ప‌డింది. ఈ త‌రుణంలోనే మాజీ స్పోర్ట్స్ అడ్వైజర్ ఆసీఫ్ న‌జ్రుల్ త‌ప్పుల‌ను బంగ్లాదేశ్ అసిస్టెంట్ కోచ్ మహమ్మద్ సలావుద్దీన్ బ‌య‌ట‌పెడుతున్నారు.

Also Read: Hardik Pandya: హార్దిక్ పాండ్యా త‌ప్పిదం, సూప‌ర్ 8 కంటే ముందే టీమిండియాకు షాక్‌..గ్రౌండ్ లో ప‌డిపోయిన ప్లేయ‌ర్‌

 

 

 

Related News

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విజేతగా స్పెయిన్‌..ఏకంగా 16 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త చ‌రిత్ర‌

రోహిత్ శ‌ర్మ లార్డ్స్ సెంచ‌రీ వెనుక సీక్రెట్ ఇదే, అత‌ని వ‌ల్లే ల‌క్ క‌లిసివ‌చ్చిందా?

గంభీర్ వెనక కోహ్లీ కుప్పిగంతులు..అస‌భ్యక‌రంగా చేతులు చూపిస్తూ డ్యాన్స్

లార్ట్స్ మైదానంలో ఈ గంట కొట్ట‌డానికి కార‌ణం ఏంటి? దీని వెనుక ఉన్న‌ర‌హ‌స్యం

రోహిత్ శ‌ర్మ‌, కోహ్లీ ఇద్ద‌రూ టీమిండియాకు హార్ట్ బీట్ లాంటోళ్లు..వాళ్ల‌ను ట‌చ్ చేయెద్దు

Big Stories

Advertisement
×