BigTV English

Pro-ISIS Threat to Ind Vs Pak T20 Match: ఇండో-పాక్ మ్యాచ్‌కు బెదిరింపులు.. “యు వెయిట్ ఫర్ ద మ్యాచ్, అండ్ మి వెయిట్ ఫర్ యు”.. న్యూయార్క్ పోలీసులు అలర్ట్!

Pro-ISIS Threat to Ind Vs Pak T20 Match: ఇండో-పాక్ మ్యాచ్‌కు బెదిరింపులు.. “యు వెయిట్ ఫర్ ద మ్యాచ్, అండ్ మి వెయిట్ ఫర్ యు”.. న్యూయార్క్ పోలీసులు అలర్ట్!

India vs Pakistan Match T20 Threats by Pro-ISIS Group: అమెరికా-వెస్టిండిస్ వేదికగా రెండురోజుల్లో టీ 20 ప్రపంచకప్ టోర్నీ మొదలుకానుంది. దాదాపు నెల రోజుల క్రికెట్ సమరం జరగనుంది. ఇంగ్లాండ్, పాకిస్థాన్ జట్లు తప్పితే 18 దేశాల జట్లు అక్కడికి చేరుకున్నాయి. ప్రాక్టీసులో నిమగ్నమవుతున్నాయి.


జూన్ 9న భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ రెండ్లు మ్యాచ్ అంటే హైఓల్టేజ్ స్థాయిలో ఉంటుంది. ఇరుదేశాల నుంచి మాజీ ఆటగాళ్లు అమెరికాకు వెళ్లేందుకు ప్రిపేర్ అవుతున్నారు. న్యూయార్క్ సిటీలోని మన్‌హట్టన్‌లో ఉన్న ఐసెస్ హోవర్ స్టేడియంలో మ్యాచ్ జరగనుంది. అయితే ఈ మ్యాచ్‌కు ఐఎస్ఐఎస్ అనుకూల గ్రూపు నుంచి ముప్పు పొంచి ఉందంటూ వార్తలు వస్తున్నాయి.

అందుకు సంబంధించిన ఓ పోస్టర్ సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతోంది. దానిపై యు వెయిట్ ఫర్ ద మ్యాచ్, అండ్ మి వెయిట్ ఫర్ యు అని రెడ్ కలర్‌తో రాసి ఉంది. స్టేడియం బ్యాక్‌డ్రాప్‌లో డ్రోన్ కెమెరాల సింబల్ కూడా ఉన్నాయి. దీంతో న్యూయార్క్ పోలీసులు అలర్ట్ అయ్యారు.


Also Read: ఫ్రెంచ్ ఓపెన్‌లో ఆసక్తికరంగా మ్యాచ్‌లు, ఒసాకపై ఇగా గెలుపు

అటు ఐసీసీ (అంతర్జాతీయ క్రికెట్ మండలి) రియాక్ట్ అయ్యింది. టోర్నీలో ఆటగాళ్లకు భద్రతకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపింది. నిరంతరం భద్రతను పర్యవేక్షించేందుకు అధికారులతో కలిసి పనిచేస్తున్నట్లు పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని, ఒకవేళ ఏదైనా ముప్పు ఉందని భావిస్తే, అందుకు అనుగుణంగా ప్లాన్ చేస్తామని తెలిపింది.

అటు న్యూయార్క్ గవర్నర్ కూడా స్పందించారు. భారత్-పాక్ మ్యాచ్‌కు భద్రతా చర్యలు చేపట్టాలని న్యూయార్క్ పోలీసులను ఆదేశించినట్టు చెప్పారు. నిరంతరం నిఘా, పూర్తిస్థాయిలో తనిఖీ ప్రక్రియ ఉంటుందన్నారు. ఇదిలావుండగా మ్యాచ్‌కు ఉగ్ర ముప్పు ఏమీలేదని న్యూయార్క్ గవర్నర్ కార్యాలయం తెలిపింది. ఇదిలావుండగా కొత్తగా నిర్మించిన స్టేడియంలో దాదాపు 34 వేల ప్రేక్షకులు కూర్చొని మ్యాచ్ చూడొచ్చు.

Tags

Related News

Mohamed Siraj : సేమ్ టు సేమ్ డిట్టు దించేశారు… మహమ్మద్ సిరాజ్ కూడా కుళ్ళుకోవాల్సిందే

Travis head – SRH Fan : ఆస్ట్రేలియా గడ్డపై SRH ఫ్యాన్స్ రచ్చ చూడండి.. హెడ్ ను అడ్డంగా పట్టుకొని

IPL 2026 : SRH కోసం మరోసారి రంగంలోకి రజినీకాంత్?

World cup 2027: గిల్ కెప్టెన్సీలో రోహిత్ శర్మ.. ఇంత దారుణమా?

Yash Dayal: RCB బౌలర్ దయాల్ కు ఎదురుదెబ్బ.. ఐపీఎల్ 2026 నుంచి ఔట్?

Jos Butler : ఇంగ్లండ్ స్టార్ క్రికెటర్ ఇంట్లో తీవ్ర విషాదం.. ఇక క్రికెట్ కు గుడ్ బై ?

Big Stories

×