E-Paper
Advertisement

Transport Infrastructure: 6 గంటల ప్రయాణం.. ఇక 20 నిమిషాల్లోనే! కేంద్ర క్యాబినెట్ సంచలన నిర్ణయాలు

Transport Infrastructure: 6 గంటల ప్రయాణం.. ఇక 20 నిమిషాల్లోనే! కేంద్ర క్యాబినెట్ సంచలన నిర్ణయాలు
Advertisement

Transport Infrastructure: కేంద్ర క్యాబినెట్ ఇటీవల తీసుకున్న నిర్ణయాలు దేశవ్యాప్తంగా రవాణా వ్యవస్థను సమూలంగా మార్చేలా ఉన్నాయి. సుమారు 1,60,504 కోట్ల రూపాయల భారీ వ్యయంతో కూడిన ఈ ప్రాజెక్టులు మౌలిక సదుపాయాల కల్పనలో కీలక మైలురాయిగా నిలవనున్నాయి. వీటిలో ప్రధానంగా అస్సాం ప్రాజెక్ట్ , తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన రోడ్డు ప్రాజెక్టులు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.

అస్సాం అండర్ వాటర్ టన్నెల్

Advertisement

అస్సాంలో బ్రహ్మపుత్ర నది కింద గోహుపూర్ – నుమాలిఘర్ మధ్య అత్యాధునిక అండర్ వాటర్ రోడ్డు టన్నెల్ నిర్మాణానికి క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్ట్ పై ప్రస్తుతం ఉన్న 250 కిలోమీటర్ల దూరం ఈ టన్నెల్ వల్ల కేవలం 34 కిలోమీటర్లకు తగ్గుతుంది.దీని వల్ల 6 గంటల సుదీర్ఘ ప్రయాణం ఇకపై కేవలం 20 నిమిషాల్లోనే పూర్తవుతుంది. ఇది రైల్వే లైన్ , నేషనల్ హైవే రెండింటినీ కలుపుతూ సాగే వ్యూహాత్మక ప్రాజెక్ట్.

తెలుగు రాష్ట్రాల కనెక్టివిటీ

Advertisement

తెలంగాణ , కర్ణాటక సరిహద్దు ప్రాంతాలకు మేలు చేకూర్చేలా గూడె బేల్లూరు – మహబూబ్ నగర్ సెక్షన్ మధ్య నాలుగు లైన్ల రోడ్డు నిర్మాణానికి 3 వేల 175 కోట్ల రూపాయలు కేటాయించారు. దీనివల్ల మహబూబ్ నగర్, నారాయణపేట, దేవరకద్ర ప్రాంతాల నుండి హైదరాబాద్ , రాయచూర్ మధ్య కనెక్టివిటీ పెరుగుతుంది. ముఖ్యంగా హైదరాబాద్ – పనాజీ (గోవా) కారిడార్ అభివృద్ధిలో భాగంగా 80 కిలోమీటర్ల మేర ఈ కొత్త రహదారిని నిర్మించనున్నారు.

రైల్వే , ఇతర రహదారి ప్రాజెక్టులు

రైల్వే రద్దీని తగ్గించడానికి , సరుకు రవాణాను వేగవంతం చేయడానికి పలు కీలక మార్గాల్లో 3వ, 4వ లైన్ల ఏర్పాటుకు ఆమోదం లభించింది. అలాగే.. దమాసియా – బిటాడ – నర్సాపూర్ – మలోత సెక్షన్ (₹4,584 కోట్లు), గోతి – ట్రిమ్బక్ – పాల్గర్ సెక్షన్ (₹3,320 కోట్లు) అప్‌గ్రేడేషన్ పనులు చేపట్టనున్నారు. ఈ నిర్ణయాల వల్ల ఆర్థిక కార్యకలాపాలు పెరగడమే కాకుండా.. పర్యాటక , వాణిజ్య రంగాలు భారీగా పుంజుకుంటాయి.

Also Read: చంద్రబాబు, జగన్, పవన్.. ముగ్గురూ బీజేపీకి బానిసలే.. ఏపీసీసీ అధ్యక్షురాలు సంచలన వ్యాఖ్యలు

Related News

రిలయన్స్, బ్లింకిట్, జొమాటో సిబ్బందిపై కేసు నమోదు.. ఎందుకంటే..?

మాజీ సీఎం కోసం.. 9 హత్యలు చేశా.. లైవ్‌లో ఒప్పుకున్న ఎమ్మెల్యే!

రాత్రి నూడుల్స్.. ఉదయానికి శవాలు.. ఒకే కుటుంబంలో 5 గురు మృతి!

ఈ నెలలో పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు.. ఆ రెండు అంశాలపై వాడీ వేడీ రచ్చ!

ఢిల్లీలో వీడని సస్పెన్స్.. అభిజిత్ దీప్కే ఆచూకిపై గందరగోళం.. నేహా బోరా తీవ్ర ఆరోపణలు!

బీజేపీ అగ్రనేతకు అస్వస్థత.. ఆసుపత్రిలో చేరిన ఎల్.కే. అద్వానీ.. ప్రస్తుతం ఎలా ఉన్నారంటే?

స్పామ్, ఫ్రాడ్ కాల్స్‌ టెన్షన్‌కు ఇక చెక్.. కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం?

ప్రపంచాన్ని సైతం కదిలించిన చరిత్ర.. అక్టోబర్ 17 ప్రత్యేకత ఏమిటో మీకు తెలుసా..?

Big Stories

Advertisement
×