E-Paper
Advertisement

Indian Team Semi final Qualification: టీమిండియా సెమీ ఫైన‌ల్ కు చేరాలంటే ఒక్క‌టే మార్గం..వ‌ర్షం ప‌డాల‌ని కొబ్బ‌రికాయ‌లు కొట్టాల్సిందే

Indian Team Semi final Qualification:  టీమిండియా సెమీ ఫైన‌ల్ కు చేరాలంటే ఒక్క‌టే మార్గం..వ‌ర్షం ప‌డాల‌ని కొబ్బ‌రికాయ‌లు కొట్టాల్సిందే
Advertisement

Indian Team Semi final Qualification:  టి20 ప్రపంచకప్ 2026 టోర్నమెంట్ ( T20 World Cup 2026 tournament ) నేపథ్యంలో టీమిండియా సెమీ ఫైనల్ ( Indian Team Semi final Qualification) చేరుకోవడం పై సందిగ్ధత నెలకొంది. దక్షిణాఫ్రికా చేతిలో ఓడిపోయిన టీమిండియా సెమీఫైనల్ వెళ్లడం కష్టమే అని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. దీనికి టీమిండియా రన్ రేట్ మైనస్ లో ఉండటమే కారణం అంటున్నారు. అలాగే జింబాబ్వేపై వెస్టిండీస్ వందకు పైగా పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో టీమ్ ఇండియాకు కొత్త టెన్షన్ మొదలైంది. టీమిండియా సెమీ ఫైనల్ వెళ్లడం మరింత సంక్లిష్టంగా మారింది.

Also Read: Ind T20i wc 2026-WC 2011: గంభీర్ అంధ భ‌క్తుల వెర్రి ప్ర‌చారం..2011 వ‌ర‌ల్డ్ క‌ప్ హిస్ట‌రీ, 2026లో రిపీట్ అవుతుందంటూ ఓవరాక్ష‌న్‌

సెమీ ఫైనల్ కు టీమిండియా చేరాలంటే ఎలా ?

Advertisement

టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్  (T20 World Cup 2026 tournament ) నేపథ్యంలో ప్రస్తుతం సూపర్ 8 మ్యాచ్ లు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో టీమిండియా సెమీ ఫైనల్ చేరాలంటే కొన్ని మార్గాలు ఉన్నాయి. ఫిబ్రవరి 26వ తేదీన దక్షిణాఫ్రికా వర్సెస్ వెస్టిండీస్ మధ్య అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా మధ్యాహ్నం 3 గంటలకు మ్యాచ్ ఉంది. ఈ మ్యాచ్లో దక్షిణాఫ్రికా గెలిచి… వెస్టిండీస్ ను ఓడించాలి. అదే సమయంలో టీమిండియా, తన తదుపరి మ్యాచ్ లు జింబాబ్వే అలాగే వెస్టిండీస్ పై గ్రాండ్ విక్టరీ కొట్టాలి. ఒకవేళ ఫిబ్రవరి 26వ తేదీన జరగాల్సిన దక్షిణాఫ్రికా వర్సెస్ వెస్టిండీస్ మ్యాచ్ లో విండీస్ విజయం సాధిస్తే, టీమిండియా సెమీ ఫైనల్ చేరడం చాలా కష్టం. అద్భుతం జరిగితే తప్ప టీమిండియా సెమీ ఫైనల్ చేరడం అసాధ్యం. ఇక టీమిండియా సెమీఫైనల్ చేరాలంటే వరుణుడు కూడా కరుణించాలి. దక్షిణాఫ్రికా వర్సెస్ వెస్టిండీస్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావాలి.

అదే సమయంలో టీమిండియా, తన రెండు మ్యాచ్ లలో గెలవాలి. అప్పుడు సెమీ ఫైనల్ ఈజీగా టీమిండియా చేరే ఛాన్సులు ఉంటాయి. అలా కాకుండా దక్షిణాఫ్రికా పై వెస్టిండీస్ విజయం సాధిస్తే… జింబాబ్వే చేతిలో దక్షిణాఫ్రికా చిత్తుగా పోవాలి. అప్పుడు టీ మీడియాకు ఛాన్స్ ఉంటుంది. ఇలా టీమిండియా సెమీ ఫైనల్ చేరాలంటే వెయ్యికి పైగా చిక్కుముడులు ఉన్నాయి. ఈ అన్ని బాధల కంటే దక్షిణాఫ్రికా వర్సెస్ వెస్టిండీస్ మధ్య జరిగే మ్యాచ్ కు వర్షం పడి, టీమిండియా కు లైన్ క్లియర్ చేయాలని ఫాన్స్ కోరుతున్నారు. దీనికోసం 1000 కొబ్బరికాయలు కొడతామని ఫ్యాన్స్ కూడా చెబుతున్నారు. కాగా సూప‌ర్ 8 లో భాగంగా టీమిండియా, త‌న త‌ర్వాతి మ్యాచ్ లో భాగంగా జింబాబ్వేతో ( India vs Zimbabwe ) త‌ల‌ప‌డ‌నుంది. అటు వెస్టిండీస్ పై మార్చి 1వ తేదీన ఆడ‌నుంది.

Advertisement

Also Read:  Hardik Pandya-Mahieka Sharma: హార్దిక్ పాండ్యా ఇంట్లోనే శ‌త్రువులు, ఔట్ కాగానే చప్పట్లు కొట్టిన మహికా శర్మ

 

?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==

Related News

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విజేతగా స్పెయిన్‌..ఏకంగా 16 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త చ‌రిత్ర‌

రోహిత్ శ‌ర్మ లార్డ్స్ సెంచ‌రీ వెనుక సీక్రెట్ ఇదే, అత‌ని వ‌ల్లే ల‌క్ క‌లిసివ‌చ్చిందా?

గంభీర్ వెనక కోహ్లీ కుప్పిగంతులు..అస‌భ్యక‌రంగా చేతులు చూపిస్తూ డ్యాన్స్

లార్ట్స్ మైదానంలో ఈ గంట కొట్ట‌డానికి కార‌ణం ఏంటి? దీని వెనుక ఉన్న‌ర‌హ‌స్యం

రోహిత్ శ‌ర్మ‌, కోహ్లీ ఇద్ద‌రూ టీమిండియాకు హార్ట్ బీట్ లాంటోళ్లు..వాళ్ల‌ను ట‌చ్ చేయెద్దు

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 ఫైన‌ల్ మ్యాచ్ టైమింగ్స్ ఇవే..ఇండియాలో లైవ్ ఎప్పుడంటే ?

రెండు మ్యాచ్ ల‌కే గాయ‌ప‌డ్డ బుమ్రాతో వ‌ర‌ల్డ్ క‌ప్ గెలుస్తారా? గ‌వాస్క‌ర్ సీరియ‌స్‌

2027 వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్..త‌న డ్రీమ్ టీమిండియాను ప్ర‌క‌టించిన ర‌విశాస్త్రి

Big Stories

Advertisement
×